రంజాన్ పండుగ దృష్ట్యా రేపటి నుంచి బంద్‌ను సడలించేందుకు సమైక్యాంధ్రా జేఏసీ నిర్ణయం తీసుకుంది
ప.గో: రంజాన్ పండుగ దృష్ట్యా రేపటి నుంచి బంద్‌ను సడలించేందుకు సమైక్యాంధ్రా జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఏలూరు రెవెన్యూ భవన్‌లో మంగళవారం భేటీ అయిన సమైక్యాంధ్రా జేఏసీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాఠశాలలు, వ్యాపార సంస్థలు తెరుచుకుని సూచనలు కన్పిస్తున్నాయి. కాగా, నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 8న అన్ని సంఘాలతో మహాధర్నా చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. 9వ తేదీన ఏలూరు ఆశ్రమ్ పాఠశాల వద్ద జాతీయ రహదారిని దిగ్భందించనున్నామని, 10వ తేదీన విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఆగస్టు 11వ తేదీన సామూహిక దీక్షలకు దిగుతామని, 12న ఏలూరులో సంపూర్ణ బంద్ ప్రకటించనున్నట్లు వారు తెలిపారు.