బ్రిటన్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న బ్రెగ్జిట్ విషయమై థెరిసా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రెగ్జిట్ తీర్పును అమలుచేయాలంటే థెరిసా ప్రభుత్వం పార్లమెంటు అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందేనని ఆ దేశ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు అనుమతి లేకుండా లిస్బన్ ట్రిటీకి చెందిన ఆర్టికల్ 50ను ప్రభుత్వం అమలుచేయలేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు స్పష్టం చేసింది.
Published Sat, Nov 5 2016 8:22 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
Advertisement