‘గంజాయి’ ముఠా అరెస్ట్ | Cannabis gang arrested in Visakhapatnam | Sakshi

Jun 29 2015 10:48 AM | Updated on Mar 22 2024 10:56 AM

అక్రమంగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి సుమారు రూ.4 లక్షల విలువ గల 410 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాజువాక డీసీపీ రాంగోపాల్‌నాయక్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి పెందుర్తి రక్ష క్ ఎస్‌ఐ రమేష్ తన సిబ్బందితో కలసి సుజాతనగర్‌లో ఒక ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిలువ ఉంచిన 410 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చింతపల్లి మండలం లోతుగెడ్డ గ్రామానికి చెందిన గుల్లెల వినోద్‌కుమార్, రోలుగుంట మండలం వాడిప గ్రామానికి చెందిన ముక్కడపల్లి నాగేశ్వరరావు, వేపగుంట, అప్పలనరసయ్య కాలనీకి చెందిన అబ్దుల్‌బాషా, చింతపల్లి, లోతుగడ్డ ప్రాంతానికి చెందిన గుల్లెల లోవరాజు, తమిళనాడుకు చెందిన సయ్యద్‌ఖాజా, ఒడిశా కటక్ జిల్లా, చౌదా గ్రామానికి చెందిన ఆసిత్ దిబేటాలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు,

Advertisement
 
Advertisement

పోల్

Advertisement