ధిక్కరించకపోతే, దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నించిన కవి డా.పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రజనీగంధ కవితా సంకలనానికి గాను ఈయనకు ఈ అవార్డును ప్రకటించారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్‌కు భాషా సమ్మాన్ అవార్డును ప్రకటించారు. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమి 2016 వార్షిక అవార్డులను ప్రకటించింది. కవిత్వానికి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు మొత్తం 24 మందికి ఈ సంవత్సరం అవార్డులు లభించాయి. అద్భుత కవిత్వాలు రాసిన ఎనిమిది మంది కవులలో పాపినేని శివశంకర్ ఒకరు.
Published Thu, Dec 22 2016 7:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement