పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. నల్లధనమంతా విదేశాల్లో భద్రంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్టు, రచయిత అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. కేంద్రం మొదట దొంగనోట్లను అరికట్టేం దుకు నోట్లు రద్దు చేస్తున్నట్లు చెప్పిందని, కానీ అవి కరెన్సీలో కేవలం 0.002 శాతమేనని తేలడంతో నల్లధనాన్ని వెలికితీసేందుకేనంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమానికి అరుణ్ శౌరి ముఖ్య అతిథిగా హాజరై... "నాయకులు వారి అనుచరులకు పాఠాలు" అనే అంశంపై ఉపన్యసించారు.