యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలి: మాయా | Divide Uttar Pradesh into four states, demands Mayawati | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 31 2013 1:35 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

తెలంగాణ రాష్ట్రా ఏర్పాటుకు యూపీఏ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ఉత్తరప్రదేశ్ విభజనకు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును ఆమె స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించినట్టే 20 కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. తన ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా చేస్తే... అక్కడి ప్రజలు మరింత ప్రగతిని చూస్తారని మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా తాము వ్యవహరిస్తామని మాయావతి ప్రకటించారు. కాగా తెలంగాణ సెగ డార్జిలింగ్, బోడోలాండ్, విదర్శ ప్రాంతాలనూ తాకింది. డార్జిలింగ్ ప్రాంతంలో ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్తో బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రను విభజించి ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ ఒకరు సోనియాకు విజ్ఞప్తి చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement