రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదు కోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టులకు సాయం అందిస్తామన్నారు. ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ను కలుసుకుని, వారికి సహాయం అంది స్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రగతిభ వన్‌లో మంగళవారం జర్నలిస్టుల సంక్షే మంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుం టున్నాం. గత రెండు బడ్జెట్లలో రూ.10 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయిం చాం. ఈ సారి బడ్జెట్లో మరో రూ. పది కోట్లు కేటాయిస్తాం. ఈ డబ్బులతో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తాం.
Published Wed, Feb 15 2017 7:26 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
Advertisement