Journalists Welfare
-
‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్‌పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -
పాత్రికేయులకు సంక్షేమ పథకాలు
భువనేశ్వర్ : రాష్ట్రంలో సేవల్ని అందిస్తున్న పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల్ని ప్రకటించింది. పాత్రికేయు ల ఆరోగ్యం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి గోపబంధు పాత్రికేయ ఆరోగ్య బీమా పథకం ప్రారంభించిన విషయం తెలి సిందే. గురువారం మరికొన్ని కొత్త సంక్షేమ పథకాల్ని పాత్రికేయుల కోసం ప్రకటించారు. రాష్ట్ర సమాచారం, ప్రజా సంబం ధాల శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర జెనా ఇలా వివరించారు. అకాల మరణానికి గురైన పాత్రికేయ కుటుంబీకులకు రూ.4 లక్షల తక్షణ సహాయం లభిస్తుంది. ఆరోగ్య బీమా పరిమితి రూ.2 లక్షలుగా ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పరిమితి విస్తరిస్తారు. విపత్కర పరిస్థితుల్లో శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. దివంగత పాత్రికేయుల పిల్లల ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు చేస్తుంది. పదో తరగతి వరకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం లభిస్తుంది. తదుపరి చదువులకు ప్రతి నెల రూ. 2,500 సహాయం అందజేస్తారు. ఇల్లు కట్టుకునేందుకు పాత్రికేయులకు రూ.25 లక్షల పరిమి తి రుణాల వడ్డీలో 3 శాతం మినహాయింపు కల్పిస్తారు. ఈ క్రమంలో కారులు వగైరా 4 చక్రాల వాహనాల కొనుగో లుకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం కల్పిస్తారు. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.50 వేల ఆర్థిక సహా యం మంజూరు చేస్తారు. పాత్రికేయ రంగంలో ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. ఐఐఎమ్‌సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో 3 రోజులు, 1 వారం, 2 వారాల శిక్షణ కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులకు 25 నుంచి 35 మంది వరకు ఎంపిక చేసి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం 5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తారు. ఒక్కో పాత్రికేయు ని శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుంది. -
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
ఆదిలాబాద్ టౌన్ : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని పీఆర్టీయూ సంఘ భవనంలో మంత్రి జోగు రామన్నకు టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి రామన్న మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టులకు నివాస స్థలాలు అందజేస్తామన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం భరిస్తుందన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించారు. ఏఎంసీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బేత రమేశ్, రాజు, కోశాధికారి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అన్వర్, సంఘ బాధ్యులు ఆంజనేయులు, రఘునాథ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా రూ.10 కోట్లు
-
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా రూ.10 కోట్లు
చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో 17న జనహితలో సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదు కోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టులకు సాయం అందిస్తామన్నారు. ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ను కలుసుకుని, వారికి సహాయం అంది స్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రగతిభ వన్‌లో మంగళవారం జర్నలిస్టుల సంక్షే మంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుం టున్నాం. గత రెండు బడ్జెట్లలో రూ.10 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయిం చాం. ఈ సారి బడ్జెట్లో మరో రూ. పది కోట్లు కేటాయిస్తాం. ఈ డబ్బులతో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తాం. చనిపోయిన జర్నలి స్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తాం. ఆ కుటుంబాలకు నెలకు రూ.3 వేల చొప్పున అయిదేళ్ల వరకు పింఛన్ అందిస్తాం. పదో తరగతి లోపు చదివే పిల్లలుంటే ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరికి నెలకు రూ.వెయ్యి సాయం అం దిస్తాం. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్య నభ్యసిస్తే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం వర్తింపచేస్తాం. జర్నలిస్టులు విదేశాలకు వెళ్లి అధ్యయనం చేస్తే సహాయం అందచేస్తాం..’ అని సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గుర్తించి, అందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు సీఎం అప్పగించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, సీనియర్ జర్నలిస్టులు క్రాంతి, పల్లె రవి, బుద్ధ మురళి, సతీశ్, బసవ పున్నయ్య పాల్గొన్నారు. 17న జనహిత ప్రారంభం.. ప్రగతిభవన్‌లో భాగంగా నిర్మించిన జనహి తలో వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుసుకుని వారితో చర్చించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న ప్రారం భించనున్నారు. అదే రోజు కేసీఆర్ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. జర్నలి స్టుల సంక్షేమానికి విధాన నిర్ణయం తీసుకు న్నందుకు కేసీఆర్‌కు అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. -
జర్నలిస్టుల సంక్షేమంలో వైఎస్సారే స్ఫూర్తి
- ఏపీయూడబ్ల్యూజే ముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి - జర్నలిస్ట్ నాయకులకు జ్ఞాపికలు అందజేత ఏఎన్‌యూ : జర్నలిస్టుల సంక్షేమం, ప్రయోజనాల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదర్శమైన చర్యలు తీసుకున్నారని ఆయన స్పూర్తితోనే జర్నలిస్టుల సంక్షేమం, ప్రయోజనాల కోసం పాటుపడతామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుంచనపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన ఏపీయూడబ్ల్యుజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) 34వ మహాసభల ముగింపు సభ మంగళవారం సాయంత్రం జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాజంలో జర్నలిజానికి ఉన్న శక్తిని గురించి వివరించారు. ప్రజా సమస్యలు, వారి సంక్షేమాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో జర్నలిజం ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించాలన్నారు. వార్తా సంస్థల యాజమాన్యాలను రాజకీయ పార్టీలు విభేదిస్తామేమో కానీ జర్నలిస్టులతో ఎపుడూ విభేదించవని చెప్పారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు, పార్టీ నాయకులు కీలకపాత్ర పోషించాలని ఏపీయూడబ్ల్యుజే నాయకులు చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించిన జగన్ ఆ విషయంలో తామెపుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ జగన్మోహన్ రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ నాయకులు, మిమిక్రీ కళాకారుడు సిల్వస్టర్లకు జగన్ జ్ఞాపికలు అందజేశారు. మార్మోగిన కరతాళ ధ్వనులు సభలో జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల పాత్ర, సమాజంలో పరిస్థితులపై జగన్ ప్రసంగిస్తున్నపుడు కరతాళ ధ్వనులు మార్మోగాయి. కార్యక్రమం ముగిసిన తరువాత జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు ఏపీయూడబ్ల్యుజే సభ్యులు ఉత్సాహం కన బరిచారు. విద్యార్థుల నినాదాలతో మార్మోగిన కేఎల్‌యూ జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో కేఎల్ యూ ప్రాంగణం మార్మోగింది. ఏపీయూడబ్ల్యుజే మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌కు కేఎల్‌యూ ద్వారం వద్ద విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. కేఎల్‌యూ సిబ్బంది, అధికారు లు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేం దుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారి ఉత్సాహాన్ని గమనించి జగన్ వా హనం దిగి వారికి అభివాదం చేశారు. విద్యార్థినులు, సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, కేఎల్‌యూ చైర్మన్ సత్యన్నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వంగవీ టి రాధా, పేర్నినాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, నా యకులు నసీర్ అహ్మద్, గులాం రసూ ల్, దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా
సంగారెడ్డి మున్సిపాలిటీ: జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ప్రెస్ అకాడమీ నిర్ణయించిందని, ఈ నెల 10లోగా జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలని ప్రెస్ అకాడమీ చెర్మైన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రమాద బీమా కోసం చెల్లించే ప్రీమియాన్ని రాష్ట్ర కమిటీ భరిస్తుందన్నారు. జిల్లాలోని జర్నలిస్టులంతా తమ నియోజకవర్గంలోని టీయూడబ్ల్యూజే, టీఈఎంజేయూ బాధ్యులను సంప్రదించి దరఖాస్తు ఫారాలు తీసుకోవాలన్నారు. బీమా కోసం ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టు ల పిల్లలకు అన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కలెక్టర్ జీఓ విడుదల చేసినట్లు ఐజేయూ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మినుపూర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక టీఎన్జీఓ భవన్లో జీఓ కాపీలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీఓ విడుదలకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.