మంత్రి ప్రతాప్ చంద్ర జెనా
భువనేశ్వర్ : రాష్ట్రంలో సేవల్ని అందిస్తున్న పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల్ని ప్రకటించింది. పాత్రికేయు ల ఆరోగ్యం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి గోపబంధు పాత్రికేయ ఆరోగ్య బీమా పథకం ప్రారంభించిన విషయం తెలి సిందే. గురువారం మరికొన్ని కొత్త సంక్షేమ పథకాల్ని పాత్రికేయుల కోసం ప్రకటించారు. రాష్ట్ర సమాచారం, ప్రజా సంబం ధాల శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర జెనా ఇలా వివరించారు.
- అకాల మరణానికి గురైన పాత్రికేయ కుటుంబీకులకు రూ.4 లక్షల తక్షణ సహాయం లభిస్తుంది.
- ఆరోగ్య బీమా పరిమితి రూ.2 లక్షలుగా ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పరిమితి విస్తరిస్తారు.
- విపత్కర పరిస్థితుల్లో శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది.
- దివంగత పాత్రికేయుల పిల్లల ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు చేస్తుంది.
- పదో తరగతి వరకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం లభిస్తుంది.
- తదుపరి చదువులకు ప్రతి నెల రూ. 2,500 సహాయం అందజేస్తారు.
- ఇల్లు కట్టుకునేందుకు పాత్రికేయులకు రూ.25 లక్షల పరిమి తి రుణాల వడ్డీలో 3 శాతం మినహాయింపు కల్పిస్తారు.
- ఈ క్రమంలో కారులు వగైరా 4 చక్రాల వాహనాల కొనుగో లుకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం కల్పిస్తారు.
- ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.50 వేల ఆర్థిక సహా యం మంజూరు చేస్తారు.
- పాత్రికేయ రంగంలో ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు.
- ఐఐఎమ్‌సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో 3 రోజులు, 1 వారం, 2 వారాల శిక్షణ కల్పిస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులకు 25 నుంచి 35 మంది వరకు ఎంపిక చేసి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.
- ఈ కార్యక్రమం 5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తారు.
- ఒక్కో పాత్రికేయు ని శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment