జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా రూ.10 కోట్లు | every year 10crore for journalist wellfare | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా రూ.10 కోట్లు

Published Wed, Feb 15 2017 1:48 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

మంగళవారం ప్రగతి భవన్‌లో జర్నలిస్టుల సంక్షేమంపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌. - Sakshi

మంగళవారం ప్రగతి భవన్‌లో జర్నలిస్టుల సంక్షేమంపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌.

చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో 17న జనహితలో సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదు కోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టులకు సాయం అందిస్తామన్నారు. ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ను కలుసుకుని, వారికి సహాయం అంది స్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రగతిభ వన్‌లో మంగళవారం జర్నలిస్టుల సంక్షే మంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుం టున్నాం. గత రెండు బడ్జెట్లలో రూ.10 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయిం చాం. ఈ సారి బడ్జెట్లో మరో రూ. పది కోట్లు కేటాయిస్తాం. ఈ డబ్బులతో ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తాం.

చనిపోయిన జర్నలి స్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తాం. ఆ కుటుంబాలకు నెలకు రూ.3 వేల చొప్పున అయిదేళ్ల వరకు పింఛన్‌ అందిస్తాం. పదో తరగతి లోపు చదివే పిల్లలుంటే ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరికి నెలకు రూ.వెయ్యి సాయం అం దిస్తాం. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్య నభ్యసిస్తే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం వర్తింపచేస్తాం. జర్నలిస్టులు విదేశాలకు వెళ్లి అధ్యయనం చేస్తే సహాయం అందచేస్తాం..’ అని సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గుర్తించి, అందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు సీఎం అప్పగించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, రంగారెడ్డి కలెక్టర్‌ రఘునందన్‌రావు, సీనియర్‌ జర్నలిస్టులు క్రాంతి, పల్లె రవి, బుద్ధ మురళి, సతీశ్, బసవ పున్నయ్య పాల్గొన్నారు.  

17న జనహిత ప్రారంభం..
ప్రగతిభవన్‌లో భాగంగా నిర్మించిన జనహి తలో వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుసుకుని వారితో చర్చించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 17న ప్రారం భించనున్నారు. అదే రోజు కేసీఆర్‌ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. జర్నలి స్టుల సంక్షేమానికి విధాన నిర్ణయం తీసుకు న్నందుకు కేసీఆర్‌కు అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement