ఏపీలోనూ విస్తారంగా వర్షాలు | heavy rains in andhra pradesh on wednesday | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 15 2016 6:56 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. విజయనగరంలోని పూసపాటిరేగ, భోగాపురంలో 4 నుంచి 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. పార్వతీపురం డివిజన్‌లో సాలూరులో గంటపాటు భారీవర్షం పడింది. విశాఖపట్నంలోని కోట ఉరట్లలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదుకాగా.. ఐదు మండలాల్లో ఎలాంటి వర్షపాతం కురవలేదు. భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమై కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement