రూ. 500, 1000 నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జేబులో రూ. 500, 1000 నోట్లు తప్ప చిల్లరలేని వారు.. అవి ఎందుకు పనికిరాకపోవడంతో రోజు వారి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత నోట్లను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఉన్న కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చిల్లర కోసం నానా తంటాలు పడుతున్నారు.