ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దౌత్యపర ఒత్తిడిని భారత్ తీవ్రం చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ బుధవారం పాక్ హైకమిషనర్ అబ్దుల్‌బాసిత్‌ను పిలిపించి మాట్లాడారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు క్రియాశీలంగా ఉన్నాయని ఉడీ ఉగ్రదాడి స్పష్టం చేస్తోందన్నారు. ఆ దాడిలో పాక్‌లోని ఉగ్రవాదుల ప్రమేయానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాధారాలను ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల మృతదేహాల నుంచి స్వాధీనం చేసుకున్న జీపీఎస్ పరికరాల్లో.. నియంత్రణ రేఖ వెంట ఆ ముష్కరులు చొరబడిన ప్రదేశం, సమయం, ఆ తర్వాత వారు దాడి చేసిన ప్రాంతానికి చేరుకున్న మార్గం సమాచారాన్ని బాసిత్‌కు వివరించారు.
Published Thu, Sep 22 2016 8:26 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement