భారత ఆపరేషన్‌కు అంతర్జాతీయ మద్దతు | international support to indian operation, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 29 2016 2:09 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

ఉగ్రవాదులపై భారత సైన్యం చేసిన దాడికి ప్రపంచ దేశాలన్నింటి నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని మానుకోవాలని అన్నారు. భారత సైన్యం పాకిస్థాన్ పరిధిలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో పాకిస్థాన్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశ భద్రతను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మోదీ చెప్పారని ఆయన తెలిపారు. భారత దేశ ఐక్యత, భద్రత, రక్షణలను కాపాడటంలో తన బాధ్యతను నిర్వర్తించడంలో భాగంగానే ఆర్మీ ఆపరేషన్ చేసిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement