భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దాదాపు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ మార్క్3–డీ1ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని జూన్ 5న సాయంత్రం 5.28 గంటలకు షార్ నుంచి చేపట్టేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ ఉపగ్రహ వాహకనౌకకు సంబంధించి సాలిడ్ స్టేజ్ అసెం బ్లింగ్ భవనం(ఎస్‌ఎస్‌ఏబీ)లో మూడు దశల రాకెట్ అనుసం ధానం పూర్తిచేసి.. శనివారమే ప్రయోగవేదిక(ఉంబ్లికల్ టవర్)కు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.