కొనసాగుతున్న కాకినాడ ఎన్నికల కౌంటింగ్‌ | Kakinada Municipal Corporation elections counting begin | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 1 2017 9:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

రంగరాయ మెడికల్‌ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభమైంది. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ సూపర్‌వైజర్, కౌంటింగ్‌ అసిస్టెంట్, అదనపు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ ఉంటారు. మొత్తం 60 మందికిపైగా కౌంటింగ్‌ సిబ్బంది విధి నిర్వహణకు నియమించారు. కాగా ప్రతి టేబుల్‌ వద్ద ఏజెంట్లు ఉండేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తం 21 రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 48 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా కౌంటింగ్‌ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మీడియా కోసం ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement