ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు | ltc-scam-cbi-books-six-present-former-mps | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 13 2014 12:28 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

నకిలీ టిక్కెట్లు దాఖలు చేసి ప్రభుత్వం నుంచి భారీగా ప్రయాణ ఖర్చులు(ఎల్టీసీ)రాబట్టిన కేసులో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు మాజీ ఎంపీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీతో పాటు ఒడిశాలోని ఎంపీల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణనికి సంబంధించి ఎంపీలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చేశారు. అలాగే పలు ట్రావెల్ ఏజెన్సీలపై కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి 600 ఖాళీ బోర్డింగ్ పాసులతో కోల్‌కతాలో దొరికిపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement