rajya sabha mps
-
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
సీఎం జగన్ను కలిసిన వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి బుధవారం కలిశారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రాలు తీసుకున్న అనంతరం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ఏప్రిల్ 2వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో పూర్తయ్యింది. నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో 11 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీకి 8 మంది సభ్యులున్నారు. ఇప్పుడు మిగతా మూడు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరాయి. దాంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమయ్యాయి. టీడీపీ బలం సున్నాకు చేరింది. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు.. 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. -
విలువల ప్రయాణం
-
సచిన్,రేఖ తీరుపై విమర్శల వెల్లువ
-
కొత్త ఎంపీల్లో కోటీశ్వరులు వీరే!
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 96 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇటీవల 57 మంది రాజ్యసభకు ఎన్నికైయ్యారు. వీరిలో ఎన్పీపీకి చెందిన ప్రపుల్ పటేల్ అత్యధిక ఆస్తులు కలిగిన వారిగా గుర్తించినట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సర్వే నివేదిక వెల్లడించింది. ఆయనకు రూ. 252 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ (212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా(193 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన రాజ్యసభ ఎంపీల్లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర టాప్-10 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఆయన ఆస్తిపాస్తులు రూ. 49 కోట్లుగా చూపించారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎంపీల జాబితాలో బీజేపీకి అనిల్ దవే(60 లక్షలు), రామకుమార్(86 లక్షలు), కాంగ్రెస్ కు చెందిన(1.8కోట్లు) ఉన్నారు. 57 మంది ఎంపీల్లో 13 మంది(23 శాతం)పై క్రిమినల్ కేసులు, ఏడుగురు(12 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. -
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
-
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
న్యూఢిల్లీ : నకిలీ టిక్కెట్లు దాఖలు చేసి ప్రభుత్వం నుంచి భారీగా ప్రయాణ ఖర్చులు(ఎల్టీసీ)రాబట్టిన కేసులో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు మాజీ ఎంపీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీతో పాటు ఒడిశాలోని ఎంపీల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణనికి సంబంధించి ఎంపీలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైనవారిలో లాల్మింగ్ లియానా(ఎంఎన్ఎఫ్), బందోపాధ్యాయ(టీఎంసీ), బీఎస్పీకి చెందిన బ్రజేష్ పాఠక్ ...మరో ముగ్గురు మాజీ ఎంపీలు జేపీఎన్ సింగ్(బీజేపీ), మహమూద్ ఎ.మదాని(ఆర్ఎల్డీ), బీజేడీకి చెందిన రేణుబల ప్రధాన్ ఉన్నారు. అలాగే పలు ట్రావెల్ ఏజెన్సీలపై కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి 600 ఖాళీ బోర్డింగ్ పాసులతో కోల్కతాలో దొరికిపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.