
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
న్యూఢిల్లీ : నకిలీ టిక్కెట్లు దాఖలు చేసి ప్రభుత్వం నుంచి భారీగా ప్రయాణ ఖర్చులు(ఎల్టీసీ)రాబట్టిన కేసులో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు మాజీ ఎంపీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీతో పాటు ఒడిశాలోని ఎంపీల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ కుంభకోణనికి సంబంధించి ఎంపీలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైనవారిలో లాల్‌మింగ్ లియానా(ఎంఎన్ఎఫ్), బందోపాధ్యాయ(టీఎంసీ), బీఎస్పీకి చెందిన బ్రజేష్ పాఠక్ ...మరో ముగ్గురు మాజీ ఎంపీలు జేపీఎన్ సింగ్(బీజేపీ), మహమూద్ ఎ.మదాని(ఆర్ఎల్డీ), బీజేడీకి చెందిన రేణుబల ప్రధాన్ ఉన్నారు. అలాగే పలు ట్రావెల్ ఏజెన్సీలపై కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి 600 ఖాళీ బోర్డింగ్ పాసులతో కోల్‌కతాలో దొరికిపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.