ఎల్లంపేట్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, భవానీ దంపతుల రెండో కుమార్తె లక్ష్మీప్రసన్న. ఇంటి సమీపంలోనే నిందితుడైన మైనర్(17) నివాసం. గతంలో కృష్ణమూర్తి కుటుం బం అతడి ఇంట్లో అద్దెకు ఉండటం వల్ల వీరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పదో తరగతి వరకు చదివిన నిందితుడు చదువు అబ్బక గ్రామంలోని ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడటంతో... వచ్చే జీతం సరిపోక చిన్నచిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ నెల 12న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన మైనర్... లక్ష్మీప్రసన్న కుక్కతో ఆడుకోవడం, ఆమె అక్క నిద్రిస్తుండడం గమనించాడు. చెప్పులు బయట విడిచి, బీరువా పైనున్న తాళం చెవితో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.7వేలు దొంగిలించాడు.