laksmiprasanna
-
దొంగతనానికి వెళ్లి... మృగాడిగా మారి
► చిన్నారి లక్ష్మీప్రసన్నను హత్య చేసిన పొరుగింటి మైనర్ ► వీడిన మిస్టరీ... నిందితుడిని పట్టించిన చెప్పులు సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మేడ్చల్ ఎల్లంపేట్‌కు చెందిన చిన్నారి ఇందుశ్రీ సాయిలక్ష్మీప్రసన్న(8) హత్య కేసులో మిస్టరీ వీడింది. దొంగతనానికి వెళ్లి... కామాంధుడిగా మారిన పొరుగింటి మైనరే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలింది. ఘటనా స్థలిలో వదిలి వెళ్లిన ఎర్ర రంగు చెప్పుల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని శనివారం నాగోల్‌లోని జువైనల్ హోమ్‌కు తరలించారు. మేడ్చల్ ఠాణాలో పేట్‌బషీర్‌బాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీసీఎస్ ఏసీపీ ఉషారాణి, సీఐ రాజశేఖర్‌రెడ్డితోకలసి బాలనగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు. నమ్మించి గొంతు కోశాడు... ఎల్లంపేట్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, భవానీ దంపతుల రెండో కుమార్తె లక్ష్మీప్రసన్న. ఇంటి సమీపంలోనే నిందితుడైన మైనర్(17) నివాసం. గతంలో కృష్ణమూర్తి కుటుం బం అతడి ఇంట్లో అద్దెకు ఉండటం వల్ల వీరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పదో తరగతి వరకు చదివిన నిందితుడు చదువు అబ్బక గ్రామంలోని ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడటంతో... వచ్చే జీతం సరిపోక చిన్నచిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ నెల 12న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన మైనర్... లక్ష్మీప్రసన్న కుక్కతో ఆడుకోవడం, ఆమె అక్క నిద్రిస్తుండడం గమనించాడు. చెప్పులు బయట విడిచి, బీరువా పైనున్న తాళం చెవితో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.7వేలు దొంగిలించాడు. అమ్మానాన్నలు లేరని, ఇంటికి ఎందుకు వచ్చావని లక్ష్మీప్రసన్న అతడిని ప్రశ్నించింది. ‘బీరువాలో ఉన్న ఆధార్ కార్డు తెమ్మని మీ నాన్నే చెప్పాడు’ అంటూ నిందితుడు నమ్మించాడు. ఇంతలోనే కామాంధుడిగా మారిన మైనర్... లక్ష్మీప్రసన్నను బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో బాత్రూమ్లో ఉన్న షేవింగ్ బ్లేడ్‌తో ఆమె మణికట్టును బలంగా కోశాడు. నొప్పితో లక్ష్మీప్రసన్న మరింత బిగ్గరగా అరవగా... వెంటనే గొంతు కోసి వెనక వైపునున్న ప్రహరీ దూకి నిందితుడు పారిపోయాడు. నటించి... పక్కదారి పట్టించి... అరుపులు విని చిన్నారి పిన్ని వెంకటలక్ష్మి ఇంట్లోకి రాగా, ప్రసన్న రక్తపు మడుగులో కనిపించింది. ఆమె వెంటనే పాపను తన చేతుల్లోకి తీసుకుని రోడ్డుపైకి వచ్చింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన నిందితుడు చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. పోలీసు జాగిలాలు కూడా అతడిని గుర్తించలేకపోయాయి. ఆస్పత్రిలో లక్ష్మీప్రసన్న మరణించిందని వైద్యులు చెప్పగానే అతగాడు ఎక్కడలేని ప్రేమ ఒలకబోశాడు. కేసులో మొదట చిన్నారి కుటుంబీకులను అనుమానించి విచారించిన పోలీసులకు... వారు అమాయకులని తేలింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మొరగకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. డీసీపీ సాయిశేఖర్, సీపీ సందీప్‌శాండిల్యా శుక్రవారం ఎల్లంపేట్‌కు వెళ్లి బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. హత్య సమయంలో ఇంటి ముందు ఎర్ర రంగు చెప్పులున్నాయని హతురాలి పిన్ని చెప్పడంతో వాటి ఆధారంగా నిందితుడు పొరుగింటి మైనరని నిర్థారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగతనానికి వెళ్లి... మృగాడిగా మారి
-
నా దృష్టిలో...థియేటర్ అంటే ఓ షాప్!
రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన విష్ణుతో చేసిన ‘అనుక్షణం’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వర్మ ఏమన్నారంటే... మాఫియా, హారర్ కథల్ని పక్కనపెట్టి కొత్తగా సైకో కిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నారేంటి? దేశంలో జరిగిన పలు సైకో హత్యలే ఈ సినిమా కథకు ప్రేరణ. ఈ కథ తయారీ కోసం... సైకో హత్యలకు సంబంధించి పలు పుస్తకాలు చదివా. హాలీవుడ్ డాక్యుమెంటరీలు చూశా. పలు కేసుల్లో వాళ్లు హత్యలు చేసిన విధానాలను పోలీసుల సహకారంతో దగ్గరగా పరిశీలించా. ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా చేయడం నాకిదే ప్రథమం. ఇలాంటి సినిమాల వల్ల ప్రేక్షకులకు క్రైమ్ ఎలా చేయొచ్చో నేర్పినవాళ్లు అవుతారు కదా! సమాజంలో జరుగుతున్న క్రైమ్‌తో పోలిస్తే... తెరపై మేం చూపించే క్రైమ్ చాలా తక్కువ. బయట జరిగే సంఘటనలే నా కథలకు ప్రేరణ. మీ ‘శివ’ సినిమా సమాజంపై ఎంత బలమైన ప్రభావం చూపిందో చెప్పాల్సిన పనిలేదనుకుంటా! అవన్నీ... వట్టి మాటలు. అప్పట్లో కళాశాలల్లో జరుగుతున్న సంఘటనలను బట్టే ఆ సినిమా తీశాను. నేను తెరపై కొత్తగా చూపించిందేం లేదు. కానీ బలమైన మాధ్యమమైన సినిమా ద్వారా క్రైమ్ మరింత చేరువయ్యే ప్రమాదం ఉందిగా? సినిమాలు చూసి నేర్చుకునేంత నీచమైన స్థితిలో జనాలు లేరని నా అభిప్రాయం. మీ నుంచి ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని మేం ఎప్పుడు ఆశించొచ్చు? నా నుంచి అలాంటి సినిమాలు ఎప్పటికీ రావు. సినిమాలు జనాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయవని నేను ఇంతకు ముందే చెప్పాను. ‘అనుక్షణం’కి విష్ణుని హీరోగా ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ కథకు విష్ణు యాప్ట్. ఇప్పటివరకూ విష్ణు కామెడీ, యాక్షన్ సినిమాలే చేశాడు. అతనిలో తెలియని కోణం మరొకటుంది. దాన్ని ‘రౌడీ’ షూటింగ్ టైమ్‌లో చూశాను. పూర్తిస్థాయి సీరియస్ కేరక్టర్ తనతో చేయించాలని అప్పుడే అనుకున్నా. నేను అనుకున్నదానికంటే తను బాగా చేశాడు. అలాగే.. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను రేవతితో చేయించాను. ఆ పాత్రకు రేవతి లాంటి మంచి నటి చేస్తేనే కరెక్ట్. ఆ పాత్ర ప్రభావం సినిమాపై ఎంత స్థాయిలో ఉంటుందో రేపు తెరపై మీరే చూస్తారు. ఇంతకీ మీ వేలంపాట కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందనే అనుకుంటున్నారా? కచ్చితంగా. సినీ నిర్మాణంలోకి వచ్చేవారికి ప్రమాదంలేని ప్రయాణం ఈ విధానం. కానీ... ఇక్కడ థియేటర్ల మాఫియా ఎక్కువైందని అందరూ అంటున్నారు కదా? అది తెలీని వాళ్లు అనే మాట. నాకు తెలిసిన దాని ప్రకారం అసలు ఇక్కడ మాఫియానే లేదు. నా దృష్టిలో థియేటర్ అంటే ఒక షాప్. ఆ షాప్‌లో ఏది ఎక్కువగా అమ్ముడు పోతుందో దాన్ని తీసుకొచ్చి పెడతారు. అలాగే ఏ సినిమాకైతే డబ్బులొస్తాయో, ఆ సినిమానే థియేటర్‌కి తెచ్చుకుంటారు. ఇది వ్యాపారం. దీన్ని మాఫియా అనడం ఎంతవరకూ కరెక్ట్ చెప్పండి. ఇంతకూ మీ ‘ఐస్‌క్రీమ్’ చివరి అంకె ఏంటో చెప్పండి? ‘ఐస్‌క్రీమ్-2’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘ఐస్‌క్రీమ్-3’ త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. ఇవి సింపుల్ స్క్రిప్ట్‌తో, సింపుల్ బడ్జెట్‌తో రూపొందే సినిమాలు. ఇలాంటివి థియేటర్లలో ఒక్కరోజు ఆడినా డబ్బులొచ్చేస్తాయి. ఆ ఒక్క రోజు కూడా జనాలు ఎవరూ రానప్పుడు ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ ఆగిపోతుంది. లక్ష్మీప్రసన్నపై లఘుచిత్రం తెల్లని పరుపుపై నిద్రిస్తున్న ఓ అమ్మాయి అందమైన పాదాలు ముద్దుముద్దుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పాదాలు ఎవరివి? అనుకుంటున్నారా! తానెవరో కాదు. మంచు లక్ష్మి. ఆమె దైనందిన జీవితంపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం మంచు లక్ష్మి పాదాలపైనే ఈ లఘు చిత్రాన్ని వర్మ రూపొందించడం విశేషం. ఇందులో మోహన్‌బాబు, మంచు విష్ణు కూడా తళుక్కున మెరుస్తారు. వర్మ తెరకెక్కించిన తొలి లఘు చిత్రం ఇదే కావడం విశేషం. త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నారు. దీని తర్వాత... వర్మ జీవన విధానాన్ని స్వీయ దర్శకత్వంలో ఓ లఘు చిత్రంగా రూపొందిస్తానని మంచు విష్ణు విలేకరులతో పేర్కొనడం విశేషం. -
ప్రేమజంట ఆత్మహత్య
ఆగిరిపల్లి, న్యూస్‌లైన్ : మంచినీటి బావిలోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆగిరిపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వడ్లమాను పంచాయతీ పరిధిలోని ఆగిరిపల్లి శోభనాచలస్వామి కొండ ప్రాంతానికి చెందిన ఆరుమేకల రమేష్ (22), నూజివీడు మండలం పాతరావిచర్లకు చెందిన మరీదు లక్ష్మీప్రసన్న(18) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రమేష్ గతంలో రావిచర్లకు చెందిన మరీదు రామ్మోహనరావు పొక్లెయిన్‌పై డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆ క్రమంలో అదే గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్నతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గతంలో ఒకసారి వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోగా బంధువులు పట్టుకుని లక్ష్మీప్రసన్నను మందలించారు. డ్రైవర్‌గా రమేష్‌ను తొలగించారు. వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారని... లక్ష్మీప్రసన్నకు ప్రస్తుతం వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం లక్ష్మీప్రసన్న ఇంటినుంచి పరారైంది. ఆమెకు తండ్రి లేకపోవడంతో మేనమామ, బంధువుల స హాయంతో రెండురోజులుగా గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం శవమై కనిపించింది. స్థానిక మెట్ల కోనేరు వాటర్‌ట్యాంక్ వద్దనున్న మంచినీటి బావి వద్దకు వచ్చిన స్థానికులకు చెప్పులు, బైక్, దుస్తుల బ్యాగ్ కనిపించాయి. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా, గాలింపు చేపట్టారు. మంచినీటి బావిలో వీరిద్దరూ చున్నీతో కట్టుకుని శవాలుగా కనిపించారు. చావులో సైతం విడిపోకూడదనే ఉద్దేశంతో ఒక్కటిగా ఆత్మహత్యకు పాల్పడ్డారని చూపరులు కంటతడి పెట్టారు. మృతదేహాలను చూసి ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 11 గంటల సమయం లో ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. వీఆర్వో ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై టి.చంద్రశేఖర్ ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూ.5 వేలిస్తేనే పోస్టుమార్టం... నూజివీడు రూరల్ : పోస్టుమార్టం నిర్వహించాలంటే ఒక్కొ క్క మృతదేహానికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాస్పత్రి డ్యూటీ డాక్టర్ జి.ఉమేష్ డిమాండ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడు ఆరుమేకల రాజేష్, బంధువు పులపాక రమేష్, మోదుగు రాజు కథనం ప్రకారం రమేష్, లక్ష్మీప్రసన్నల మృతదేహా లను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఉదయం 11 గంటల ప్రాంతంలో తరలించారు. డబ్బిస్తేనే పోస్టుమార్టం చేస్తానని డాక్టర్ తేల్చిచెప్పారని వివరించారు. తాము పేద కుటుంబానికి చెందినవారమని, అంత ఇచ్చుకోలేమని చెప్పినా కనికరం చూపలేదని, సాయంత్రం నాలుగు గంటల వరకు కాలయాపన చేసి తమను ఇబ్బంది పెట్టారని తెలిపారు. అసలే మనిషి చనిపోయి బాధపడుతున్న తమకు ఈ ఘటన మరింత క్షోభకు గురిచేసిందని వాపోయారు. నాలుగున్నర గంటల సమయంలో వైద్యశాలకు వచ్చిన సూపరింటెండెంట్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినా స్పం దించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమక్షంలో నగదు చెల్లిస్తామని చెప్పామని, దీంతో ఆగ్రహానికి గురైన వైద్యుడు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారని వివరిం చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. రాతపూర్వక ఫిర్యాదిస్తే చర్యలు... మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించటానికి డాక్టర్ జి.ఉమేష్ డబ్బు డిమాండ్ చేశారన్న విషయమై వైద్యశాల సూపరింటెండెంట్ ఆర్.నరేంద్రసింగ్‌ను వివరణ కోరగా, బాధితులు తన వద్దకు వచ్చి విషయం తెలిపారని, ఎవరికీ నగదు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పానని తెలిపారు. బాధితులు రాతపూర్వక ఫిర్యాదిస్తే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.