mystery chase
-
సరదా డీఎన్ఏ పరీక్ష... మర్డర్ మిస్టరీని ఛేదించింది!
అది 1997. అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో మాకినాక్ కౌంటీ. ఓ డ్రైనేజ్ కాలువలో నవజాత శిశువు మృతదేహం దొరికింది. పోలీసులు ఎంత విచారించినా ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో కనిపెట్టలేకపోయారు. తనకు ‘బేబీ గార్నెట్’గా నామకరణం చేసి స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పుణ్యమా అని ఏకంగా పాతికేళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. ఓ యువతి సరదాగా చేసుకున్న డీఎన్ఏ టెస్ట్ ఈ కేసులో ఆమె అమ్మమ్మను జైలుపాలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా డీఎన్ఏ కిట్లు కానుకగా ఇవ్వడం అమెరికాలో ఆనవాయితీ. అలా మిషిగాన్‌లోని న్యూబెర్రీలో పూల దుకాణంలో పనిచేసే జెన్నా గెర్వాటోవ్స్కీకి డీఎన్ఏ కిట్ అందింది. ఆమె సరదాకు టెస్ట్ చేసుకుని అక్కడితో మరిచిపోయింది. అయితే, ‘బేబీ గార్నెట్’ కేసు గురించి విన్నారా?’ అంటూ 2022లో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవునని చెప్పింది జెన్నా. తన డీఎన్ఏ బేబీ గార్నెట్ డీఎన్ఏతో సరిపోయిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. 1997లో చనిపోయిన శిశువుకు, తనకు సంబంధమేమిటో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాక తల్లి కారాకు చెబితే స్పామ్ కాల్ అయి ఉంటుందని కొట్టిపారేసింది. కానీ వారం తరువాత షాప్‌లో ఉండగా అర్జెంటుగా ఇంటికి రమ్మంటూ తల్లి ఫోన్ చేసింది. వెళ్లి చూస్తే ఇంట్లో పోలీసులున్నారు. బేబీ గార్నెట్ తనకు పిన్ని అవుతుందని వారు చెప్పడంతో జెన్నా ఆశ్చర్యపోయింది. పోలీసులు తల్లితో మాట్లాడి ఆమెనూ డీఎన్ఏనూ పరీక్షలకు ఒప్పించారు. కారాకు బేబీ గార్నెట్ స్వయానా సోదరి అని తేలింది. కారాను లోతుగా ప్రశ్నించగా తన తర్వాత తల్లి నాన్సీకి ఓ పాప పుట్టిందని, ఊపిరాడక మరణించిందని చెప్పింది. కానీ ఆ పాపను పుట్టగానే సంచిలో పెట్టి పడేశారన్నది పోలీసుల వాదన. నాన్సీపై నవజాత శిశువు హత్యాభియోగం మోపారు. రుజువైతే ఆమెకు జీవిత ఖైదు పడవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విలేకరి హత్య కేసు; పాతకక్షలే కారణం
సాక్షి, తుని (తూర్పుగోదావరి) : తుని మండలం ఎస్.అన్నవరంలో నివాసం ఉంటున్న విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోవడంతో పాటు.. హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక రూరల్ పోలీసు స్టేషన్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. హత్య కేసులో నేరస్తులను రెండు వారాల్లో ఛేదించినట్టు ఎస్పీ తెలిపారు. ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వంగలపూడి గౌరీ వెంకటరమణ (గౌరీ), మడగల దొరబాబుల బలహీనతలను ఆసరా చేసుకుని గౌరీపై అధికారులతో రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానని మృతుడు బెదిరించి, రూ.మూడు లక్షలు డిమాండ్ చేశాడన్నారు. భయపడిన గౌరీ రూ.రెండు లక్షలు చెల్లించాడు. మడగల దొరబాబుపై పాత క్రిమినల్ కేసులు, అతడి వ్యక్తిగత విషయాల్లో కాతా సత్యనారాయణ తలదూర్చి తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని, విలేకరిగా ఉన్న పరపతిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని మద్దాయిలను తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో అతడిపై పగ పెంచుకున్నారన్నారు. పథకం ప్రకారం హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితులతో కలసి సత్యనారాయణను ఈనెల 15న పథకం ప్రకారం హతమార్చాడని వెల్లడించారు. ఎస్.అన్నవరానికి చెందిన గౌరీ, నక్కపల్లికి చెందిన సకురు దుర్గ, పెనుముచ్చు శివరామకృష్ణ తాతాజీ (తేజ), అల్లాడి బాబ్జి, గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన (బొక్కిస) రమేష్, ఎస్.అన్నవరానికి చెందిన మడగల దొరబాబు విలేకరి సత్యనారాయణను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేర్లు అనుమానితులే మృతుడి సోదరుడు కాతా గోపాలకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్న గాబు రాజబాబు, మురాలశెట్టి రాజబాబు సహ ఆరుగురు అనుమానితులేనని ఎస్పీ అస్మి అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు లక్షకుపైగా ఫోన్ కాల్స్‌ను సమగ్రంగా పరిశీలించామని, సాంకేతిక నిపుణుల సహాయంతో అసలు నేరస్తులను పట్టుకున్నట్టు తెలిపారు. హత్యకు నేరస్తులు వినియోగించిన కత్తి, నాలుగు ఇనుప రాడ్లు, రెండు మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో డీఎస్పీలు రామకృష్ణ, అరిటాకుల శ్రీనువాసరావు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అక్రమ ఆస్తులు ఇవే! విలేకరి సత్యనారాయణ తేటగుంటలో 2009లో 64.5 సెంట్లు, 2011లో 91 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్లు, 2013లో 79 సెంట్లు, ఎస్.అన్నవరంలో ఎకరా 20 సెంట్లు, తుని వీరవరపేటలో 267 గజాలు ఇంటి స్థలం, 2015లో ఎస్.అన్నవరంలో 110 గజాల ఇంటి స్థలం, 2016లో టి.వెంకటాపురంలో 182 గజాలు ఇంటిస్థలం, తేటగుంటలో 42 సెంట్ల భూమి, 2019లో టి.వెంకటాపురంలో 25 సెంట్ల భూమి ఇలా భూములు సంపాదించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్.అన్నవరంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించి అందులో నివాసం ఉంటున్నాడు. ఇవేకాకుండా బ్యాంకు లాకర్లలో మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
దొంగతనానికి వెళ్లి... మృగాడిగా మారి
► చిన్నారి లక్ష్మీప్రసన్నను హత్య చేసిన పొరుగింటి మైనర్ ► వీడిన మిస్టరీ... నిందితుడిని పట్టించిన చెప్పులు సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మేడ్చల్ ఎల్లంపేట్‌కు చెందిన చిన్నారి ఇందుశ్రీ సాయిలక్ష్మీప్రసన్న(8) హత్య కేసులో మిస్టరీ వీడింది. దొంగతనానికి వెళ్లి... కామాంధుడిగా మారిన పొరుగింటి మైనరే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలింది. ఘటనా స్థలిలో వదిలి వెళ్లిన ఎర్ర రంగు చెప్పుల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని శనివారం నాగోల్‌లోని జువైనల్ హోమ్‌కు తరలించారు. మేడ్చల్ ఠాణాలో పేట్‌బషీర్‌బాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీసీఎస్ ఏసీపీ ఉషారాణి, సీఐ రాజశేఖర్‌రెడ్డితోకలసి బాలనగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు. నమ్మించి గొంతు కోశాడు... ఎల్లంపేట్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, భవానీ దంపతుల రెండో కుమార్తె లక్ష్మీప్రసన్న. ఇంటి సమీపంలోనే నిందితుడైన మైనర్(17) నివాసం. గతంలో కృష్ణమూర్తి కుటుం బం అతడి ఇంట్లో అద్దెకు ఉండటం వల్ల వీరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పదో తరగతి వరకు చదివిన నిందితుడు చదువు అబ్బక గ్రామంలోని ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడటంతో... వచ్చే జీతం సరిపోక చిన్నచిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ నెల 12న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన మైనర్... లక్ష్మీప్రసన్న కుక్కతో ఆడుకోవడం, ఆమె అక్క నిద్రిస్తుండడం గమనించాడు. చెప్పులు బయట విడిచి, బీరువా పైనున్న తాళం చెవితో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.7వేలు దొంగిలించాడు. అమ్మానాన్నలు లేరని, ఇంటికి ఎందుకు వచ్చావని లక్ష్మీప్రసన్న అతడిని ప్రశ్నించింది. ‘బీరువాలో ఉన్న ఆధార్ కార్డు తెమ్మని మీ నాన్నే చెప్పాడు’ అంటూ నిందితుడు నమ్మించాడు. ఇంతలోనే కామాంధుడిగా మారిన మైనర్... లక్ష్మీప్రసన్నను బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో బాత్రూమ్లో ఉన్న షేవింగ్ బ్లేడ్‌తో ఆమె మణికట్టును బలంగా కోశాడు. నొప్పితో లక్ష్మీప్రసన్న మరింత బిగ్గరగా అరవగా... వెంటనే గొంతు కోసి వెనక వైపునున్న ప్రహరీ దూకి నిందితుడు పారిపోయాడు. నటించి... పక్కదారి పట్టించి... అరుపులు విని చిన్నారి పిన్ని వెంకటలక్ష్మి ఇంట్లోకి రాగా, ప్రసన్న రక్తపు మడుగులో కనిపించింది. ఆమె వెంటనే పాపను తన చేతుల్లోకి తీసుకుని రోడ్డుపైకి వచ్చింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన నిందితుడు చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. పోలీసు జాగిలాలు కూడా అతడిని గుర్తించలేకపోయాయి. ఆస్పత్రిలో లక్ష్మీప్రసన్న మరణించిందని వైద్యులు చెప్పగానే అతగాడు ఎక్కడలేని ప్రేమ ఒలకబోశాడు. కేసులో మొదట చిన్నారి కుటుంబీకులను అనుమానించి విచారించిన పోలీసులకు... వారు అమాయకులని తేలింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మొరగకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. డీసీపీ సాయిశేఖర్, సీపీ సందీప్‌శాండిల్యా శుక్రవారం ఎల్లంపేట్‌కు వెళ్లి బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. హత్య సమయంలో ఇంటి ముందు ఎర్ర రంగు చెప్పులున్నాయని హతురాలి పిన్ని చెప్పడంతో వాటి ఆధారంగా నిందితుడు పొరుగింటి మైనరని నిర్థారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగతనానికి వెళ్లి... మృగాడిగా మారి