ఏపీ మంత్రి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణతో పాటు మరోవ్యక్తి మృతిచెందారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిషిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతిచెందాడు.