ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు జనం భారీగా తరలివస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆదివారం ఉదయం బహిరంగ సభ వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారు.
Published Sun, Nov 6 2016 1:24 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement