jai andhrapradesh sabha
-
‘జై ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం
-
తెలుగుజాతి తడాఖా చూపిద్దాం
-
తెలుగుజాతి తడాఖా చూపిద్దాం
ఏపీకి ‘హోదా’ సాధించేవరకు ఈ ఉద్యమం ఆగదు ‘జై ఆంధ్రప్రదేశ్’ వేదిక నుంచి వైఎస్ జగన్ ఉద్ఘాటన - సమైక్యంగా పోరాడదాం.. చేతులు కలపండి - మేధావుల మౌనం అనర్థం.. గొంతెత్తండి - జైళ్లకు భయపడం.. ప్రాణాలు లెక్కచేయం - బడ్జెట్ భేటీల తర్వాత ఎంపీల రాజీనామాలు - 2019 ఎన్నికల్లో హోదాపైనే రెఫరెండం - హోదాపై కేంద్రమంత్రులు, సీఎం అబద్ధ్దాలు - చంద్రబాబు పాలనలో అన్నింటా అధోగతి - అవినీతిలో నంబర్ వన్‌గా ఎదిగారు.. - ఆయనపై టాడా కేసు పెట్టినా తప్పులేదు - బాబు పాలనలో ఒక్కరూ సంతోషంగా లేరు - హామీల అమలులో సున్నా.. - ఏపీని మద్యాంధ్ర, కరువు ప్రదేశ్‌గా మార్చారు - చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు భయంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు - ఇలాంటి వ్యక్తి పాలనకు అర్హుడా? హోదా మన హక్కు. ఇవ్వడం వారి బాధ్యత. హోదా ఇవ్వకపోతే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? అలా కూర్చునే జాతేనా మనది? చేతులు కట్టుకొని కూర్చునుంటే ఇవాళ్టికీ బ్రిటిష్ పాలనే ఉండేది. మద్రాసీల దగ్గర ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండేవాళ్లం. - జగన్ తెన్నేటి విశ్వనాథం ప్రాంగణం (సాక్షి, విశాఖపట్నం): ‘‘ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పింది. హోదా తీసుకురావాలన్న ఆలోచనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. హోదా మన హక్కు..ఇవ్వడం వారి బాధ్యత.. ఇవ్వకపోతే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? చేతులు కట్టుకొని కూర్చునే జాతేనా మనది? చేతులు కట్టుకొని కూర్చునుంటే ఇవాళ్టికీ బ్రిటీష్ పరిపాలన ఉండేది. ఇప్పటికీ మద్రాసీల దగ్గర ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండేవాళ్లం. అందుకే తెలుగుజాతి తడాఖా చూపిద్దాం’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టిన మలిదశ పోరులో భాగంగా ఆదివారం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం(తెన్నేటి విశ్వనాథం ప్రాంగణం)లో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ జరిగింది. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి లక్షలాదిగా పోటెత్తిన జనసమూహాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి భయపడం. ఉద్యమాలంటే వెరపులేదు. జైళ్లంటే భయం లేదు. ప్రాణాలు పోతాయన్న బాధేలేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యమాన్ని ఇంకా ఏ స్థారుుకై నా తీసుకెళ్తాం.’’ అని జగన్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో సభలు పెడతామని, యువభేరిలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ, పార్లమెంట్లలో ఒత్తిడి తీసుకురావడంతోపాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వరకు వేచి చూస్తామని, అప్పటికీ హోదా ఇవ్వక పోతే ఎంపీల చేత రాజీనామాలు చేరుుంచి ఉప ఎన్నికలకు వెళ్తామని జగన్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ద్వారా మనకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేట్లు చేస్తామని, 2019 ఎన్నికలు ప్రత్యేకహోదా రెఫరెండంగానే జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఏ జాతీయ పార్టీ అయినా ఓట్లడగాలంటే ప్రత్యేక హోదాపై మాట ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొస్తామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... మోసకారి నాయకుల గుండెలు అదరాలి.. ‘‘ఇదే వేదిక నుంచి 2014లో చంద్రబాబు, మోదీ ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తామన్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి, రాజకీయాలు చేస్తున్న ఇటువంటి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ‘జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించండి. విశాఖలో ఎందరో మహనీయులు పుట్టారు. తెన్నేటి విశ్వనాథం, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ నడయాడిన పుణ్యభూమి విశాఖపట్నం. 1920నాటికే తొలి విశ్వవిద్యాలయం పుట్టినిల్లు విశాఖపట్టణం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమానికి 50 ఏళ్లు నిండారుు. స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకున్న ఉద్యమగడ్డ ఇది. మా రాజధానిలో మాకు కూడా ఉద్యోగాలలో సమానహక్కు ఉండదా అంటూ ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ విశాఖ. మన రాష్ట్ర ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రే, మన కేంద్ర ప్రభుత్వమే మన కంట్లో మన వేలితో పొడిచే కార్యక్రమం చేస్తుంటే ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ ఉద్యమబాట పట్టాల్సి వస్తోంది. నా ఆవేదనను పంచుకోవడానికే వచ్చా... ప్రసంగంతో ఊదరగొట్టటానికి రాలేదు. నా ఆవేదనను పంచుకోవడానికి వచ్చా. కొన్ని ఆలోచనలతో వచ్చా. రాష్ట్ర విభజనతో మనం లాభపడ్డామా? నష్టపోయామో ఆలోచించండి. లాభపడతామంటూ విభజన చేశారు. ఈ రెండున్నరేళ్లలో ఏమన్నా లాభం జరిగిందా? మన హక్కుల కోసం ఈ రాష్ర్టప్రభుత్వం పోరాటం చేసిందా? రాష్ర్టంలో దాదాపు రెండు కోట్ల కుటుంబాలున్నాయి. గ్రామంలో, పట్టణంలో ఉన్నా.. ప్రతి ఒక్కరూ పిల్లల్ని బాగా చదివించాలని, చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలని, రోగాలు వస్తే ఆస్తులు అమ్ముకోకుండా వైద్యం అందాలని, వృద్ధులైన తల్లిదండ్రులకు అండదండలు అందించే ప్రభుత్వం తోడుగా ఉండాలని, చేసే పనిలో ఆదాయం తగ్గకుండా ఉండాలని కోరుకుంటారు. విభజన తర్వాత ఈ ఆరు విషయాల్లో భరోసా ఇచ్చేలా ప్రభుత్వం పరిపాలన చేసిందా? తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారు.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెబుతుంటే.. వాళ్లు ఏ ప్యాకేజీ ఇవ్వకపోరుునా.. బ్రహ్మాండంగా ప్యాకేజీలు ఇచ్చారని అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని పుస్తకాలు అచ్చేసి ప్రజాప్రతినిధులకు పంచుతున్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి, ఐదున్నర కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడు. తన చీకటి కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. కానీ బాబు చేస్తున్నది చూసి ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. నేడు తెలుగుదేశం పార్టీని తెలుగుద్రోహుల పార్టీగా మార్చారు చంద్రబాబు. ప్రత్యేక హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో ఉద్యోగాలు రావటం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన జిల్లాలకు, మన పట్టణాలకు రావటమే ప్రత్యేక హోదా. బాబుపై టాడా కేసు పెట్టినా తప్పులేదు.. హోదా ఎందుకు ఇవ్వరని అడగటానికి ముఖ్యమంత్రి ముందుకు రారు. ఇవ్వకపోతే కుదరదు అని చెప్పడానికి ముఖ్యమంత్రికి ధైర్యం లేదు. పైగా హోదా అక్కర్లేదని చెబుతాడు. హోదాపై ఎవరైనా మాట్లాడినా, మద్దతు తెలిపినా పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తాడు. హోదా కోసం బంద్‌లు చేస్తే ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఆర్టీసీ బస్సులను ఈయనే దగ్గరుండి తిప్పిస్తాడు. ఇలాంటి వ్యక్తిపై టాడా కేసు పెట్టినా తప్పులేదు. హోదా వల్లే రాష్ట్రం బాగుపడుతుంది. హోదా వల్లే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తారుు. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. హోదా వల్లే నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయి. ఇటువంటి హోదాను రాకుండా చేయటంలో ముఖ్యమంత్రి, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ అందరూ ఒక్కటై అబద్ధాలు ఆడుతున్నారు. మోసాలు చేస్తున్నారు. ఆ సంస్థలు అన్ని రాష్ట్రాలకూ ఇచ్చేవేగా? జైట్లీ ఇటీవలే విజయవాడలో మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా 25 సంస్థలు ఇచ్చామన్నారు. వెంకయ్య, జైట్లీ, బాబులను ఒక్కటే ప్రశ్నిస్తున్నా. దేశంలోని 29 రాష్ట్రాలలో కోటి జనాభా పైన ఉన్న రాష్ట్రాలు 20 ఉన్నాయి. కోటి జనాభా ఉన్న ఏ రాష్ర్టంలో ఈ సంస్థలు లేవు? కోటి జనాభా ఉన్న రాష్ట్రాలలో ఐఐటీలు 22, ఎన్ఐటీలు 30, సెంట్రల్ యూనివర్సిటీలు 41, ఐఐఎంలు 19, ట్రిపుల్ ఐటీలు 19 ఉన్నాయి. మరి మీరు మా రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నట్లు? మాకు దానమో ధర్మమో ఇస్తున్నట్లు రోజూ మాట్లాడుతారు. మీకేదో ధర్మం చేస్తున్నాం.. బిచ్చమేస్తున్నాం.. దయచూపిస్తున్నాం అన్నట్లు మాట్లాడడానికి మనసెలా వస్తుంది? ఇటీవల గుజరాత్‌కి రైల్వే యూనివర్శిటీ ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు? యాక్ట్ లో ఉండి విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వటంలేదు? యాక్ట్ లో ఉండీ పోలవరంను కేంద్రం ఎందుకు కట్టడం లేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో అనేక సంస్థలు ఏర్పాటు చేశారు. ఐఐసీటీ, సీసీఎంబీ, బీహెచ్ఈఎల్, హెచ్ఐఎల్, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, మిథానీ, బీడీఎల్, డీఎంఆర్, డీఆర్డీఎల్, డీఆర్డీఓ, ఆర్డినెన్ ్స ఫ్యాక్టరీ పెట్టారు. ఏ యాక్ట్ లో ఉన్నాయని ఆరోజు హైదరాబాద్ లో పెట్టారు. సిగ్గులేకుండా 40 ఏళ్లలో ఎప్పుడూ ఇవ్వనటువంటివి ఏపీకి ఇచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నవి ఏపీలో కూడా పెడతామన్న మాటన్నా మీ నోట్లోనుంచి వస్తుందా? ఆర్థిక సంఘం అదనంగా అర్ధరూపాయి ఇచ్చిందా? ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, అబద్ధాలాడుతూ పుండుమీద కారం చల్లడం భావ్యమేనా? జైట్లీ, వెంకయ్య ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా ఏపీకి నిధులు ఇచ్చామని ఇటీవల విజయవాడలో చెప్పారు. 12వ ఫైనాన్ ్స కమిషన్ (2004-2009) రూ. 35వేల కోట్లే ఇచ్చిందనీ, 13వ ఫైనాన్స్ కమిషన్ (2010-2015) రూ. 69వేల కోట్లే ఇచ్చిందనీ, 14వ ఫైనాన్ ్స కమిషన్ 2015-20 వరకు అమల్లో ఉంటుందనీ, 2లక్షల 3వేల కోట్లు ఇస్తోందని చెబుతున్నారు. చాలా గొప్పగా ఇస్తున్నారని జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు చెబుతున్నారు. నిజమేమిటంటే ఈ ఆర్థిక సంఘం చైర్మన్, మెంబర్స్‌ను వీళ్లు రాకముందే 2013 జనవరిలో నియమించారు. వాళ్లు ఇచ్చిన నివేదికను వీళ్లు ఆమోదించారు. దీంట్లో మీ గొప్పదనం ఏమిటి? 14వ ఆర్థిక సంఘం ఏపీకి మిగిలిన రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఒక్క అర్ధరూపారుు కూడా ఎక్కువ ఇవ్వలేదు. అందరితోపాటు మాకు ఇచ్చారు. రాష్ట్రాల రెవెన్యూలోటు దేశం మొత్తం మీద 1,94,000 కోట్ల రూపాయలు గ్రాంటు కింద పెట్టి 11 రాష్ట్రాలకు (అందులో కేరళ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా) పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.22,113 కోట్లు. మన భాగం కింద ఇచ్చారే తప్ప ఎక్కువ ఇచ్చిందేమీ లేదు. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు కూడా మిగిలిన రాష్ట్రాలకు మాదిరిగానే మన రాష్ట్రానికి రూ.12వేల కోట్లు కేటాయించారు. ఇలాంటివన్నీ కలిపితే రూ. 2.03 లక్షల కోట్లు అవుతాయి. చంద్రబాబు మొహాన్ని చూసి ఎవరొస్తారు? ప్రత్యేక హోదా రద్దు చేయమని 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా సిఫార్సు చేయలేదు. ఆ విషయం తెలుపుతూ ఆ కమిషన్ సభ్యుడే లేఖ రాశారు. ప్రత్యేక హోదా వల్ల కేవలం 90 శాతం కేంద్రం నిధులు, 10 శాతం రాష్ర్టం భరించే మొత్తం తప్ప ఇంకేవీ లేవని బాబు చెబుతున్నారు. 100 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు, 100శాతం ఎక్సైజ్ ట్యాక్స్ మినహాయింపు, రవాణా సదుపాయాలు ఎందుకు హోదా ఉన్న రాష్ట్రాలకే ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదు? ఇతర ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స ప్రత్యేకహోదా వల్లే వస్తాయి. పారిశ్రామిక వేత్తలు సుందరమైన చంద్రబాబు మొహాన్ని చూసి రారు. రారుుతీలు వస్తాయంటే వస్తారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టడానికే రెండుమూడేళ్లు పడుతుందని అన్నారు. అది ప్రత్యేక హోదా కోసం కాదా? ఐదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలని మోదీని చంద్రబాబు కోరలేదా? 14వ ఆర్థిక సంఘం రికమండేషన్ ్స వచ్చిన తర్వాత కూడా ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం రెండుసార్లు చంద్రబాబు ఎందుకు తీర్మానం చేరుుంచారు? మేధావుల మౌనం ప్రమాదం.. ‘సమాజంలో అనేక అనర్థాలకు కారణం.. మూర్ఖులు అబద్ధాలను నిజమని వాదిస్తే మేధావులు మౌనంగా ఉండిపోవడమే’ అని బ్రిటిష్ ఫిలాసఫర్ బెర్ట్రాండ్ రస్సెల్ వ్యాఖ్యానించారు. అందువల్ల మేధావులారా.. గొంతెత్తండి. ఏపీ ప్రజలారా ఏకంకండి. హోదా వచ్చేవరకు చేరుు చేరుు కలపండి. పోరుబాటలో నడుద్దాం ప్రత్యేక హోదా సాధిద్దాం.. జగన్‌కు మీ తోడు కావాలి. జగన్‌కు మీ అండదండలు కావాలి. అప్పుడే ప్రత్యేక హోదా అన్నది నిజమవుతుంది. సాధ్యం కాదనుకున్న తెలంగాణను పోరాటం చేసి సాధించారు.. మనం పార్లమెంట్లో తీర్మానం చేసిన ప్రత్యేక హోదా సాధిద్దాం’’అని అన్నారు. ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసారుురెడ్డి, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, తమ్మినేని సీతారాం, పెనుమత్స సాంబశివరాజు, బలిరెడ్డి సత్యారావు, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, కె.శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, రాజన్నదొర, పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, కళావతి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిలతో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
బాబు పాలన ఏడ్చినట్టు ఉంది
-
బికినీ పార్టీలట.. గంతులు వేస్తారట!
-
బికినీ పార్టీలట.. గంతులు వేస్తారట!
విశాఖపట్నం: ఘన చర్రిత కలిగిన విశాఖ సముద్రతీరంలో ‘బీచ్ లవ్ ఫెస్టివల్’ పేరిట నిర్వహిస్తున్న బికినీ పార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తప్పుబట్టారు. ‘ఇదే విశాఖ గడ్డపై బికినీ పార్టీలు అట. సముద్రతీరంలో టెంట్లు వేస్తారట. తొమ్మిదివేల జంటలను తీసుకొస్తారట. సముద్రతీరంలో వారు గంతులు వేస్తారట’ అని వ్యాఖ్యానించారు. మహిళల మీద చంద్రబాబుకున్న ఈ అగౌరవానికి ఆయనను జైలులో పెట్టిన పాపం లేదని ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లో ఉన్నారని విమర్శించారు. ‘రిషితేశ్వరి చనిపోయినా పట్టించుకోరు. ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చినా పట్టించుకోలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారాలప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తితే.. కాలుష్యానికి వ్యతిరేకంగా గొంతెత్తితే.. 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు పెడుతున్నారని, బాబు పాలనలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. సువర్ణాంధ్ర కథ దేవుడెరుగు..! ‘చంద్రబాబు తన పాలనలో రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామంటే నమ్మి.. వయస్సులో పెద్దాయన అని ఆయనకు పట్టంకట్టారు. కానీ సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. ఏపీ కరువుప్రదేశ్గా మారిపోయింది’ అని వైఎస్ జగన్ విమర్శించారు. బాబు సీఎం అయ్యాక వరుసగా మూడో సంవత్సరం కరువు, లేదా అకాల వర్షాలు సంభవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలప్రదేశ్‌గా మారిందని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సువర్ణాంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలప్రదేశ్‌గా మారింది. రాష్ట్రంలో 93శాతం రైతులు ఇవాళ అప్పుల ఊబిలో ఉన్నారని, రైతుల అప్పుల విషయంలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సెస్ నివేదిక ఇచ్చింది. రైతులకు రుణాలుమాఫీ కావడంతో బ్యాంకులు వారి నుంచి అపరాధ వడ్డీని వసూలు చేస్తున్నాయి. దీంతో రైతులు బ్యాంకులకు వెళ్లేలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సువర్ణాంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రరాష్ట్రం అవినీతిలో నంబర్ వన్‌గా ఉందని NCAER సర్వే చేసి మరీ తెలిపింది. సువర్ణాంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. మంచినీటి కథ దెవుడెరుగు మద్యం మాత్రం ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా దొరుకుతోంది సీఎం డెయిరీ మాత్రం వెలిగిపోతోంది బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో వృద్ధిరేటు మద్యం విషయంలోనే కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన సొంత ఆస్తులు పెరుగుతున్నాయి. బాబు సీఎం అయినప్పుడు హెరిటేజ్ షేర్ ధర రూ. 200 ఉంటే అది ఇప్పుడు రూ. 900కు పెరిగింది. ఏకంగా 450శాతం పెరిగింది. అన్నీ డెయిరీలు మూతపడ్డా.. సీఎం డెయిరీ మాత్రం వెలిగిపోతోంది. నల్లధనం.. తెల్లధనంగా మార్చుకోవడం చంద్రబాబు దగ్గరే నేర్చుకోవాలి. -
బాబు పాలన ఏడ్చినట్టు ఉంది: వైఎస్ జగన్
విశాఖపట్నం: చంద్రబాబునాయుడు గత రెండున్నరేళ్ల పరిపాలనలో ఎక్కడా ప్రజలు సంతోషంగా లేరని, ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. ఒకప్పుడు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్యమానికి విశాఖ గడ్డ స్ఫూర్తినిచ్చిందని, ఈరోజు ఇదే గడ్డ మీద ప్రత్యేక హోదా ఉద్యమబాట పట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 2014 ఎన్నికల సమయంలో ఇదే వేదికపై నిలబడి చంద్రబాబు నాయుడు, నరేంద్రమోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇదే వేదిక మీద ఐదేళ్లు కాదు, పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చారు. ఈ రోజు అబద్ధాలు చెప్పి, మోసం చేసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తివిధంగా ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ నినదించాలి. ( చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవిధంగా నినదించాలని వైఎస్ జగన్ కోరడంతో సభాప్రాంగణం ఒక్కసారిగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో మార్మోగింది). విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమానికి నేటితో 50 ఏళ్లు నిండింది. ఈ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు.. స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్న గడ్డ విశాఖపట్నం. మన ప్రభుత్వమే మన కంట్లో వేలు పొడిచేలా చేస్తుండటంతో విశాఖ వేదికగా జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని చేపడుతున్నాం. కొన్ని ప్రశ్నలతో వచ్చా: వైఎస్ జగన్ ప్రసంగాలతో ఊదరగొట్టడానికి ఈ సభకు రాలేదు.. నా ఆవేదన పంచుకోవడానికి వచ్చా. ఇక్కడికి కొన్ని ప్రశ్నలతో వచ్చా. కొన్ని ఆలోచనలతో వచ్చా. మిమ్మల్ని కూడా ఆలోచింపజేయడానికి వచ్చా. రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి. మనకు లాభం జరుగుతుందని చెప్పి విభజన చేశారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో విభజన వల్ల మన రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందా? లేక నష్టపోయామా? అన్నది ఆలోచన చేయాలి. ఈ రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు తోడుగా నిలబడిందా? విభజనతో మనకు మంచి జరిగిందా? అన్నది ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబమైనా కోరుకునేది తమ పిల్లల్ని చదువించుకోవాలని, వారికి మంచి కొలువులు రావాలని, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలని, జబ్బులు వస్తే ఆస్తులు అమ్మకుండా వైద్యం అందాలని, వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రభుత్వ అండదండలు అందాలని, ఆదాయం తగ్గకూడదని కోరుకుంటారు. విభజన అనంతరం ఈ కనీస విషయాల్లో భరోసా ఇచ్చేవిధంగా ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పరిపాలన అందించిందా? అంటే లేదని ప్రజల నుంచి వినిపిస్తోంది. గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాం? మన గ్రామాలు సంతోషంగా ఉన్నాయా? మన రైతులు, కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరు. మన డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? మన యువత, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేరు. మన రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్ల సంవత్సరాల్లో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి? మన రైతులు తమ భూమిని ప్రభుత్వం లాక్కోకుండా ఉంటుందని భరోసాగా ఉన్నారా? అంటే అదీ లేదు. అందరికీ పక్కా ఇళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? అప్పులు కాకుండా మన పిల్లలు చదువులు పూర్తిచేసుకునే పరిస్థితి ఉందా? లేదు. ఎక్కడా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం కనీసం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలైనా నెరవేర్చిందా? బేషరతుగా పూర్తిగా రైతులకు రుణమాఫీ చేశారా? బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ అమలైందా? అంటే అదీ లేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికీ రెండువేల భృతి ఇస్తానన్నారు? ఈ 30 నెలల బాబు పాలనలో మీ ఇంటికి రూ. 60వేల నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటే రాలేదన్న సమాధానమే ప్రజల నుంచి వినిపిస్తోంది. బెల్టు షాపులు తీసేస్తామన్నారు. కనీసం గ్రామాల్లో బెల్టు షాపులు తగ్గాయా? లేదు ఎన్నికలప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు ఇవాళ ప్రజలెవరూ సంతోషంగా లేరు. చంద్రబాబు పాలన ఏడ్చినట్టు ఉంది. వైఎస్సార్ ప్రభుత్వం ఇళ్లు కట్టడంలో రికార్డుగా నిలిచింది ఇవాళ పేదలు ఇళ్ల కోసం నిరీక్షిస్తూ వెతికినా ఒక్క ఇల్లు కనబడని పరిస్థితి వైఎస్సార్ పాలనలో అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ ఇచ్చారు మనం రాష్ట్రంలో గ్యాస్ ఇచ్చిన తర్వాతే తీసుకెళ్లాలని వైఎస్సార్ పోరాడారు రెండో విప్లవం రావాలి కేంద్రం బెదిరించక ముందు మన సీఎం చేతులెత్తేసి వారి కాళ్ల మీద పడే పరిస్థితి ఇవాళ ఉంది ప్రతి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్న, సామాజికంగా ఎదగాలన్నా ఉద్యోగాల విప్లవం, రెండో విప్లవం రావాలి చదువుల విప్లవం వస్తే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుంది ముందుండి పోరాటం చేయాల్సిన సీఎం చదువుల విప్లవంను నీరు గార్చారు చంద్రబాబు పాలనలో అవినీతి విప్లవం వచ్చింది కేసుల నుంచి బటయపడేందుకు 5 కోట్ల ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చేయని కుట్ర లేదు ఒక సీఎం అవినీతి సొమ్మును సూట్ కేసులో పెట్టుకుని నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా అరెస్ట్ కాలేదు చంద్రబాబు కాబట్టే మన ఖర్మ కొద్ది ఇదంతా చూడాల్సి వస్తోంది ప్రజలకు మేలు చేయడం కోసం సీఎం వెనుకడుగు వేయకుండా పరితపించాలి అవకాశం ఉంటే ఇక్కడ ఎందుకు పుడతాం, నేను, వెంకయ్య అమెరికా పుట్టేవాళ్లం అంటాడు ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి యోగ్యుడా అని ప్రశ్నిస్తున్నా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ బ్రహ్మండంగా ఉందని అంటున్నాడు హోదా కోసం పోరాటం చేయాల్సిన సీఎం వెన్నుపోటు పొడుస్తున్నాడు మన రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి సొంత లాభం కోసం వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు రాష్ట్రం నివ్వెరపోతోంది వెంకయ్య, చంద్రబాబు కలిసి చీకటి ఒప్పందాల కోసం ప్రజల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఆనాడు టీడీపీ పార్టీ ఆవిర్భవించింది ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి టీడీపీని చంద్రబాబు దిగజార్చారు తెలుగువాడి ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుకుంటున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలి ప్రత్యేక హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర రాష్టాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు, మన జిల్లాలకు, మన దగ్గరకు రావడమే ప్రత్యక హోదా అంటే హోదా తేవాలని సీఎంకు, ఇవ్వాలని కేంద్రానికి లేదు. ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకుని కూచోవాలా చేతుల కట్టుకునే జాతేనా మనది. చేతులు కట్టుకునివుంటే స్వాతంత్ర్యం వచ్చేదా, మద్రాసులో రెండో శ్రేణి పౌరులుగానే ఉండేపోయేవాళ్లం ఉద్యమాలు అంటే వెరపు లేదు, జైళ్లు అంటే భయం లేదు అన్ని ప్రాంతాల్లో సభలు, యువభేరీలు పెడతాం.. ధర్నాలు చేస్తాం, పోరాటం కొనసాగిస్తాం.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శీతాకాల సమావేశాలకు వరకు వేచి చూస్తాం అప్పటికీ హోదా ఇవ్వకుంటే మా ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి, మనకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తాం ప్రత్యేక హోదా అంశాన్ని 2019 ఎన్నికల్లో రెఫరెండంగా మార్చే ప్రయత్నం చేస్తాం ప్రత్యేక హోదా డిమాండ్ ఎవరైనా చేస్తే పీడీ యాక్టు పెడతానని చంద్రబాబు బెదిరిస్తాడు హోదా కోసం బంద్ లు చేస్తే దగ్గరుండీ ఆర్టీసీ బస్సులను ఆయనే తిప్పిస్తాడు ఇటువంటి వ్యక్తి మీద టాడా కేసు పెట్టినా తప్పులేదు ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది, ప్రత్యేక హోదా వల్లే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు కలిసి హోదా రాకుండా కుట్ర చేస్తున్నారు విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు? మీకేదో ధర్మం చేస్తున్నామన్నట్టుగా కేంద్రం మాట్లాడడం దారుణం ఏ యాక్ట్ ప్రకారం గుజరాత్ కు రైల్వే వర్సిటీ ఇచ్చారు విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదు పోలవరం ఎందుకు కట్టడం లేదని నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో సీసీఎంబీ, ఐఐసీటీ, బీహెచ్ఈఎల్, హెచ్ ఏఎల్, ఈసీఐఎల్, మిధాని, బీడీఎల్, డీఆర్ డీఎల్.. ఏ యాక్టులో ఉందని ఆ రోజు హైదరాబాద్ లో ఇవన్నీ పెట్టారు 40 ఏళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని సంస్థలు ఏపీలో పెట్టామని సిగ్గులేకుండా చెబుతున్నారు ఏపీ కూడా పెడతామన్న మాట కేంద్రం నుంచి రాకపోవడం శోచనీయం ప్రత్యేక హోదా ఇవ్వకుండా రోజూ పుండుమీద కారం చల్లుతున్నారు ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా చాలా గొప్పగా నిధులు ఇస్తున్నామని జైట్లీ, వెంకయ్య చెబుతున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. 14వ ఆర్థిక సంఘం ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని రికమండ్ చేయలేదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా ప్రతిపాదించలేదు పోరుబాటలో నడుద్దాం.. హోదా సాదిద్దాం.. పారిశ్రామిక రాయితీలు, వందశాతం సబ్సిడీలు ఎందుకు హోదా వచ్చిన రాష్ట్రాలకే ఇచ్చారు? పెట్టుబడులు చంద్రబాబు మొహం చూసి రావు పారిశ్రామిక రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు పెట్టడానికే రెండుమూడేళ్లు పడుతుందని, ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇవ్వాలని పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు డిమాండ్ చేయలేదా? ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వస్తాయనే కదా వెంకయ్య ఆరోజు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారు ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికలైన పోయిన తర్వాత ఒకలా మాట్లాడుతున్నారు మేధావుల్లారా గొంతు ఎత్తండి.. ప్రజలంతా ఏకం కావాలి. మీ దీవెనలు, తోడ్పాటు, ఆదరణ కావాలి.. అందరం కలుద్దాం, ఒక్కటవుదాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం పోరుబాటలో నడుద్దాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం మీరంతా నాకు తోడుగా నిలబడమని అర్దిస్తున్నాను జై ఆంధ్రప్రదేశ్... -
ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?
-
ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?
విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలందరి హక్కు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలందరు సాధించుకున్న హక్కు అయిన హోదాను కాదని, ప్యాకేజీని అంగీకరించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రజలందరి ఆకాంక్షలను తెలియజేయడానికే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను సమర్థించిన అప్పటి ప్రతిపక్షం బీజేపీ పదేళ్లు హోదా కావాలని కోరింది’ అని గుర్తుచేశారు. విభజనతో జరిగే నష్టాన్ని పూడ్చేందుకు, విభజన ఇష్టం లేని ప్రజలందరినీ సముదాయించేందుకు ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను వదిలేసుకుంటున్నట్టు చంద్రబాబు చల్లగా చెప్పారని విమర్శించారు. దీంతో అర్ధరాత్రి ప్యాకేజీ ఇస్తే చాలన్నట్టుగా అరుణ్ జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేశారని, ఒక ప్రాంతం ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఎలా వదిలేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలతో, ప్రతిపక్షంతో ఏమాత్రం సంప్రదించకుండా గుట్టుచప్పుడు కాకుండా హోదా అంశాన్ని పక్కనపెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. -
జై ఆంధ్రప్రదేశ్ సభకు చేరుకున్న వైఎస్ జగన్
-
‘ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది’
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెలోనూ మార్మోగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తానన్న అరుణ్‌జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి స్వాగతించిన మహాఘనుడు చంద్రబాబు అని ఆమె మండిపడ్డారు. ‘చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఆ రోజు ఏపీకి ఐదేళ్ల కాదు పదేళ్లు ఇవ్వాలని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు హోదా వద్దు, ఆర్థిక ప్యాకేజీ చాలు అని ద్రోహం చేస్తున్నారు. హోదా విషయంలో రాత్రికి రాత్రే చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు. తనకు, తన కొడుకుకు దోచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్యాకేజీని స్వాగతిస్తున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన ఓ అబద్ధాల పుట్ట. ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న గిరిజనులకు ఉచితంగా కందిపప్పు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా కిలో రూ. 40 చొప్పున నాసిరకం కందిపప్పు అందిస్తున్నారు’ అని ఆమె అన్నారు. ‘ చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి కులరాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప.. ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు. హోదా ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేస్తున్న నేత వైఎస్ జగన్‌కు ప్రజలు అండగా ఉండాలని ఆమె కోరారు. లోకేశ్‌కు మంత్రి హోదా కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రత్యేక హోదా పోరాటాన్ని ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. -
‘ప్రతి ఒక్కరి గుండెలో హోదా మార్మోగుతోంది’
-
జై ఆంధ్రప్రదేశ్ సభకు భారీగా వస్తున్న జనం
-
విశాఖపట్నం చేరుకున్న వైఎస్ జగన్
-
విశాఖపట్నం చేరుకున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్ఆర్ సీపీ నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా సర్క్యూట్ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. గెస్ట్ హౌస్‌లో వైఎస్ జగన్‌ను బౌద్ధులు కలిసి తొట్లకొండలో సినీ కల్చరల్ క్లబ్ కోసం కేటాయించిన భూములను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. -
జై ఆంధ్రప్రదేశ్ సభకు భారీగా వస్తున్న జనం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు జనం భారీగా తరలివస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆదివారం ఉదయం బహిరంగ సభ వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన సభలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని విస్మరించారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బొత్స చెప్పారు.