విశాఖపట్నం చేరుకున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్‌ఆర్ సీపీ నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా సర్క్యూట్ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. గెస్ట్ హౌస్‌లో వైఎస్ జగన్‌ను బౌద్ధులు కలిసి తొట్లకొండలో సినీ కల్చరల్ క్లబ్ కోసం కేటాయించిన భూములను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వైఎస్ జగన్ చేరుకుంటారు.