బాబు పాలన ఏడ్చినట్టు ఉంది: వైఎస్ జగన్
- 2014 ఎన్నికల సమయంలో ఇదే వేదికపై నిలబడి చంద్రబాబు నాయుడు, నరేంద్రమోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.
- ఇదే వేదిక మీద ఐదేళ్లు కాదు, పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చారు.
- ఈ రోజు అబద్ధాలు చెప్పి, మోసం చేసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తివిధంగా ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ నినదించాలి. ( చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవిధంగా నినదించాలని వైఎస్ జగన్ కోరడంతో సభాప్రాంగణం ఒక్కసారిగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో మార్మోగింది).
- విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమానికి నేటితో 50 ఏళ్లు నిండింది.
- ఈ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు.. స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్న గడ్డ విశాఖపట్నం.
- మన ప్రభుత్వమే మన కంట్లో వేలు పొడిచేలా చేస్తుండటంతో విశాఖ వేదికగా జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని చేపడుతున్నాం.
- ప్రసంగాలతో ఊదరగొట్టడానికి ఈ సభకు రాలేదు.. నా ఆవేదన పంచుకోవడానికి వచ్చా. ఇక్కడికి కొన్ని ప్రశ్నలతో వచ్చా. కొన్ని ఆలోచనలతో వచ్చా. మిమ్మల్ని కూడా ఆలోచింపజేయడానికి వచ్చా.
- రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి.
- మనకు లాభం జరుగుతుందని చెప్పి విభజన చేశారు.
- ఈ రెండున్నర సంవత్సరాల్లో విభజన వల్ల మన రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందా? లేక నష్టపోయామా? అన్నది ఆలోచన చేయాలి.
- ఈ రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు తోడుగా నిలబడిందా? విభజనతో మనకు మంచి జరిగిందా? అన్నది ఆలోచన చేయాలి.
- రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబమైనా కోరుకునేది తమ పిల్లల్ని చదువించుకోవాలని, వారికి మంచి కొలువులు రావాలని, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలని, జబ్బులు వస్తే ఆస్తులు అమ్మకుండా వైద్యం అందాలని, వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రభుత్వ అండదండలు అందాలని, ఆదాయం తగ్గకూడదని కోరుకుంటారు. విభజన అనంతరం ఈ కనీస విషయాల్లో భరోసా ఇచ్చేవిధంగా ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పరిపాలన అందించిందా? అంటే లేదని ప్రజల నుంచి వినిపిస్తోంది.
- గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాం? మన గ్రామాలు సంతోషంగా ఉన్నాయా? మన రైతులు, కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరు. మన డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? మన యువత, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేరు.
- మన రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్ల సంవత్సరాల్లో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి?
- మన రైతులు తమ భూమిని ప్రభుత్వం లాక్కోకుండా ఉంటుందని భరోసాగా ఉన్నారా? అంటే అదీ లేదు.
- అందరికీ పక్కా ఇళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? అప్పులు కాకుండా మన పిల్లలు చదువులు పూర్తిచేసుకునే పరిస్థితి ఉందా? లేదు.
- ఎక్కడా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
- ఈ ప్రభుత్వం కనీసం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలైనా నెరవేర్చిందా?
- బేషరతుగా పూర్తిగా రైతులకు రుణమాఫీ చేశారా? బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ అమలైందా? అంటే అదీ లేదు.
- జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికీ రెండువేల భృతి ఇస్తానన్నారు? ఈ 30 నెలల బాబు పాలనలో మీ ఇంటికి రూ. 60వేల నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటే రాలేదన్న సమాధానమే ప్రజల నుంచి వినిపిస్తోంది.
- బెల్టు షాపులు తీసేస్తామన్నారు. కనీసం గ్రామాల్లో బెల్టు షాపులు తగ్గాయా? లేదు
- ఎన్నికలప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు
- ఇవాళ ప్రజలెవరూ సంతోషంగా లేరు. చంద్రబాబు పాలన ఏడ్చినట్టు ఉంది.
- వైఎస్సార్ ప్రభుత్వం ఇళ్లు కట్టడంలో రికార్డుగా నిలిచింది
- ఇవాళ పేదలు ఇళ్ల కోసం నిరీక్షిస్తూ వెతికినా ఒక్క ఇల్లు కనబడని పరిస్థితి
- వైఎస్సార్ పాలనలో అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ ఇచ్చారు
- మనం రాష్ట్రంలో గ్యాస్ ఇచ్చిన తర్వాతే తీసుకెళ్లాలని వైఎస్సార్ పోరాడారు
రెండో విప్లవం రావాలి
- కేంద్రం బెదిరించక ముందు మన సీఎం చేతులెత్తేసి వారి కాళ్ల మీద పడే పరిస్థితి ఇవాళ ఉంది
- ప్రతి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్న, సామాజికంగా ఎదగాలన్నా ఉద్యోగాల విప్లవం, రెండో విప్లవం రావాలి
- చదువుల విప్లవం వస్తే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుంది
- ముందుండి పోరాటం చేయాల్సిన సీఎం చదువుల విప్లవంను నీరు గార్చారు
- చంద్రబాబు పాలనలో అవినీతి విప్లవం వచ్చింది
- కేసుల నుంచి బటయపడేందుకు 5 కోట్ల ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చేయని కుట్ర లేదు
- ఒక సీఎం అవినీతి సొమ్మును సూట్ కేసులో పెట్టుకుని నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా అరెస్ట్ కాలేదు
- చంద్రబాబు కాబట్టే మన ఖర్మ కొద్ది ఇదంతా చూడాల్సి వస్తోంది
- ప్రజలకు మేలు చేయడం కోసం సీఎం వెనుకడుగు వేయకుండా పరితపించాలి
- అవకాశం ఉంటే ఇక్కడ ఎందుకు పుడతాం, నేను, వెంకయ్య అమెరికా పుట్టేవాళ్లం అంటాడు
- ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి యోగ్యుడా అని ప్రశ్నిస్తున్నా
- ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ బ్రహ్మండంగా ఉందని అంటున్నాడు
- హోదా కోసం పోరాటం చేయాల్సిన సీఎం వెన్నుపోటు పొడుస్తున్నాడు
- మన రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి సొంత లాభం కోసం వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు రాష్ట్రం నివ్వెరపోతోంది
- వెంకయ్య, చంద్రబాబు కలిసి చీకటి ఒప్పందాల కోసం ప్రజల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు
- తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఆనాడు టీడీపీ పార్టీ ఆవిర్భవించింది
- ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి టీడీపీని చంద్రబాబు దిగజార్చారు
- తెలుగువాడి ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుకుంటున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలి
- ప్రత్యేక హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు
- ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి
- ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర రాష్టాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు, మన జిల్లాలకు, మన దగ్గరకు రావడమే ప్రత్యక హోదా అంటే
- హోదా తేవాలని సీఎంకు, ఇవ్వాలని కేంద్రానికి లేదు. ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకుని కూచోవాలా
- చేతుల కట్టుకునే జాతేనా మనది. చేతులు కట్టుకునివుంటే స్వాతంత్ర్యం వచ్చేదా, మద్రాసులో రెండో శ్రేణి పౌరులుగానే ఉండేపోయేవాళ్లం
- ఉద్యమాలు అంటే వెరపు లేదు, జైళ్లు అంటే భయం లేదు
- అన్ని ప్రాంతాల్లో సభలు, యువభేరీలు పెడతాం.. ధర్నాలు చేస్తాం, పోరాటం కొనసాగిస్తాం..
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శీతాకాల సమావేశాలకు వరకు వేచి చూస్తాం
- అప్పటికీ హోదా ఇవ్వకుంటే మా ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి, మనకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తాం
- ప్రత్యేక హోదా అంశాన్ని 2019 ఎన్నికల్లో రెఫరెండంగా మార్చే ప్రయత్నం చేస్తాం
- ప్రత్యేక హోదా డిమాండ్ ఎవరైనా చేస్తే పీడీ యాక్టు పెడతానని చంద్రబాబు బెదిరిస్తాడు
- హోదా కోసం బంద్ లు చేస్తే దగ్గరుండీ ఆర్టీసీ బస్సులను ఆయనే తిప్పిస్తాడు
- ఇటువంటి వ్యక్తి మీద టాడా కేసు పెట్టినా తప్పులేదు
- ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది, ప్రత్యేక హోదా వల్లే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది
- అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు కలిసి హోదా రాకుండా కుట్ర చేస్తున్నారు
విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు?
- మీకేదో ధర్మం చేస్తున్నామన్నట్టుగా కేంద్రం మాట్లాడడం దారుణం
- ఏ యాక్ట్ ప్రకారం గుజరాత్ కు రైల్వే వర్సిటీ ఇచ్చారు
- విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదు
- పోలవరం ఎందుకు కట్టడం లేదని నేను అడుగుతున్నాను
- హైదరాబాద్ లో సీసీఎంబీ, ఐఐసీటీ, బీహెచ్ఈఎల్, హెచ్ ఏఎల్, ఈసీఐఎల్, మిధాని, బీడీఎల్, డీఆర్ డీఎల్.. ఏ యాక్టులో ఉందని ఆ రోజు హైదరాబాద్ లో ఇవన్నీ పెట్టారు
- 40 ఏళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని సంస్థలు ఏపీలో పెట్టామని సిగ్గులేకుండా చెబుతున్నారు
- ఏపీ కూడా పెడతామన్న మాట కేంద్రం నుంచి రాకపోవడం శోచనీయం
- ప్రత్యేక హోదా ఇవ్వకుండా రోజూ పుండుమీద కారం చల్లుతున్నారు
- ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా చాలా గొప్పగా నిధులు ఇస్తున్నామని జైట్లీ, వెంకయ్య చెబుతున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు.
- 14వ ఆర్థిక సంఘం ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని రికమండ్ చేయలేదు
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా ప్రతిపాదించలేదు
పోరుబాటలో నడుద్దాం.. హోదా సాదిద్దాం..
- పారిశ్రామిక రాయితీలు, వందశాతం సబ్సిడీలు ఎందుకు హోదా వచ్చిన రాష్ట్రాలకే ఇచ్చారు?
- పెట్టుబడులు చంద్రబాబు మొహం చూసి రావు
- పారిశ్రామిక రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయి
- పరిశ్రమలు పెట్టడానికే రెండుమూడేళ్లు పడుతుందని, ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇవ్వాలని పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు డిమాండ్ చేయలేదా?
- ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వస్తాయనే కదా వెంకయ్య ఆరోజు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారు
- ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికలైన పోయిన తర్వాత ఒకలా మాట్లాడుతున్నారు
- మేధావుల్లారా గొంతు ఎత్తండి.. ప్రజలంతా ఏకం కావాలి.
- మీ దీవెనలు, తోడ్పాటు, ఆదరణ కావాలి..
- అందరం కలుద్దాం, ఒక్కటవుదాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం
- పోరుబాటలో నడుద్దాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం
- మీరంతా నాకు తోడుగా నిలబడమని అర్దిస్తున్నాను
- జై ఆంధ్రప్రదేశ్...