తెలుగుజాతి తడాఖా చూపిద్దాం | Ys jaganmohan reddy comments on TDP government | Sakshi
Sakshi News home page

తెలుగుజాతి తడాఖా చూపిద్దాం

Published Mon, Nov 7 2016 2:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

తెలుగుజాతి తడాఖా చూపిద్దాం - Sakshi

తెలుగుజాతి తడాఖా చూపిద్దాం

ఏపీకి ‘హోదా’ సాధించేవరకు ఈ ఉద్యమం ఆగదు
‘జై ఆంధ్రప్రదేశ్’ వేదిక నుంచి వైఎస్ జగన్ ఉద్ఘాటన
 
 - సమైక్యంగా పోరాడదాం.. చేతులు కలపండి
 - మేధావుల మౌనం అనర్థం.. గొంతెత్తండి
 - జైళ్లకు భయపడం.. ప్రాణాలు లెక్కచేయం
 - బడ్జెట్ భేటీల తర్వాత ఎంపీల రాజీనామాలు
 - 2019 ఎన్నికల్లో హోదాపైనే రెఫరెండం
 - హోదాపై కేంద్రమంత్రులు, సీఎం అబద్ధ్దాలు
 - చంద్రబాబు పాలనలో అన్నింటా అధోగతి
 - అవినీతిలో నంబర్ వన్‌గా ఎదిగారు..
 - ఆయనపై టాడా కేసు పెట్టినా తప్పులేదు
 - బాబు పాలనలో ఒక్కరూ సంతోషంగా లేరు
 - హామీల అమలులో సున్నా..
 - ఏపీని మద్యాంధ్ర, కరువు ప్రదేశ్‌గా మార్చారు
 - చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు భయంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
 - ఇలాంటి వ్యక్తి పాలనకు అర్హుడా?
 
 హోదా మన హక్కు. ఇవ్వడం వారి బాధ్యత. హోదా ఇవ్వకపోతే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? అలా కూర్చునే జాతేనా మనది? చేతులు కట్టుకొని కూర్చునుంటే ఇవాళ్టికీ బ్రిటిష్ పాలనే ఉండేది. మద్రాసీల దగ్గర ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండేవాళ్లం.  
 - జగన్

 
తెన్నేటి విశ్వనాథం ప్రాంగణం (సాక్షి, విశాఖపట్నం): ‘‘ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పింది. హోదా తీసుకురావాలన్న ఆలోచనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. హోదా మన హక్కు..ఇవ్వడం వారి బాధ్యత.. ఇవ్వకపోతే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? చేతులు కట్టుకొని కూర్చునే జాతేనా మనది?  చేతులు కట్టుకొని కూర్చునుంటే ఇవాళ్టికీ బ్రిటీష్ పరిపాలన ఉండేది. ఇప్పటికీ మద్రాసీల దగ్గర ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండేవాళ్లం. అందుకే తెలుగుజాతి తడాఖా చూపిద్దాం’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టిన మలిదశ పోరులో భాగంగా ఆదివారం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం(తెన్నేటి విశ్వనాథం ప్రాంగణం)లో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ జరిగింది. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి లక్షలాదిగా పోటెత్తిన జనసమూహాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.

‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి భయపడం. ఉద్యమాలంటే వెరపులేదు. జైళ్లంటే భయం లేదు. ప్రాణాలు పోతాయన్న బాధేలేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యమాన్ని ఇంకా ఏ స్థారుుకై నా తీసుకెళ్తాం.’’ అని జగన్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో సభలు పెడతామని, యువభేరిలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ఒత్తిడి తీసుకురావడంతోపాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వరకు వేచి చూస్తామని, అప్పటికీ హోదా ఇవ్వక పోతే ఎంపీల చేత రాజీనామాలు చేరుుంచి ఉప ఎన్నికలకు వెళ్తామని జగన్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ద్వారా మనకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేట్లు చేస్తామని, 2019 ఎన్నికలు ప్రత్యేకహోదా రెఫరెండంగానే జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఏ జాతీయ పార్టీ అయినా ఓట్లడగాలంటే ప్రత్యేక హోదాపై మాట ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొస్తామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...

 మోసకారి నాయకుల గుండెలు అదరాలి..
 ‘‘ఇదే వేదిక నుంచి 2014లో చంద్రబాబు, మోదీ ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తామన్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి, రాజకీయాలు చేస్తున్న ఇటువంటి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ‘జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించండి. విశాఖలో ఎందరో మహనీయులు పుట్టారు. తెన్నేటి విశ్వనాథం, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ నడయాడిన పుణ్యభూమి విశాఖపట్నం. 1920నాటికే తొలి విశ్వవిద్యాలయం పుట్టినిల్లు విశాఖపట్టణం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమానికి 50 ఏళ్లు నిండారుు. స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకున్న ఉద్యమగడ్డ ఇది. మా రాజధానిలో మాకు కూడా ఉద్యోగాలలో సమానహక్కు ఉండదా అంటూ ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ విశాఖ. మన రాష్ట్ర ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రే, మన కేంద్ర ప్రభుత్వమే మన కంట్లో మన వేలితో పొడిచే కార్యక్రమం చేస్తుంటే ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ ఉద్యమబాట పట్టాల్సి వస్తోంది.

 నా ఆవేదనను పంచుకోవడానికే వచ్చా...
 ప్రసంగంతో ఊదరగొట్టటానికి రాలేదు. నా ఆవేదనను పంచుకోవడానికి వచ్చా. కొన్ని ఆలోచనలతో వచ్చా. రాష్ట్ర విభజనతో మనం లాభపడ్డామా? నష్టపోయామో ఆలోచించండి. లాభపడతామంటూ విభజన చేశారు. ఈ రెండున్నరేళ్లలో  ఏమన్నా లాభం జరిగిందా? మన హక్కుల కోసం ఈ రాష్ర్టప్రభుత్వం పోరాటం చేసిందా? రాష్ర్టంలో దాదాపు రెండు కోట్ల కుటుంబాలున్నాయి. గ్రామంలో, పట్టణంలో ఉన్నా.. ప్రతి ఒక్కరూ పిల్లల్ని బాగా చదివించాలని, చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలని, రోగాలు వస్తే ఆస్తులు అమ్ముకోకుండా వైద్యం అందాలని, వృద్ధులైన తల్లిదండ్రులకు అండదండలు అందించే ప్రభుత్వం తోడుగా ఉండాలని, చేసే పనిలో ఆదాయం తగ్గకుండా ఉండాలని కోరుకుంటారు. విభజన తర్వాత ఈ ఆరు విషయాల్లో భరోసా ఇచ్చేలా ప్రభుత్వం పరిపాలన చేసిందా?

 తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారు..
 ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెబుతుంటే.. వాళ్లు ఏ ప్యాకేజీ ఇవ్వకపోరుునా.. బ్రహ్మాండంగా ప్యాకేజీలు ఇచ్చారని అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని పుస్తకాలు అచ్చేసి ప్రజాప్రతినిధులకు పంచుతున్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి, ఐదున్నర కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడు. తన చీకటి కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. కానీ బాబు చేస్తున్నది చూసి ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. నేడు తెలుగుదేశం పార్టీని తెలుగుద్రోహుల పార్టీగా మార్చారు చంద్రబాబు.  ప్రత్యేక హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో ఉద్యోగాలు రావటం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన జిల్లాలకు, మన పట్టణాలకు రావటమే ప్రత్యేక హోదా.

 బాబుపై టాడా కేసు పెట్టినా తప్పులేదు..
 హోదా ఎందుకు ఇవ్వరని అడగటానికి ముఖ్యమంత్రి ముందుకు రారు. ఇవ్వకపోతే కుదరదు అని చెప్పడానికి ముఖ్యమంత్రికి ధైర్యం లేదు. పైగా హోదా అక్కర్లేదని చెబుతాడు. హోదాపై ఎవరైనా మాట్లాడినా, మద్దతు తెలిపినా పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తాడు. హోదా కోసం బంద్‌లు చేస్తే ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఆర్టీసీ బస్సులను ఈయనే దగ్గరుండి తిప్పిస్తాడు. ఇలాంటి వ్యక్తిపై టాడా కేసు పెట్టినా తప్పులేదు. హోదా వల్లే రాష్ట్రం బాగుపడుతుంది. హోదా వల్లే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తారుు. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. హోదా వల్లే నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయి. ఇటువంటి హోదాను రాకుండా చేయటంలో ముఖ్యమంత్రి, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ అందరూ ఒక్కటై అబద్ధాలు ఆడుతున్నారు. మోసాలు చేస్తున్నారు.

 ఆ సంస్థలు అన్ని రాష్ట్రాలకూ ఇచ్చేవేగా?
 జైట్లీ ఇటీవలే విజయవాడలో మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా 25 సంస్థలు  ఇచ్చామన్నారు. వెంకయ్య, జైట్లీ, బాబులను ఒక్కటే ప్రశ్నిస్తున్నా. దేశంలోని 29 రాష్ట్రాలలో కోటి జనాభా పైన ఉన్న రాష్ట్రాలు 20 ఉన్నాయి. కోటి జనాభా ఉన్న ఏ రాష్ర్టంలో ఈ సంస్థలు లేవు? కోటి జనాభా ఉన్న రాష్ట్రాలలో ఐఐటీలు 22, ఎన్‌ఐటీలు 30, సెంట్రల్ యూనివర్సిటీలు 41,  ఐఐఎంలు 19, ట్రిపుల్ ఐటీలు 19 ఉన్నాయి. మరి మీరు మా రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నట్లు? మాకు దానమో ధర్మమో ఇస్తున్నట్లు రోజూ మాట్లాడుతారు. మీకేదో ధర్మం చేస్తున్నాం.. బిచ్చమేస్తున్నాం.. దయచూపిస్తున్నాం అన్నట్లు మాట్లాడడానికి మనసెలా వస్తుంది? ఇటీవల గుజరాత్‌కి రైల్వే యూనివర్శిటీ ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు? యాక్ట్ లో ఉండి విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వటంలేదు? యాక్ట్ లో  ఉండీ పోలవరంను కేంద్రం ఎందుకు కట్టడం లేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో అనేక సంస్థలు ఏర్పాటు చేశారు. ఐఐసీటీ, సీసీఎంబీ, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఐఎల్, ఈసీఐఎల్, హెచ్‌ఎంటీ, మిథానీ, బీడీఎల్, డీఎంఆర్, డీఆర్‌డీఎల్, డీఆర్డీఓ, ఆర్డినెన్ ్స ఫ్యాక్టరీ పెట్టారు. ఏ యాక్ట్ లో ఉన్నాయని ఆరోజు హైదరాబాద్ లో పెట్టారు. సిగ్గులేకుండా 40 ఏళ్లలో ఎప్పుడూ ఇవ్వనటువంటివి ఏపీకి ఇచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నవి ఏపీలో కూడా పెడతామన్న మాటన్నా మీ నోట్లోనుంచి వస్తుందా?

 ఆర్థిక సంఘం అదనంగా అర్ధరూపాయి ఇచ్చిందా?
 ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, అబద్ధాలాడుతూ పుండుమీద కారం చల్లడం భావ్యమేనా?  జైట్లీ, వెంకయ్య ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా ఏపీకి నిధులు ఇచ్చామని ఇటీవల విజయవాడలో చెప్పారు. 12వ ఫైనాన్ ్స కమిషన్ (2004-2009) రూ. 35వేల కోట్లే ఇచ్చిందనీ, 13వ ఫైనాన్స్ కమిషన్ (2010-2015) రూ. 69వేల కోట్లే ఇచ్చిందనీ, 14వ ఫైనాన్ ్స కమిషన్ 2015-20 వరకు అమల్లో ఉంటుందనీ, 2లక్షల 3వేల కోట్లు ఇస్తోందని చెబుతున్నారు. చాలా గొప్పగా ఇస్తున్నారని జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు చెబుతున్నారు. నిజమేమిటంటే ఈ ఆర్థిక సంఘం చైర్మన్, మెంబర్స్‌ను వీళ్లు రాకముందే 2013 జనవరిలో నియమించారు. వాళ్లు ఇచ్చిన నివేదికను వీళ్లు ఆమోదించారు. దీంట్లో మీ గొప్పదనం ఏమిటి? 14వ ఆర్థిక సంఘం ఏపీకి మిగిలిన రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఒక్క అర్ధరూపారుు కూడా ఎక్కువ ఇవ్వలేదు. అందరితోపాటు మాకు ఇచ్చారు. రాష్ట్రాల రెవెన్యూలోటు దేశం మొత్తం మీద 1,94,000 కోట్ల రూపాయలు గ్రాంటు కింద పెట్టి 11 రాష్ట్రాలకు (అందులో కేరళ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా) పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.22,113 కోట్లు. మన భాగం కింద ఇచ్చారే తప్ప ఎక్కువ ఇచ్చిందేమీ లేదు. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు కూడా మిగిలిన రాష్ట్రాలకు మాదిరిగానే మన రాష్ట్రానికి రూ.12వేల కోట్లు కేటాయించారు. ఇలాంటివన్నీ కలిపితే రూ. 2.03 లక్షల కోట్లు అవుతాయి.

 చంద్రబాబు మొహాన్ని చూసి ఎవరొస్తారు?
 ప్రత్యేక హోదా రద్దు చేయమని 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా సిఫార్సు చేయలేదు. ఆ విషయం తెలుపుతూ ఆ కమిషన్ సభ్యుడే లేఖ రాశారు. ప్రత్యేక హోదా వల్ల కేవలం 90 శాతం కేంద్రం నిధులు, 10 శాతం రాష్ర్టం భరించే మొత్తం తప్ప ఇంకేవీ లేవని బాబు చెబుతున్నారు. 100 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు, 100శాతం ఎక్సైజ్ ట్యాక్స్ మినహాయింపు, రవాణా సదుపాయాలు ఎందుకు హోదా ఉన్న రాష్ట్రాలకే ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదు? ఇతర ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌‌స ప్రత్యేకహోదా వల్లే వస్తాయి. పారిశ్రామిక వేత్తలు సుందరమైన చంద్రబాబు మొహాన్ని చూసి రారు. రారుుతీలు వస్తాయంటే వస్తారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టడానికే రెండుమూడేళ్లు పడుతుందని అన్నారు. అది ప్రత్యేక హోదా కోసం కాదా? ఐదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలని మోదీని చంద్రబాబు కోరలేదా? 14వ ఆర్థిక సంఘం రికమండేషన్ ్స వచ్చిన తర్వాత కూడా ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం రెండుసార్లు చంద్రబాబు ఎందుకు తీర్మానం చేరుుంచారు?

 మేధావుల మౌనం ప్రమాదం..
 ‘సమాజంలో అనేక అనర్థాలకు కారణం.. మూర్ఖులు అబద్ధాలను నిజమని వాదిస్తే మేధావులు మౌనంగా ఉండిపోవడమే’ అని  బ్రిటిష్ ఫిలాసఫర్  బెర్ట్రాండ్ రస్సెల్ వ్యాఖ్యానించారు. అందువల్ల మేధావులారా.. గొంతెత్తండి. ఏపీ ప్రజలారా ఏకంకండి. హోదా వచ్చేవరకు చేరుు చేరుు కలపండి. పోరుబాటలో నడుద్దాం ప్రత్యేక హోదా సాధిద్దాం.. జగన్‌కు మీ తోడు కావాలి. జగన్‌కు మీ అండదండలు కావాలి. అప్పుడే ప్రత్యేక హోదా అన్నది నిజమవుతుంది. సాధ్యం కాదనుకున్న తెలంగాణను పోరాటం చేసి సాధించారు.. మనం పార్లమెంట్‌లో తీర్మానం చేసిన ప్రత్యేక హోదా సాధిద్దాం’’అని అన్నారు.

 ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసారుురెడ్డి, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, తమ్మినేని సీతారాం, పెనుమత్స సాంబశివరాజు, బలిరెడ్డి సత్యారావు, ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, కె.శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, రాజన్నదొర, పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, కళావతి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిలతో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement