సమస్యలు పరిష్కరించి, వేతనం పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మునిసిపల్ కార్మికులు 16 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు వైఎస్సార్ సీపీ, వామపక్ష, కాంగ్రెస్ నాయకులు నిమ్మరసం అందించి విరమింపజేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కార్మికులకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా నేత చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న పార్టీ మాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిసిపల్ ఉద్యోగులు, కార్మికుల కార్యచరణ జేఏసీ నేతలు నరసింహులు, గోపాల్ మాట్లాడుతూ అందరి సహకారం వల్లే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. వామపక్ష నేతలు జాఫర్, నాగేంద్ర, నరసింహులు, గోపాల్, పెద్దన్న, ఉపేంద్ర, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.
Published Sun, Jul 26 2015 9:08 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement