భార్య, కొడుకును తన వెంట పంపించి న్యాయం చేయాలంటూ రష్యా దేశస్థుడు హైదరాబాద్లో మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే...రష్యాకు చెందిన అలెక్స్ ఎర్మకోవ్ 2012లో గోవా పర్యటనకు వచ్చిన సమయంలో హైదరాబాద్ వాసి సనం ఉల్‌హక్ పరిచయమైంది. ప్రేమలో పడిన వారిద్దరూ బేగంపేట రిజిస్టర్ ఆఫీసులో 2014లో వివాహం చేసుకున్నారు.