సిస్టర్ నిర్మలా జోషి (81) మంగళవారం కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత సిస్టర్ నిర్మల మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు చేపట్టారు. మదర్ థెరెస్సా నెలకొల్పిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను సిస్టర్ నిర్మల 1997-2009 మధ్య బాధ్యతలు నిర్వహించారు. సిస్టర్ సేవలకు గుర్తింపుగా 2009లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. కాగా సిస్టర్ నిర్మల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. సిస్టర్ నిర్మల మృతి ప్రపంచానికి తీరని లోటు అని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
Jun 23 2015 1:56 PM | Updated on Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement