ఒడిశాలోని జగన్నాథ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరం పొడవునా... ఈ మహా దేవాలయ ప్రధాన గోపురం తాలూకూ నీడ ఎక్కడా కనిపించదట! వందల ఏళ్ల క్రితమే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టడం వల్ల ఇది సాధ్యమైందని మనకు తెలుసు. ఇప్పుడు పక్క ఫొటోలు చూడండి. ఇది న్యూయార్క్ మహా నగరంలో త్వరలో నిర్మించబోయే భవనం. పేరు... సోలార్ కార్వ్ టవర్. ఇది కూడా జగన్నాథ ఆలయం మాదిరిగా ఎలాంటి నీడ సృష్టించదు! నగరాల్లో భవనాలు పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ఉన్న వారికి గాలి వెలుతురు తగ్గిపోతాయన్నది మనకు అనుభవమైన విషయమే.