విద్యార్థినులపై కరస్పాండెంట్ అత్యాచారాలు! | student-alleges-rape-charges-on-college-correspondent | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 21 2014 9:47 AM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM

విద్యా బుద్దులు నేర్పి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీ కరస్పాడెంట్ వికృత చేష్టలకు పాల్పడ్డారని ఓ విద్యార్థి పోలీసులను ఆశ్రయించింది. తనపై లైంగికదాడి చేశారని ఆరోపిస్తూ ఆమె ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ ప్రతిభ కళాశాల డైరక్టర్‌ నల్లూరి వెంకటేశ్వర్లు తనతో పాటు తమ సీనియర్‌ విద్యార్థినులపైనా అత్యాచారం చేశాడని ఆమె ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజనిర్దారణ కొసం తాను ఏ పరీక్షలకైనా సిద్దమంటోంది. పోలీసులకు ఫిర్యాదు చేశాక తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బాధితురాలి కుటుంబీకులతో రాజీ కోసం బెదిరింపులు, ప్రలోభాలు ఎరవేసినట్లు తెలుస్తోంది. గతంలో కరస్పాండెంట్‌ వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని, కొన్ని హత్యలు కూడా జరిగాయని బాధితురాలు ఆరోపించటం ఒంగోలులో సంచలనం రేపుతోంది. బాధితురాలు పక్షాన పోరాటాలు చేసేందుకు విద్యార్ది సంఘాలు, మహిళా సంఘాలు సిద్ధమవుతున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement