బీసీ 'ఏ' కేటగిరిలోకి అనాథలు: టీ-సర్కార్ | telangana cabinet decide to orphons to bc.a category | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 19 2015 7:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

తెలంగాణ కేబినెట్ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, నష్టపరిహారంపై కేబినెట్లో చర్చించారు. వరంగల్ జిల్లా ములుగులో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా అనాథలను బీసీ 'ఏ' కేటగిరీలో చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పలు శాఖల్లో కొత్తగా పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పట్టణాభివృద్ధి అధ్యయనం కోసం అధికారుల బృందాన్ని చైనాకు పంపాలని.. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం అధికారుల బృందం చైనాలో పర్యటించనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement