తమ రాష్ట్రంలో పోలీసుల పనితీరు చాలా బాగుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు. ఢిల్లీ స్థాయిలో పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగిన పోలీసు కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. లంచం తీసుకోకుండా పోలీసులు సేవలు అందించాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఎంతో కీలకమైదని పేర్కొన్నారు.