law and order
-
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
మా మాటే పవన్ చెప్పారు: అంబటి రాంబాబు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కల్యాణ్, ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టగలిగారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వ్యాఖ్యలు, సరస్వతి పవర్ భూముల్లో పర్యటన పరిణామాలపై అంబటి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని పవన్ కల్యాణ్ అన్నారు. మేం మొదటి నుంచి అదే కదా చెబుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారు. పాలన చేతకాక పవన్ ఇలా తప్పించుకుంటున్నారు. ఐదు నెలల తర్వాత పోలీసులు విఫలమయ్యారంటే మీకు పాలన చేతకాదని అర్థం. అసలు అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నారు. పిఠాపురంలో కూటమి నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ ఏం చేశారు?. పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్ట్ చేశారు. పైగా ప్రశ్నిస్తే.. డైవర్షన్ పాలిటిక్సా? అని పవన్‌పై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ముందే అనిత హోం మంత్రి, వెనకాల నారా లోకేష్ అన్ని ట్రాన్స్ఫర్లు చేస్తారు అని ఎద్దేవా చేశారాయన. అలాగే.. గతంలో ఇదే పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. ‘‘ఏపీలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని వైఎస్సార్సీపీ హయాంలో పవన్ అన్నారు. మరి మిస్సైన వాళ్లలో ఒక్కరి జాడ అయినా కూటమి ప్రభుత్వం కనిపెట్టిందా?’’ అని అంబటి ప్రశ్నించారు. సరస్వతి పవర్ భూములు చట్టం ప్రకారం కొనుగోలు చేసినవి. అలాంటిది మీకు ఏ హక్కు ఉందని అక్కడికి వెళ్లారు. సరస్వతి భూముల వ్యవహారం ఇప్పుడు కొత్తదా? అని పవన్‌ను ప్రశ్నించారు అంబటి. ఇదీ చదవండి: నేరస్తులే అప్డేట్ అయ్యి తప్పించుకుంటున్నారు: హోం మంత్రి అనిత -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ DGP రియాక్షన్..
-
ఉన్మాదంతో దాడులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొందరు ఉన్మాదం, భావోద్వేగంతో మందిరాలు, మజీద్‌లపై దాడులు చేస్తూ.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి సంఘటన సహా ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరా లకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా సమాజానికి చెడు చేసేవారి విషయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఎంతో తెలివైనదని, మత విద్వేషాలను అరికట్టడంలో ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పారు. ‘పోలీస్ అమరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)’సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసు అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజల భద్రత కోసం ఉగ్రవాదులు, మావోయిస్టుల చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం, పోలీసుల ప్రతిష్ట పోతుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పనిచేయాలి. ఒకరి దగ్గర చేయిచాచే పరిస్థితి ఉండకూడదు. ఖద్దరు, ఖాకీలను సమాజం నిశితంగా గమనిస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునేలా నడుచుకోవాలి..’’ అని సీఎం రేవంత్ సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠినంగా ఉంటాం సరికొత్త పంథాలో జరుగుతున్న సైబర్ నేరాలు, యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని పోలీసులకు సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిబ్బందిని, కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు అమరులపై రాసిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లతో కలిసి సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని పలకరించారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ శిఖాగోయల్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరులకు భారీగా ఎక్స్‌గ్రేషియా.. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అమరులైన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.కోటి.. ఎస్సై, సీఐలకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.50 లక్షలు, ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ వరకు రూ.60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఇక తీవ్రంగా గాయపడిన వారిలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్పీ వరకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని.. ఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు తీవ్రంగా గాయపడితే రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఐపీఎస్ రాజీవ్‌రతన్ కుమారుడికి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా, కమాండెంట్ మురళి కుమారుడికి డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పోలీస్ అమరుడు ఆది ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గ్రేహౌండ్స్ జూనియర్ కమెండో ఆది ప్రవీణ్ కుటుంబాన్ని గోషామహల్ స్టేడియం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆది ప్రవీణ్ భార్య రాథోడ్ లత, కుమారులు ఆది హర్ష, ఆది వివాన్లకు పోలీసు స్మారక చిహ్నం జ్ఞాపికను అందించారు. ఆది ప్రవీణ్ భార్య లతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా పెంపుపై సీఎంకు ధన్యవాదాలు పోలీసు అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడం, పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఇన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు: ఆర్కే రోజా
సాక్షి,చిత్తూరుజిల్లా: ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబునాయుడు రియాల్టీ షోకు వెళ్లాడని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత రోజా విమర్శించారు. ఆదివారం(అక్టోబర్ 20) రోజా మీడియాతో మాట్లాడారు.‘ రాష్ట్రంలో బాలికలు, మహిళలపైన హత్యలు,అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాడోగాని ఆడపిల్లలను నరికి,తగలబెట్టి చంపుతున్నారు.చిన్నపిల్లలు, పెద్దవారు, అత్తా కోడళ్లు అని వావి వరుస లేకుండా మతిస్థిమితం లేని వారని కూడా చూడకుండా నేరస్తులు ఎలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరిగి ఉండవు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం. బాధిత కుటుంబానికి ఏ ఒక్క నాయకుడూ వచ్చి అండగా నిలబడడం లేదు. వీకెండ్ ఎప్పుడు వస్తుందా హైదరాబాద్‌కు ఎప్పుడు వెళదామా ఎంజాయ్ చేద్దామా అన్న ధోరణిలోనే నాయకులున్నారు’అని రోజా ఫైర్ అయ్యారు.ఇదీ చదవండి: కష్టాల్లో ఏపీ ప్రజలు.. వినోదాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు -
అంగళ్లు కేసు క్లోజ్
-
ప్రభుత్వాన్నిఇబ్బంది పెట్టే కుట్రలు
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్‌ని ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
హైదరాబాద్ లో రోజుకో హత్య.. అసలేం జరుగుతోంది ?
-
వెనక్కి తగ్గిన చంద్రబాబు
-
లా అండ్ ఆర్డర్ విఫలం..
-
విస్తృతంగా పోలీసుల తనిఖీలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు, దాడులు సంభవించే అవకాశాలున్నాయన్న సమచారంతో పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్– సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా నిర్వహిస్తోంది. పట్టణాలు, గ్రామాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు బలగాలు సోదాలు చేస్తున్నాయి.అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మద్యం మొదలైనవాటికి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాల్లేని వాహనాలను జప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 276 ప్రదేశాల్లో తనిఖీలు చేసి 24 కేసులు నమోదు చేశారు. 10మందిని అరెస్ట్ చేయడంతో పాటు 8 మందికి సీఆర్పీసీ 41ఏ నోటీసులిచ్చారు. 2 వేల లీటర్ల నాటుసారా, 27.50 లీటర్ల అక్రమ మద్యం, 6,910 లీటర్ల అక్రమ బీరుతో పాటు అక్రమంగా నిల్వ చేసిన 4 వేల లీటర్ల డీజిల్, 25 లీటర్ల పెట్రోల్‌ను జప్తు చేశారు. -
పోలీసులు మామూళ్లు అడగడం లేదు