సాక్షి,చిత్తూరుజిల్లా: ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబునాయుడు రియాల్టీ షోకు వెళ్లాడని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత రోజా విమర్శించారు. ఆదివారం(అక్టోబర్ 20) రోజా మీడియాతో మాట్లాడారు.‘ రాష్ట్రంలో బాలికలు, మహిళలపైన హత్యలు,అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాడోగాని ఆడపిల్లలను నరికి,తగలబెట్టి చంపుతున్నారు.
చిన్నపిల్లలు, పెద్దవారు, అత్తా కోడళ్లు అని వావి వరుస లేకుండా మతిస్థిమితం లేని వారని కూడా చూడకుండా నేరస్తులు ఎలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరిగి ఉండవు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం. బాధిత కుటుంబానికి ఏ ఒక్క నాయకుడూ వచ్చి అండగా నిలబడడం లేదు. వీకెండ్ ఎప్పుడు వస్తుందా హైదరాబాద్‌కు ఎప్పుడు వెళదామా ఎంజాయ్ చేద్దామా అన్న ధోరణిలోనే నాయకులున్నారు’అని రోజా ఫైర్ అయ్యారు.
ఇదీ చదవండి: కష్టాల్లో ఏపీ ప్రజలు.. వినోదాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment