గ్రూప్-2 పోస్టుల భర్తీపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. కొత్తగా అనుమతించిన 593 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలా.. లేక గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మొత్తం పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలా అన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది.