group-2 notification
-
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
-
వారంలోగా గ్రూప్–2 నోటిఫికేషన్!.. పోస్టులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హడావుడి మరింత జోరందుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తుండడంతో నియామక సంస్థలు సైతం ఆ మేరకు వేగాన్ని అందిపుచ్చుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. నియామకాల ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో కీలక ప్రకటన విడుదలకు సిద్ధమవుతోంది. గ్రూప్–2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి వారం రోజుల్లోనే ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. ఈ కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఉద్యోగాలు 582. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే వివిధ ఉద్యోగ కేటగిరీల మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్–2 కేటగిరీలో అదనపు కేడర్లు చేరాయి. దీంతో పోస్టుల సంఖ్య 700కు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుల స్థాయిలో మార్పులు చేయడం వల్లే గ్రూప్–2 ప్రకటన జారీలో కాస్త జాప్యం జరిగినట్లు కమిషన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పోస్టుల స్థాయి మార్పుతోనే ఆలస్యం ఎస్సీ అభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని సహాయ సెక్షన్ అధికారి పోస్టులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువైనల్ సరీ్వసు జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు గ్రూప్–2 కేటగిరీలోకి చేరాయి. ప్రస్తుతం ఈ కేటగిరీల్లోని పోస్టులు 120కి పైగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన పోస్టులకు స్థాయి మార్పుతో జత అయిన పోస్టులన్నీ కలిపి ఒకేసారి ప్రకటన జారీ చేసే క్రమంలో నోటిఫికేషన్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మే లోగా గ్రూప్–1 మెయిన్స్ గ్రూప్–1 ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ అతి త్వరలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల చివరి వారంలో పరీక్ష కీ విడుదల చేసిన కమిషన్.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు వేగవంతం చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన టీఎస్పీఎస్సీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. మల్టీజోన్లు, రిజర్వేషన్ కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియలొ కొంత జాప్యం జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి వారం లేదా పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కమిషన్ వర్గాలు యోచిస్తున్నాయి. -
ఆ అధికారులు విచారణకు రావాలి..
సాక్షి, న్యూఢిల్లీ: 1999 నాటి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా జరిగిన నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల అ మలు, ఇతర అంశాలపై 2015 ఫిబ్రవరి 2న తాము ఇచ్చిన తీర్పు అమలును విశదీకరించేందుకు ఈ అంశంతో సంబంధమున్న అధికారులను విచారణ కు పంపాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 1999 గ్రూప్–2 నోటిఫికేషన్ వివాదంపై దాఖలైన కోర్టు ధిక్కారణ (కంటెప్ట్) పిటిషన్లను మంగళవారం జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం విచా రించింది. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటి ఫికేషన్‌కు అనుగుణంగా తొలుత 113 మంది అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీ సర్లుగా నియమించారు. అయితే మరో 973 పోస్టులు ఖాళీ ఉన్నా.. ఏపీపీఎస్సీకి తెలియపరచలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 973 పోస్టులను కూడా తదుపరి మెరిట్ క్రమంలో భర్తీ చేశారు. అయితే 07.03.2002న ఇచ్చి న జీవో 124 ప్రకారం స్థానిక రిజర్వేషన్లను 1999 నోటిఫికేషన్‌లోని నియామక ప్రక్రియకు వర్తింపజే యడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. వీటిపై విచారణ అనంతరం 2015 ఫిబ్రవరి 2 న సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. 03.07.2002 న ఇచ్చిన జీవో 124ను 1999లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు వర్తింపజేయలేమంది. అంటే 973 పోస్టులను 124 జీవోకు లోబడి నియమించాలని హైకోర్టు ఇ చ్చిన ఆదేశాలు సరికావంది. 1999లో నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చే నాటికి అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటికే నియమితులైన 113 మంది, తర్వాత భర్తీ అయిన 973 మంది సీనియారిటీకి సంబంధించి నిబంధనలను అనుసరించి మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీ నిర్ణయించాలని ఆదేశించింది. కానీ ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ అభ్యర్థులు తిరిగి కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులను పంపండి: తాజాగా మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఎంతమంది ఈ నియామక ప్రక్రియలో నియమితులయ్యారన్నది తెలియాల్సి ఉం ది. అలాగే, సుప్రీంకోర్టు 2015 ఫిబ్రవరి 2న ఇచ్చిన తీర్పులోని పేరా 29లో, పేరా 31లో పొందుపరిచిన ఆదేశాలను ఏపీ, తెలంగాణ ఎలా అమలు పరిచా యన్నది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ అయిన జీవోను నోటిఫికేషన్‌కు వర్తిం పజేయలేమని సుప్రీంకోర్టు ఆదేశించినట్టయితే సెలె క్షన్ లిస్ట్ ఆ మేరకు తిరిగి రూపొందించాల్సి ఉం టుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సంబంధిత అంశాలపై అఫిడవిట్లు ఫైల్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సంబంధిత కా ర్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ఇన్చార్జి దీనిపై అవగాహన ఉండి, కోర్టుకు విశదీక రించే అధికారులను తదుపరి విచారణకు పంపాల ని ఆదేశిస్తున్నాం. తీర్పులోని పేరా 29, పేరా 31ల లో పొందుపరిచిన అంశాలపై తీసుకున్న చర్యలను విశదీకరిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. లేకుంటే సంబంధిత కార్యదర్శులు మార్చి 3న విచారణ సమయంలో కోర్టులో ఉండాలి. లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది..’అని ధర్మాసనం పేర్కొంది. -
గ్రూప్-2కు కొత్త నోటిఫికేషన్!
-
గ్రూప్-2కు కొత్త నోటిఫికేషన్!
► మొత్తం పోస్టులకు ఒకే నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ యోచన ► అనుబంధ నోటిఫికేషన్‌కు గరిష్ట వయోపరిమితి చిక్కులు ► ఆచితూచి నిర్ణయం తీసుకోనున్న అధికారులు ► సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం హైదరాబాద్: గ్రూప్-2 పోస్టుల భర్తీపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. కొత్తగా అనుమతించిన 593 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలా.. లేక గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మొత్తం పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలా అన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే గరిష్ట వయో పరిమితి అంశంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వయో పరిమితి చిక్కులు: ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని ప్రభుత్వం పదేళ్లపాటు సడలించిన విషయం తెలిసిందే. డెరైక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన నియామకం చేపట్టే ఉద్యోగాలకు ప్రస్తుతమున్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచారు. దాంతో గతేడాది గ్రూప్-2 నోటిఫికేషన్ సమయానికి గరిష్ట వయసున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు తక్కువగా ఉన్నాయని మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు. అయితే తాజాగా ప్రకటించిన 593 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే ఈ గరిష్ట వయో పరిమితితో చిక్కులు తలెత్తనున్నాయి. ఎందుకంటే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే.. అది జారీ చేసే తేదీ నాటికి గరిష్ట వయో పరిమితిని లెక్కిస్తారు. అంటే వివిధ కారణాల వల్ల గతేడాది ప్రధాన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన 44 ఏళ్ల వయసున్న అభ్యర్థులు.. ఇప్పుడు వారి వయసు 45కు చేరడంతో అనుబంధ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోలేరు. మరోవైపు తొలి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న 44 ఏళ్ల వారికి ఇప్పుడు 45 ఏళ్లు వచ్చినా.. అప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు అవకాశం అందని గరిష్ట వయసున్న అభ్యర్థులు దీనిపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇది మరిన్ని సమస్యలకు కారణమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల గత నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసి.. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తే చిక్కులుండవని భావిస్తున్నాయి. మరో ఏడాది సడలింపు! వయో పరిమితిపై వివాదాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా సడలింపును 11 ఏళ్లకు పెంచాలనే వాదనలున్నాయి. దాంతో తొలి నోటిఫికేషన్‌కు అర్హులైన వారందరూ అనుబంధ నోటిఫికేషన్‌కు అర్హులవుతారనే అభిప్రాయం వస్తోంది. మొత్తంగా గ్రూప్-2 కొత్త పోస్టులకు టీఎస్పీఎస్సీ ఎలాంటి పద్ధతిని అనుసరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. దీంతో కొత్త నోటిఫికేషన్ సెప్టెంబర్‌లో వెలువడే అవకాశమున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ విభాగాల నుంచి ఇంకా పూర్తిగా వివరాలు అందలేదని, అందువల్ల ఆలస్యమవుతుందని సూచనప్రాయంగా వెల్లడించాయి. -
వచ్చే నెలలో గ్రూపు-2 అనుబంధ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెలలో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం గతంలో 439 పోస్టుల భర్తీకి ఓకే చెప్పగా.. ఇటీవల మరో 593 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో 439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసినా.. పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా మళ్లీ 593 పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య 1,032కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టులను గతంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ పరిధిలోకి తెస్తూ టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. గతంలో గ్రూప్-2 రాసేందుకు 5.64 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం కల్పిస్తూ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ఆలోచనలు చేస్తోంది. అయితే అంతకన్నా ముందు తాజాగా ప్రభుత్వం ఆమోదిం చిన పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి ఇండెంట్లు, రిజర్వేషన్, రోస్టర్ వివరాలు రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై ఆయా శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలి సింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే నెలలో వీలైతే మొదటి వారం లేదా రెండో వారం నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించే అవకాశాలను టీఎస్పీఎస్సీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
1999 గ్రూప్-2 భర్తీలకు మరోసారి మెరిట్ జాబితా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 16 ఏళ్ల క్రితం ముగిసిన గ్రూప్-2 నియామకాలపై మరోసారి మెరిట్ జాబితా రూపొందిస్తోంది. 1999 గ్రూప్-2 నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కొత్త జాబితా తయారీలో తలమునకలైంది. త్వరలోనే ఈ జాబితాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అందిస్తామని, తదుపరి చర్యలు వారు తీసుకోవలసి ఉంటుందని కమిషన్ వర్గాలు వివరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో దాదాపు 250 పోస్టులకు సంబంధించి అప్పటి ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసి నియామకాలు కూడా చేసింది. అయితే ఆ తరువాత అదే నోటిఫికేషన్లో మరో 973 పోస్టులను చేర్చి మెరిట్ జాబితాలోని అభ్యర్థులతో భర్తీచేసింది. మరోసారి 111 పోస్టులను మళ్లీ అదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. అయితే ఈ నియామకాల్లో మొదట పోస్టింగ్‌లు పొందిన అభ్యర్థుల్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. తాము మెరిట్లో ఉన్నా తమకు సరైన పోస్టులు రాలేదని, తరువాత చేపట్టిన నియామకాల్లో తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి మంచి పోస్టులు వచ్చాయని వాదించారు. దీంతో మూడు విడతల పోస్టులను కలిపి కామన్ మెరిట్ జాబితా రూపొందించి నియామకాల్లో జరిగిన తప్పులను సరిదిద్దాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేయడంతో మళ్లీ జాబితా రూపొందిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంతకాలం తర్వాత ఇప్పుడు కొత్తగా మెరిట్ జాబితా రూపొందించి మళ్లీ నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అప్పట్లో పోస్టింగ్‌లు పొందిన వారు ఇప్పుడు పదోన్నతులపై వేర్వేరు కేడర్లలో ఉంటారు. వారిని ఇపుడు మార్పుచేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న అధికారులు 1999 నాటి నోటిఫికేషన్ ప్రకారం అప్పుడున్న పోస్టుల్లోకి వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడరని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండుగా ఏపీ హౌజ్ ఫెడ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకార గృహ నిర్మాణ సంఘాల సమాఖ్య(ఏపీ హౌజ్ ఫెడ్)ను రెండుగా విభజించినట్టు హౌజ్ ఫెడ్ చైర్మన్ గోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారమిక్కడ హౌజ్ ఫెడ్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఏపీ హౌజ్ ఫెడ్, తెలంగాణ హౌజ్ ఫెడ్లుగా విభజించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ హౌజ్ ఫెడ్‌కు సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపకంతో పాటు సంస్థకు చెందిన భవనంలోని మొదటి, రెండో అంతస్తులు ఏపీ హౌజ్ ఫెడ్‌కు, మూడు, నాలుగో అంతస్తులు తెలంగాణ హౌజ్ ఫెడ్‌కు కేటాయించినట్టు చెప్పారు. జూన్ 2 నుంచి ప్రభుత్వ అనుమతితో ఈ రెండు ఫెడరేషన్లు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు. తెలంగాణ హౌజ్ ఫెడ్ చైర్మన్‌గా కె.నవనీతరావు, వైస్ చైర్మన్‌గా వసంతరావు దేశ్‌పాండేలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌజ్ ఫెడ్ ఎండీ జి.గోపాల్‌నాయక్, ఏపీ హౌజ్ ఫెడ్ వైస్ చైర్మన్ రామ్మోహన్రావు, హౌజ్ ఫెడ్ జీఎం వసంతరావు, డెరైక్టర్ ఎ. కిషన్‌రావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.