సాక్షి, న్యూఢిల్లీ: 1999 నాటి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా జరిగిన నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల అ మలు, ఇతర అంశాలపై 2015 ఫిబ్రవరి 2న తాము ఇచ్చిన తీర్పు అమలును విశదీకరించేందుకు ఈ అంశంతో సంబంధమున్న అధికారులను విచారణ కు పంపాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 1999 గ్రూప్–2 నోటిఫికేషన్ వివాదంపై దాఖలైన కోర్టు ధిక్కారణ (కంటెప్ట్) పిటిషన్లను మంగళవారం జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం విచా రించింది. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటి ఫికేషన్‌కు అనుగుణంగా తొలుత 113 మంది అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీ సర్లుగా నియమించారు. అయితే మరో 973 పోస్టులు ఖాళీ ఉన్నా.. ఏపీపీఎస్సీకి తెలియపరచలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు 973 పోస్టులను కూడా తదుపరి మెరిట్ క్రమంలో భర్తీ చేశారు. అయితే 07.03.2002న ఇచ్చి న జీవో 124 ప్రకారం స్థానిక రిజర్వేషన్లను 1999 నోటిఫికేషన్‌లోని నియామక ప్రక్రియకు వర్తింపజే యడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. వీటిపై విచారణ అనంతరం 2015 ఫిబ్రవరి 2 న సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. 03.07.2002 న ఇచ్చిన జీవో 124ను 1999లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు వర్తింపజేయలేమంది. అంటే 973 పోస్టులను 124 జీవోకు లోబడి నియమించాలని హైకోర్టు ఇ చ్చిన ఆదేశాలు సరికావంది. 1999లో నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చే నాటికి అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటికే నియమితులైన 113 మంది, తర్వాత భర్తీ అయిన 973 మంది సీనియారిటీకి సంబంధించి నిబంధనలను అనుసరించి మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీ నిర్ణయించాలని ఆదేశించింది. కానీ ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ అభ్యర్థులు తిరిగి కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు.
అధికారులను పంపండి: తాజాగా మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఎంతమంది ఈ నియామక ప్రక్రియలో నియమితులయ్యారన్నది తెలియాల్సి ఉం ది. అలాగే, సుప్రీంకోర్టు 2015 ఫిబ్రవరి 2న ఇచ్చిన తీర్పులోని పేరా 29లో, పేరా 31లో పొందుపరిచిన ఆదేశాలను ఏపీ, తెలంగాణ ఎలా అమలు పరిచా యన్నది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ అయిన జీవోను నోటిఫికేషన్‌కు వర్తిం పజేయలేమని సుప్రీంకోర్టు ఆదేశించినట్టయితే సెలె క్షన్ లిస్ట్ ఆ మేరకు తిరిగి రూపొందించాల్సి ఉం టుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సంబంధిత అంశాలపై అఫిడవిట్లు ఫైల్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సంబంధిత కా ర్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ఇన్‌చార్జి దీనిపై అవగాహన ఉండి, కోర్టుకు విశదీక రించే అధికారులను తదుపరి విచారణకు పంపాల ని ఆదేశిస్తున్నాం. తీర్పులోని పేరా 29, పేరా 31ల లో పొందుపరిచిన అంశాలపై తీసుకున్న చర్యలను విశదీకరిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. లేకుంటే సంబంధిత కార్యదర్శులు మార్చి 3న విచారణ సమయంలో కోర్టులో ఉండాలి. లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది..’అని ధర్మాసనం పేర్కొంది.
ఆ అధికారులు విచారణకు రావాలి..
Published Thu, Feb 27 2020 2:49 AM | Last Updated on Thu, Feb 27 2020 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment