మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాకిచ్చిన యూకే! | UK visa rules tightened, a shock to indian it professionals | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 4 2016 4:49 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణుల వీసా విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. దాంతో ముఖ్యంగా భారతదేశం నుంచి అక్కడకు వెళ్లే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై పెను ప్రభావం పడబోతోంది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ (ఐసీటీ) విభాగంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లకు వేతనం దాదాపు రూ. 25 లక్షలు ఉండాలని చెప్పింది. ఇది ఇంతకుముందు రూ. 17.30 లక్షలుగా ఉండేది. ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్.. అంటే కంపెనీ తరఫున విదేశాల్లో పనిచేయడానికి వెళ్లేవారు. మూడు రోజుల పర్యటన కోసం బ్రిటిష్ ప్రధాని థెరెసా మే భారతదేశానికి రావడానికి సరిగ్గా మూడు రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమిస్తుందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement