టోల్ ప్లాజాపై దాడి చేసిన దుండగులు | Unknown persons attacked on toll plaza | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 17 2013 7:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

నగరానికి సమీపంలో ఉన్న గుర్గావ్ టోల్ ప్లాజాపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసి నగదును దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో టోల్ ప్లాజా పై అకస్మికంగా దాడి చేసిన దుండగులు కౌంటర్ లో ఉన్న నగదును అడ్డంగా దోచుకున్నారు. టోల్ ప్లాజాపై విరుచుకుపడిన వీరు దొరికినంత సొమ్మును అపహరించుకుపోయారు. ఈ దోపిడిలో ఎక్కువగా 18 నుంచి 20 ఏళ్ల మధ్య యువకులే పాల్గొన్నట్లు సమాచారం. టోల్ ప్లాజాలో డబ్బుతో పాటు విలువైన వస్తువులను కూడా పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన వ్యక్తులు టోల్ ప్లాజాలో పని చేస్తున్న వారిపై దాడికి ఎగబడ్డారు. ఈ ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమారాల్లో రికార్డు అయ్యింది. దీనిపై పోలీసులకు సమాచరం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 1లక్ష 85 వేల రూపాయలను దోచుకెళ్లారని టోల్ ప్లాజా ఉద్యోగస్తులు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement