‘క్రికెట్‌ ఆపెయ్యండి .. కావాలంటే  పాకిస్తాన్‌ వెళ్లిపోండి’ | Muslim Family Attacked By Gang At Gurugram | Sakshi
Sakshi News home page

‘క్రికెట్‌ ఆపెయ్యండి .. కావాలంటే  పాకిస్తాన్‌ వెళ్లిపోండి’

Published Sat, Mar 23 2019 11:49 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

దేశ రాజధాని సమీపంలో ఓ ముస్లిం కుంటుంబంపై మూకదాడి జరిగింది. గురుగ్రామ్‌లోని ధమ్సాపూర్‌ గ్రామంలో నివసిస్తున్న మహ్మద్‌ సాజిద్‌ నివాసంలోకి చొరబడిన సుమారు 20 మంది యువకులు శుక్రవారం మూకదాడికి పాల్పడ్డారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ సాజిద్‌ గత మూడేళ్లుగా ధమ్సాపూర్లో భార్య సమీనా, ఆరుగురు పిల్లలతో కలిసి నివసముంటున్నాడు. సాజిద్‌ ఇంటికి వచ్చిన బంధువులు.. ఫ్లాట్‌ ఆవరణలో క్రికెట్‌ ఆడుతున్నారు. అదే సమయంలో అక్కడికి బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు వారిపట్ల అమానుషంగా వ్యవహరించారు. ‘మీరు పాకిస్థాన్‌ వెళ్లి ఆడుకోండి. ఇక్కడ ఆటలాడొద్దు’ అని బెదించారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసి చితకబాదారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement