వణుకు పుట్టిస్తున్న ’వర్దా’ తుపాను | vardah toofan in south kosthandra and tamilnadu border | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 12 2016 6:43 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

’వర్దా’ అతి తీవ్ర తుపాను వణుకు పుట్టిస్తోంది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, అటు ఉత్తర తమిళనాడులే లక్ష్యంగా పయనిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వర్దా ప్రతాపం మొదలయింది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తీరం వైపునకు చొచ్చుకు వస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి ఇది తూర్పు ఈశాన్య దిశగా చెన్నైకి 300, నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేపీ తుపానుగా బలహీనపడుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల తీరాల మధ్య చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నానికి తీరాన్ని దాటనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement