30న ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పరామర్శ యాత్ర | ys jaganmohan reddy will meet tobacco formers in prakasam | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 28 2015 4:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

పొగాకు రైతుల వరుస ఆత్మహత్య ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏనాడు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అశోక్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 30న ప్రకాశం జిల్లాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతులను పరామర్శించనున్నట్లు తెలిపారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అశోక్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement