హోరాహోరీ పోరాటాలు... ఉత్కంఠభరిత మ్యాచ్‌లు... బౌండరీల హోరు, సిక్సర్ల జోరు... కళ్లుచెదిరే క్యాచ్‌లు... 47 రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన టి20 వినోదానికి నేటితో తెరపడనుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధమైంది. లీగ్ చరిత్రలోనే రెండు హై ప్రొఫైల్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఎనిమిదో సీజన్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.