Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Govt Neglected Fee reimbursement for students1
చదువు‘కొనలేం’

ఫీజు రీయింబర్స్‌మెంట్‌...! ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన గొప్ప పథకం..! మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా కాలేజీకి వెళ్లి ఏకాగ్రతతో పాఠాలు విని తమ లక్ష్యాలను సాధించిన విద్యార్థులు ఎందరో..? అయితే, కూటమి ప్రభుత్వంలో అలాంటి గొప్ప పథకానికి తూట్లు పడుతున్నాయి. మొండి బకాయిలతో.. యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతోంది. ఒకటీ, అర కాదు.. ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కనపెట్టింది.. చివరకు విద్యార్థులు విసుగెత్తి చదువు మానేసేలా చేస్తోంది..సాక్షి, అమరావతి: ఏడాదికి పైగా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం.. అంటూ ఊరించి ఉసూరుమనిపించడం తప్ప కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు..! కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల విడుదల ఊసే లేదు..! ప్రభుత్వం కనీస కనికరం చూప­కుండా.. తమ జీవితాలతో చెలగాటం ఆడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నత విద్యకు భరోసా దక్కక దిగులు చెందుతు­న్నారు. దీంతో అర్థంతరంగా చదువులు మానేస్తున్నారు. ఇదంతాచూసి విద్యార్థుల తల్లిదండ్రులు కూట­మి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదేనా? ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి..?? అని నిలదీస్తున్నారు. ⇒ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ కారణంగా అగిపోయింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క త్రైమాసికం (క్వార్టర్‌) కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4,200 కోట్లు, విద్యార్థులకు హాస్టల్‌ మెయింటినెన్స్‌ (వసతి దీవెన) కింద మరో రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. వాస్తవానికి గత నెలలోనే ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల అసోసియేషన్‌ సమావేశంలో, ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ స్పందన కొరవడింది. ⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చదువులతో పాటు హాస్టల్‌ వసతి దీవెన (మెయింటెనెన్స్‌) కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి రూ.1100 కోట్లు అందించింది. కూటమి ప్రభుత్వం వసతి దీవెన ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు బకాయి పెట్టింది. నెలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లు ఖర్చు రాష్ట్రంలో 230 వరకు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం కన్వీనర్‌ కోటా కింద మొత్తం సీట్లలో 70 శాతం భర్తీ చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. అంటే, కళాశాలల నిర్వహణ దాదాపు ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. కానీ, ఏడాదికి పైగా ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయకుండా కూటమి సర్కారు తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఒక్కో కళాశాలకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చిన్న కళాశాలలకు రూ.6–10 కోట్లు, పెద్ద కళాశాలలకు రూ.40–60 కోట్ల వరకు పెండింగ్‌ కనిపిస్తున్నాయి. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ⇒ ప్రైవేటు యాజమాన్యాల్లోని 20–30 శాతం కళాశాలలు మినహా.. మిగిలినవి ఏ పూటకు ఆ పూటే అన్న చందాన నిధుల కొరత ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం చిన్న కళాశాలలు రూ.50 లక్షలు నుంచి పెద్ద కళాశాలలు రూ.3 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతోపాటు కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చూస్తే యాజమాన్యాల గుండె బరువెక్కుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి నడిపించాల్సి వస్తుండడం ఆర్థికంగా భారం అవుతోంది. సర్కారు నుంచి మొండిచేయి ఎదురవుతుండడంతో నిర్వహణ కుంటుపడుతోంది. బాబ్బాబు కాస్త సర్దుకోరూ...! ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్‌మెంట్‌ను బకాయి పెట్టడంతో ప్రైవేటు కళాశాలలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో 2–3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కాలేజీలైతే నెల జీతంలో కొంత మొత్తం చెల్లిస్తూ సర్దుకోండి అంటూ ఉద్యోగులను బతిమలాడుకునే పరిస్థితి. ఆర్థికంగా పరపతి ఉన్న కళాశాలలు అప్పు తెచ్చి ఉద్యోగులకు జీతాలిస్తున్నాయి. ⇒ కాలేజీలు ఇలా అప్పుల్లో నెట్టుకొస్తున్న తరుణంలో మారుతున్న సాంకేతిక అవసరాలను ఎంతవరకు అందిపుచ్చుకుంటాయన్నది ప్రశ్న. మార్కెట్‌కు అనుగుణంగా బోధన అందించకుంటే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తద్వారా ఒక తరం వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాటంటే.. జరగదంట? పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పూటకో మాట చెప్పుకొచ్చారు. పైసా ఖర్చు లేకపోవడంతో తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ప్రజలు, కళాశాలల యాజమాన్యాలను మభ్యపెడుతూ వచ్చారు. ఈ తంతు నిరుడు జూన్‌ నుంచి మొదలైంది. ఈ ఏడాది జూన్‌ వెళ్లిపోయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు. ⇒ గత నెలలో మంత్రిని కలిసిన కళాశాలల యాజమన్యాలకు జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత జూలై 10న ఇస్తామన్నారు. ఇప్పుడు 20వ తేదీ దాటినా ఎక్కడా రూపాయి విడుదల కాలేదు. ఇదేంటని అడిగితే మరో నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని మళ్లీ చెబుతున్నారని ఇంజినీరింగ్‌ కళాశాలల అసోసియేషన్‌ వాపోతోంది. ఇక్కడ మంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగకపోవడం గమనార్హం. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఓ పెద్ద ప్రహసనంగా మారింది. ఇదీ మా గోడు... ‘‘ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలువిడుదల కావట్లేదు. కళాశాలల నిర్వహణ ముందుకు జరగట్లేదు. ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా? నాణ్యమైన బోధనా సామర్థ్యాలను సమకూర్చుకుని విద్యార్థులకు మెరుగైన చదువు అందించగలం. డబ్బులు లేకుండా ఇవన్నీ ఎక్కడినుంచి తెస్తాం...? ఇంజనీరింగ్‌ కాలేజీ అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వట్లేదు. ఆస్తులు అమ్ముదామంటే మార్కెట్‌లో రేట్లు లేవు. తాకట్టు పెట్టి తెద్దామంటే రూ.2–5 వరకు వడ్డీలు అవుతున్నాయి. ఇంకేం చేయాలి...?’’ అని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళా­శాల యజమాని వాపోయారు. ఇక్కడ ఒక్క ఇంజినీరింగ్‌ కళాశాలలే కాదు, అదే యాజమాన్యాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. తమ పరిస్థితి ఇలా ఉండగా... ప్రభు­త్వం ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తకపోతుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తు కార్యా­చరణ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమా­చారం. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే అను­భవం ఎదురవగా అక్కడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ స్ఫూర్తితో ఏపీలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యా­య పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు చెల్లింపులుఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ⇒ 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 వరకు నాటి టీడీపీ సర్కారు 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిపెడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు ప్రతి త్రైమాసికానికి క్రమంతప్పకుండా చెల్లించి... ఏ లోటు లేకుండా కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా ప్రోత్సహించింది. ⇒ ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. ఇలా మొత్తం ఐదేళ్లలో ప్రభుత్వం ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది.

Rahul Gandhi says BC reservation is Central Govt Responsibility2
కేంద్రానిదే బాధ్యత: రాహుల్‌గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్‌రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్‌ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్‌ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్‌ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్‌ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్‌ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్‌ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్‌ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్‌ నిలదీశారు. రేవంత్‌రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్‌రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్‌రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్‌ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్‌ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర, సంవిధాన్‌ బచావ్‌ ర్యాలీల్లో రాహుల్‌గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్‌.. జై సంవిధాన్‌’ అనే రాహుల్‌ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్‌రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్‌కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్‌రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్‌ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్‌ గాందీని అభినందిస్తున్నా. రాహుల్‌ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 25-07-2025 In Telugu3
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం; తిథి: శు.పాడ్యమి రా.11.55 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: పుష్యమి సా.5.24 వరకు, తదుపరి ఆశ్లేష; వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు; అమృత ఘడియలు: ప.11.20 నుండి 12.38 వరకు.సూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.32రాహుకాలం : ఉ.10.30నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం.... కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.కర్కాటకం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.కన్య.... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల.... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృశ్చికం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.ధనుస్సు.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.మకరం..... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.కుంభం... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.మీనం.... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Both Houses adjourned till Friday amid Opposition protest4
పార్లమెంట్‌లో రచ్చ రచ్చ 

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం ఎలాంటి కార్యకలాపాలు చోటుచేసుకోలేదు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించాలని తేలి్చచెప్పాయి. నిరసనలు, నినాదాలు యథావిధిగా కొనసాగించాయి. ఉభయ సభలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు సహకరించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ బిర్లా కోరినా వారు వినిపించుకోలేదు. సభకు అంతరాయం సరైన పద్ధతి కాదని స్పీకర్‌ హితవు పలికారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్‌ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్‌æ విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ఎస్టీలకు సంబంధించిన బిల్లుపై చర్చకు అడ్డుపడడం పట్ల విపక్షాలపై న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో సభాపతి లోక్‌సభను శుక్రవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ గందరగోళం బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు అలజడి సృష్టించడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత క్యారేజీ ఆఫ్‌ గూడ్స్‌ బై సీ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై ఏఐఏడీఎంకే నేత తంబిదురై మాట్లాడారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. తంబిదురై తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. విపక్ష ఎంపీలు తమ నినాదాలు ఆపలేదు. సభలో వారి ప్రవర్తన పట్ల బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్‌ కలితాను కోరారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ విన్నవించారు. అందుకు సభాపతి అంగీకరింకపోవడంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దాంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ప్రాంగణంలో నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఓటు బందీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియా గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విపక్షాలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో లోక్‌తంత్ర బదులు లోక్‌తంతర్‌ అని రాసి ఉండడంతో బీజేపీ‡ నేత మాలవీయా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ఏది ఎలా రాయాలో తెలియనివారు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

India and the UK signed a free trade agreement5
ఇక స్వేచ్ఛా వాణిజ్యం 

లండన్‌: భారత్, బ్రిటన్‌ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్‌లో యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్‌ 2035’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్‌పై మోదీ, కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, బ్రిటిష్‌ వాణిజ్య మంత్రి జోనాథన్‌ రేనాల్డ్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్‌టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్‌ స్టార్మర్‌ స్పందిస్తూ.. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్‌ స్టార్మర్‌తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్‌కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్‌ మార్కెట్‌లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్‌ వస్తువులకు యూకే మార్కెట్‌లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్‌–2030’ రోడ్‌మ్యాప్‌పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్‌ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్‌ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్‌ కంట్రిబ్యూషన్స్‌ కన్వెన్షన్‌(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్‌తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్‌–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్‌ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్‌ అండ్‌ మిస్‌ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్‌ బ్యాట్‌తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్‌తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్‌ ‘బకింగ్‌హమ్‌ స్ట్రీట్‌ క్రికెట్‌ క్లబ్‌’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్‌ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్‌ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్‌ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్‌లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్‌ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్‌ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్‌ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్‌ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్‌లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్‌ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్‌ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్‌ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్‌టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్‌ను ఎఫ్‌టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్‌ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్‌టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్‌ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్‌ స్పీచ్‌ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్‌ చిరునవ్వు చిందించారు.

TDP Activists Hulchul With Robbery in Machilipatnam6
కూటమి నేతల ప్లాన్‌.. మైనర్లతో దొంగల ముఠా తయారీ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్‌ఫోన్‌లో సిమ్‌ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్‌మిట్టల్‌ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్‌’ ప్లాన్‌ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. పట్టించిన సిమ్‌ ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్‌లో సిమ్‌ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్‌పై మోజుతో ఓ మైనర్‌ కొత్త సిమ్‌ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ట్రేస్‌ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. మంత్రి ఫోన్‌తో 41ఏ నోటీసులతో సరి..!విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్‌ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్‌ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Sakshi Guest Column On Nimisha Priya Issue7
అమానుషంపై స్పందించి తీరుదాం!

నాకెందుకో నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరచకపోవచ్చు అనిపిస్తోంది. ఇరాన్‌ అండదండలున్న హూతి దళాల పాలనలో ఉన్న యెమెన్‌లోని భాగంలో షరియా చట్టం అమలులో ఉంది. కేరళకు చెందిన 38 ఏళ్ళ నర్సు నిమిష ప్రియ ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిందంటూ అక్కడి చట్టం ఆమెకు మరణ దండనను విధించింది. హూతీల రాజకీయ, న్యాయ పాలనా సౌధంలో ప్రతి ఒక్కరు ఆ శిక్షను ధ్రువపరచేశారు. పాలక్కాడ్‌లో జన్మించిన ఆ క్రైస్తవ మతస్థురాలు అరెస్టు అయి, శిక్షపడినప్పటి నుంచి ఇప్పటికి అనేక నెలలుగా ఫైరింగ్‌ స్క్వాడ్‌ ను ఎదుర్కోవలసిన స్థితిలో ఉంది. మరణ దండనను అమలుపరచేందుకు యెమెన్‌లో కాల్పులు జరిపి చంపే విధానం అమలులో ఉంది. నాలుగు ఆశలువర్తమాన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారతదేశానికున్న ప్రాధాన్యం వల్లనైతేనేమి లేదా నిమిష కేసు దాదాపుగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్లనైతేనేమి లేదా మరణ దండనకు వ్యతిరేకంగా ఇరాన్, సౌదీ అరేబియాలు యెమెన్‌కు నచ్చజెప్పడం వల్లనైతేనేమి ఆ దేశం బుల్లెట్లకు ఇంకా పనిచెప్పలేదు. నిమిషను కాపాడేందుకు ‘సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌’ పేరుతో కొందరు ఒక సంఘంగా ఏర్పడ్డారు. నిమిష లీగల్‌ డిఫెన్స్‌ను సమన్వయపరచుకుంటూ ఆ కౌన్సిల్‌ పనిచేస్తోంది. కేరళలోని ఇస్లామిక్‌ మత పెద్దలు, ప్రసిద్ధ స్కాలర్లు బహిరంగంగా, తెర వెనుక మార్గాల ద్వారా శిక్షను ఆపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు వృథా పోవని అనిపిస్తోంది. మరణ దండనకు గురిచేయకుండా ఆమెను విడిచిపెట్టవచ్చుననడానికి నాకు మరో నాలుగు కారణాలు తోస్తున్నాయి. ఒకటి– షరియా అమలులో ఉండటం నిజం. హతుని కుటుంబ ఆగ్రహం కూడా అర్థం చేసుకోదగిందే. నమ్మశక్యం కాకపోయినా, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని ప్రపంచం అసహ్యించుకుంటుందని సానా(యెమెన్‌ రాజధాని) లోని అధికార వర్గాలకు తెలియదనుకోలేం. రెండు– యెమెన్‌లోని ఆ భాగంలో ఉన్న అధికారులు మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు జవాబుదారులు ఏమీ కారు. గతంలో మరణ దండనలను గణనీయంగానే అమలు జరిపి ఉండవచ్చు. అంతమాత్రాన, ప్రపంచ మనోభిప్రాయాన్ని లెక్క చేయనివారుగా బాహాటంగా కనిపించకూడదని వారు అనుకుంటూ ఉండవచ్చు. మూడు– జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వంటి సమర్థులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నారు. పరాయి దేశంలో బందీగా ఉన్న ఒక భారతీయ మహిళను కాపాడలేకపోయినదిగా కనిపించడం భారత ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. నిమిష ప్రాణాలను కాపాడేందుకు హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రయత్నించాలో అంతా న్యూఢిల్లీ చేస్తుంది. నాలుగు– హతుని కుటుంబం దోషిని క్షమించినందుకు పరిహారంగా ఇచ్చే నగదు(బ్లడ్‌ మనీ) మొత్తంపైనే ఇపుడు సంప్రదింపులు సాగుతున్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రభుత్వం పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రపంచంలోనే నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ నగదు కొరతతో బాధపడుతున్నదిగా ముద్రపడలేదు.ఒకవేళ ఆశలు అడియాసలైతే...పైన పేర్కొన్న కారణాలన్నింటివల్ల నిమిష ప్రియను కాపాడారు అనుకుందాం. అదృష్టం బాగుండి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది అనుకుందాం. ఆమెకు ఘన స్వాగతం లభిస్తుంది. ఆమె ప్రాణాలను కాపాడిన ఘనత తమదేనని చెప్పుకునేవారూ చాలా మంది ఉంటారు. కానీ, నా ఈ అంచనాలన్నీ ఘోరంగా తలకిందులు కావచ్చు. సానాలోని పాలకులు నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరిస్తే, నేను పైన చెప్పిన విషయాలన్నీ బుద్ధి హీనమైనవిగా తేలతాయి. నిజంగానే, ఘోరం జరిగితే, భారత్‌ ఏం చేయవలసి ఉంటుంది? భారత్‌ తన అసంతృప్తిని సానాకు తెలిపి తీరాలి. ‘‘ఇది టెర్రరిజం కేసు కాదు కదా. ఆ పని భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. ఆ చర్య భారత రాజ్య వ్యవస్థకు లేదా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు’’ అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే, సానాలోని రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైనదని ప్రపంచం గుర్తించలేదు. అటువంటి వ్యవస్థ తమ దేశంలో ఉంటున్న ఒక భారతీయురాలి జీవితాన్ని అంతమొందిస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? అందులోనూ ఆమె సేవా భావంతో నిండి ఉండే నర్సింగ్‌ వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆమెకు అలాంటి గతి పట్టవచ్చా? అనేక దేశాలలో వివిధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న భారతీయులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిలో నర్సులు గణనీయమైన వర్గం కిందకు వస్తారు. ఆ యా దేశాలు అన్నింటి దృష్టిలో మనం చులకన అయిపోమా? నిమిష చేసిన నేరం తక్కువదేమీ కాదు. దాన్ని గర్హించకుండా ఉండటమో లేదా ఉపేక్షించడమో చేయలేం. దాన్నలా ఉంచినా, హతుని దేహాన్ని ఆమె ముక్కలు చేసిన తీరు ఇంకా ఘోరం. కానీ, ఆమె హంతకురాలిగా మారడానికి పురికొల్పిన అంశాలను కూడా విస్మరించలేం. అటువంటి నేరమే భారతదేశంలో జరిగి ఉంటే, దిగువ కోర్టు ఉరి శిక్ష విధించినా సంబంధిత హైకోర్టు లేదా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదు శిక్షగా తగ్గించే అవకాశాలు ఎక్కువ. కోర్టులన్నీ మరణ దండనను సమర్థించినా, క్యాబినెట్‌ సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించి శిక్షను తగ్గించే అవకాశమూ ఉంది. అసంతృప్తిని చాటి తీరాలి!సరే. అది ఇపుడు అప్రస్తుతం. దేశపు చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందని కొన్ని శక్తుల నియంత్రణలో ఉన్న యెమెన్‌లోని ఒక భూభాగంలో ఫైరింగ్‌ స్క్వాడ్‌ నిమిషను కాల్చి చంపితే, ఇండియా ఎలా స్పందించాలి? ఆపరేషన్‌ రాహత్‌ కింద, ఆ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యెమెన్‌లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొద్ది వేల మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. వారినందరినీ ఏకమొత్తంగా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని భారత్‌ పరిశీలించవలసి ఉంటుందా? వారిలో కొంత మందికి స్వదేశానికి రావడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఆ పని చేయాలా? దానివల్ల యెమెన్‌కు వాటిల్లే నష్టం ఏమైనా ఉంటుందా? అక్కడున్న భారతీయుల భద్రత పట్ల భారత్‌కు నమ్మకం కలగడం లేదనే అంశాన్ని మనం వెల్లడించి తీరాలి. యెమెన్‌లోని ఆ ప్రాంతంతో వాణిజ్యాన్ని (అది లెక్కలోకి వచ్చేది కాకపోయినా) మనం తీవ్రంగా పరిమితం చేయాలి. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాన్ని మనం ఈ విషయంలో అనుసరించినా తప్పు లేదు. కానీ, నేను మొదట ధైర్యంగా అనుకుంటున్నదే నిజమవ్వాలని ఆశిద్దాం. ఇలాంటి స్పందనలకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదనే ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా భారత్‌ చేసి తీరవలసిన పని మరొకటుంది. పాకిస్తాన్‌లో మరణ దండనను ఎదుర్కొంటున్న కులభూషణ్‌ జాధవ్‌ను స్వదేశానికి తిరిగి రప్పించాలన్న మన డిమాండ్‌ను ఇది మరింత బలోపేతం చేయాలి. నిమిష కేసును (ఒకవేళ ఆమె శిక్షను మనం నిలువరించలేకపోతే) ఆసరాగా చేసుకుని, జాధవ్‌కు కూడా అటువంటి గతి పట్టించే సాహసం పాకిస్తాన్‌ అధికారులకు కలుగకుండా మనం ప్రతిఘటించి తీరాలి. ఇది చాలా ముఖ్యం. అన్నింటికన్నా మించి, అరుదైన కేసుల్లోనే విధిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ ఉరి శిక్షకు అవకాశం కల్పిస్తున్నాం. శిక్షా స్మృతికి సంబంధించి నీతి నియమాలు పరిణామం చెందుతున్న పరిస్థితులలో, ఆ రకమైన (ఉరి) శిక్ష తగినది కాదని మనం గ్రహించవలసి ఉంది.గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్, ఆధునిక భారతదేశ చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

ENG VS IND 4th Test Day 2: England team in strong position8
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు

మాంచెస్టర్‌: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ మళ్లీ ‘బజ్‌బాల్‌’ ఆటకు దిగినట్లుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌లిద్దరూ వన్డేను తలపించే బ్యాటింగ్‌ దూకుడు కనిపించడంతో ఒక్క సెషన్‌లోనే 148 పరుగులు చేసింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను గాయపడిన రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు దిగి ఆదుకున్నాడు. టెస్టులో పోరాడేందుకు తనవంతు పరుగులు జతచేసే నిష్క్రమించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 114.1 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (75 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శార్దుల్‌ ఠాకూర్‌ (88 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. లోయర్‌ ఆర్డర్‌పై ప్రతాపం చూపిన బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ డకెట్‌ (100 బంతుల్లో 94; 13 ఫోర్లు) అదరగొట్టారు. పోప్‌ (20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), రూట్‌ (11 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. జడేజా, అన్షుల్‌ కంబోజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. తడబడిన మిడిలార్డర్‌ రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 264/4తో గురువారం ఆట ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే కీలకమైన వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగే జతచేసిన జడేజా (20; 3 ఫోర్లు)ను ఆర్చర్‌ బోల్తా కొట్టించాడు. ఈ దశలో శార్దుల్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. ఈ సెషన్‌ ముగిసే దశలో ఉండగా క్రీజులో పాతుకుపోయిన శార్దుల్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. తొలిరోజు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 321/6 స్కోరు వద్ద వర్షం కాసేపు ఆటంకపరిచింది. అక్కడితోనే తొలి సెషన్‌ ముగిసింది. రెండో సెషన్‌లో పంత్, సుందర్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ బలపడుతుండగానే స్టోక్స్‌ మళ్లీ గట్టిదెబ్బే కొట్టాడు. నాలుగు బంతుల వ్యవధిలో సుందర్‌ (90 బంతుల్లో 27; 2 ఫోర్లు), అన్షుల్‌ కంబోజ్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో 6 కొట్టిన పంత్‌... స్టోక్స్‌ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీతో 69 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే ఆర్చర్‌... పంత్‌తో పాటు బుమ్రా (4) వికెట్‌ పడగొట్టడంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58; రాహుల్‌ (సి) క్రాలీ (బి) వోక్స్‌ 46; సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్‌ 12; పంత్‌ (బి) ఆర్చర్‌ 54; జడేజా (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 20; శార్దుల్‌ (సి) డకెట్‌ (బి) సోŠట్‌క్స్‌ 41; సుందర్‌ (సి) వోక్స్‌ (బి) స్టోక్స్‌ 27; అన్షుల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; బుమ్రా (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 4; సిరాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (114.1 ఓవర్లలో ఆలౌట్‌) 358. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 4–235, 5–266, 6–314, 7–337, 8–337, 9–349, 10–358. బౌలింగ్‌: వోక్స్‌ 23–5–66–1, ఆర్చర్‌ 26.1–3–73–3, కార్స్‌ 21–1–71–0, స్టోక్స్‌ 24–3–72–5, డాసన్‌ 15–1–45–1, జో రూట్‌ 5–0–19–0. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రాహుల్‌ (బి) జడేజా 84; డకెట్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) అన్షుల్‌ 94, ఒలీ పోప్‌ (బ్యాటింగ్‌) 20; రూట్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–166, 2–197. బౌలింగ్‌: బుమ్రా 13–4–37–0, అన్షుల్‌ కంబోజ్‌ 10–1–48–1, సిరాజ్‌ 10–0–58–0, శార్దుల్‌ 5–0–35–0, జడేజా 8–0–37–1. ఫ్రాక్చరైనా... ప్యాడ్లు కట్టుకొని... తొలి రోజే రిషభ్‌ పంత్‌ గాయపడటంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్‌ సంధించిన బంతి పంత్‌ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తదనంతరం స్కానింగ్‌లో బొటనవేలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్‌ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్‌పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్‌కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్‌ పంత్‌ క్రీజ్‌లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్‌ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఆడటం వల్లే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్‌ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్‌ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాను అవుట్‌ చేశాడు.

Government ignores complaints against corrupt IPS officer9
రాయలసీమలో అనకొండ ఐపీఎస్‌

మహేశ్‌బాబు నటించిన పోకిరి సినిమాలో అవినీతిపరుడు, దందాలు చేసే సర్కిల్‌ ఇన్‌­స్పెక్టర్‌ (సీఐ)గా ఆశిష్‌ విద్యార్థి తుపాకీ గురి­పెట్టి మరీ సెటిల్‌మెంట్లు సాగిస్తుంటాడు. భూములు, ఫ్లాట్లు రాయించుకుంటాడు. మరి.. అదే తరహా దందాకు ఏకంగా ఓ ఐపీఎస్‌ స్థాయి పోలీసు తెగబడితే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాయల సీమ వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందుకే ఆయనకు ‘అనకొండ ఐపీఎస్‌’ అని పోలీసు వర్గాలే పేరు పెట్టాయి. ఆయన టీడీపీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అత్యంత అవినీతి ఐపీఎస్‌ అధికారి.. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు. ఇదే అదనుగా భూ సెటిల్‌మెంట్‌లతో హడలెత్తిస్తున్నారు. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని చెలరేగిపోతు­న్నారు. దాంతో రాయలసీమలో సామాన్యుల భూములకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఆయనను కాదంటే ప్రాణాలకే దిక్కుండదని కణతకు తుపాకీ గురిపెట్టి మరీ బెదిరిస్తున్నారు. సాక్షి, అమరావతి: కర్నూలు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఆ ఐపీఎస్‌ అధికారి సెటిల్‌మెంట్ల దందా కోసం ఎంపిక చేసిన పోలీసు అధికారులతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ డీఎస్పీ, దాదాపు 12 మంది కిందిస్థాయి అధికారులు, కానిస్టేబుళ్లు అందులో సభ్యులుగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 2007 బ్యాచ్‌ సీఐ ఒకరు ఈ టీమ్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్య నేత పేరుతో ఉన్న ఆ సీఐ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కడెక్కడ ప్రైవేట్‌ భూ వివాదాలు ఉన్నాయన్నది ఆరా తీస్తారు. అందులోని ఇరువర్గాల్లో కాస్త మెతకగా ఎవరు ఉన్నారో, ఎవర్ని బెదిరించి లొంగదీసుకోవచ్చునో గుర్తిస్తారు. ఆ వివరాలను అనకొండ ఐపీఎస్‌కు చేరవేరుస్తారు. తర్వాత ఆ ఐపీఎస్‌ భూ వివాదంలోని ఇరువర్గాల్లో అవతలి పక్షాన్ని పిలిపించి డీల్‌ మాట్లాడతారు. ‘‘కోర్టు కేసులంటూ ఎన్నేళ్లు తిరుగుతారు? నేను సెటిల్‌ చేస్తా’’నంటూ పెద్ద బేరం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్‌ అందగానే ఆ ఐపీఎస్‌ తన బృందంలోని పోలీసు అధికారులను రంగంలోకి దింపుతారు. భూ వివాదంలో కాస్త మెతకగా ఉన్న కుటుంబ పెద్దను ఆ పోలీస్‌ పార్టీ అక్రమంగా ఎత్తుకు వస్తుంది. గుర్తుతెలియని ప్ర­దే­శంలో నిర్బంధించి తమ మార్కు ట్రీట్‌మెంట్‌ రుచి చూపిస్తుంది. భూ వివాదాన్ని తాము చెప్పినట్టుగా సెటిల్‌ చేసుకోవాలని వేధిస్తారు. పోలీసు దె­బ్బలు తట్టుకోలేక... ఎవరికీ చెప్పుకోలేక ఆ కుటుంబసభ్యులు ఐపీఎస్‌ అధికారి చెప్పినట్టు భూమిపై హక్కులు వదులుకునేందుకు సమ్మతిస్తారు. ఒక డీల్‌ సెట్‌ కాగానే ఐపీఎస్‌ అధికారి టీమ్‌ మరో భూ వివాదంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం రాయలసీమలో యథేచ్ఛగా సాగుతున్న ఐపీఎస్‌ దందాలో ఏడాది కాలంలో పదుల సంఖ్యలో భూ వివాదాలను తనదైన శైలిలో సెటిల్‌ చేశారు. భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. కర్నూలులో ఆయన కార్యాలయం ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని తలపిస్తోందని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.కాకినాడ పోర్టులోనూ దందానే! గత టీడీపీ ప్రభుత్వం ఆ ఐపీఎస్‌ను మౌలిక వసతుల కల్పన శాఖలో కీలక పోస్టులో నియమించింది. వాస్తవానికి ఇది ఐఏఎస్‌ అధికారితో భర్తీ చేయాల్సిన పోస్టు. కానీ, ఐపీఎస్‌కు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇక ఆ పోస్టు దక్కించుకున్న ఆ ఐపీఎస్‌ విచ్చలవిడిగా అవినీతికి తెగించారు. ప్రధానంగా కాకినాడ పోర్టు కాంట్రాక్టులు, అక్కడి నుంచి బియ్యం, ఇతర ఎగుమతుల్లో ఆయన చేసిన దందా అంతా ఇంతా కాదు. అక్రమంగా 40 మందిని నియమించుకుని మరీ భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇద్దరి మధ్య వేలు పెట్టిరూ.1.80 కోట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు వ్యక్తుల మధ్య 4.2 ఎకరాల భూ వివాదాన్నీ ఆ ఐపీఎస్‌ అదే రీతిలో సెటిల్‌ చేశారు. ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించి అవతలి పక్షాన్ని బెంబేలెత్తించారు. ఆయన ఇంటిలోకి పోలీసులు జొరబడి మరీ కుటుంబ సభ్యుల ముందే తీవ్రంగా కొట్టారు. ఈ వివాదంలో వెనక్కితగ్గకపోతే మున్ముందు పరిణా­మాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాంతో హడలిపోయిన ఆ కుటుంబం భూ వివాదం నుంచి వెనక్కుతగ్గింది. ఈ డీల్‌లో ఆ ఐపీఎస్‌ రూ.1.80 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.ఉపాధ్యాయుడినీ వదల్లేదు...కర్నూలులో 1.50 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడింది. ఓ ఉపాధ్యాయుడికి తాతతండ్రుల నుంచి సంక్రమించిన ఈ భూమి తనది అంటూ రియల్టర్‌ వివాదం సృష్టించారు. ఉపాధ్యాయుడికి అనుకూలంగా కింది కోర్టులో తీర్పు వచి్చనా హైకోర్టులో అప్పీల్‌ చేశారు. ఇదంతా తెలిసిన అనకొండ ఐపీఎస్‌ రంగంలోకి దిగారు. పోలీసులతో కిడ్నాప్‌ చేయించి, భూమిపై హక్కులు విడిచి పెట్టాలని బెదిరించారు. ఆయన సమ్మతించ లేదని.. పోలీసులు 2రోజులు తమదైన శైలిలో టార్చర్‌ చూపించి, కదల్లేని స్థితిలోకి తీసుకొచ్చారు. పోలీసులే కిడ్నాప్‌ చేసి మరీ దాడి చేయడంతో కుటుంబం బెంబేలెత్తింది. అయినాసరే తాము చెప్పినట్టు సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోలేదని ఉపాధ్యాయుడిపై అక్రమ కేసు నమోదుచేసి విచారణ పేరుతో వేధిస్తున్నారు.ఏవోబీ గంజాయి మాఫియా నుంచి నేటికీ వసూళ్లే అనకొండ ఐపీఎస్‌ అవినీతి ఊడలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) దాక విస్తరించాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పనిచేశారు. అప్పుడు ఏవోబీలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ మాఫియాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారిని నిరోధించకుండా ఉండేందుకు మామూళ్ల డీల్‌ సెట్‌ చేసుకున్నారు. ప్రైవేట్‌ ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు కూడా. రెండేళ్ల తరువాత విశాఖపట్నం జిల్లా నుంచి బదిలీ అయినా సరే గంజాయి మాఫియా నుంచి మామూళ్ల వసూళ్లు మాత్రం ఆపలేదు. గత ఐదేళ్లలో ఆ ఐపీఎస్‌ ఆటలు సాగలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే మరోసారి ఏవోబీలో ఏజెంట్ల వ్యవస్థను క్రియాశీలం చేశారు. ప్రస్తుతం రాయలసీమలో పోస్టింగులో ఉన్నా సరే ఏవోబీలోని గంజాయి స్మగ్లర్లు మామూళ్లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడినైన తాను త్వరలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, ఉత్తరాంధ్రలో గానీ పోస్టింగ్‌ తెచ్చుకుంటానని చెబుతున్నారు. ఇప్పుడు మామూళ్లు ఇవ్వకపోతే ఉత్తరాంధ్ర వచ్చాక అందరి సంగతి తేలుస్తానని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఆ అధికారి సన్నిహితుడని తెలిసిన గంజాయి స్మగ్లర్లు మామూళ్లు సమర్పించుకుంటున్నారు. వందల్లో ఫిర్యాదులు..పట్టించుకోని ప్రభుత్వం రాయలసీమలో అనకొండ ఐపీఎస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బలవంతపు భూ సెటిల్‌మెంట్లతో వందలమంది ఆస్తులు కోల్పోయారు. పలువురు బాధితులు ఆ అధికారికి వ్యతిరేకంగా ఏసీబీ, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి ఫిర్యా­దులు చేసినట్టు తెలుస్తోంది. ఆయనపై వస్తున్న ఫిర్యాదులతో ఏసీబీ వర్గాలే విస్తుపోతుండడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్య నేత దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. కానీ తమకు సన్నిహితుడైన ఆ ఐపీఎస్‌కు ప్రభుత్వ పెద్దలు కొమ్ముకాస్తున్నారు. పక్కా ఆధారాలతో సహా నివేదిక సమర్పించినా సరే ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ పెద్దల మనోగతం అర్థమైంది. ఇదే అదనుగా అనకొండ ఐపీఎస్‌ మరింతగా సెటిల్‌మెంట్ల దందాతో పెట్రేగిపోతున్నారు. రైస్‌ మిల్లులో కోటి.. అనకొండ ఐపీఎస్‌... వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో భారీ సెటిల్‌మెంట్‌ చేశారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఓ రైస్‌ మిల్లుపై సివిల్‌ వివాదం ఏర్పడింది. దానిగురించి తెలుసుకున్న అనకొండ ఐపీఎస్‌ తన టీమ్‌ను పంపారు. ఆ డీల్‌ సెట్‌ చేస్తామని ఓ వర్గానికి ఆఫర్‌ ఇచ్చారు. వైరి వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు అపహరించుకువచ్చారు. ట్రీట్‌మెంట్‌ రుచి చూపించారు. కేవలం నామమాత్రపు రేటుకు రైస్‌ మిల్లుపై హక్కు వదలుకునేలా చేశారు. ఈ డీల్‌లో ఆ ఐపీఎస్‌ అధికారికి రూ.కోటి దక్కిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి.

Women share in blue-grey collar jobs growing, attrition remains a challenge10
బ్లూ–గ్రే కాలర్‌ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా

ముంబై: కార్మిక, నైపుణ్య ఉద్యోగాల్లో (బ్లూ–గ్రే కాలర్‌ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అదే సమయంలో చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉద్యోగం వీడుతుండడం (వలసల రేటు/అట్రిషన్‌) ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో బ్లూ–గ్రే కాలర్‌ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం 19 శాతానికి పెరిగింది. 2020–21 నాటికి వీరి భాగస్వామ్యం 16 శాతంగా ఉండడం గమనార్హం. కానీ, వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఏడాది లోపు అనుభవం ఉన్న మహిళల ఎక్కువగా ఉద్యోగం మానేస్తున్నారు. ఈ వివరాలను ఉదైతి ఫౌండేషన్, క్వెస్‌కార్ప్‌ నివేదిక వెల్లడించింది. రిటైల్, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, సేవల రంగాల్లో ఉద్యోగం చేస్తున్న 10,000 మంది మహిళలతోపాటు, ఉద్యోగం మానేసిన 1,500 మందిని సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. వలసలు ఎక్కువగా ఉండడం ఉత్పాదకతకు, 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్న సాకారానికి విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళల అభిప్రాయాలు.. వచ్చే 12 నెలల్లో ఉద్యోగం వీడనున్నట్టు ఏడాది లోపు అనుభవం ఉన్న 52 శాతం మహిళా ఉద్యోగులు సర్వేలో తెలిపారు. అదే రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిలో ఇలా చెప్పిన వారు 3 శాతంగానే ఉండడం గమనార్హం. వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోనూ 54 శాతం తమ వేతనం విషయమై సంతృప్తిగా లేరు. 80 శాతం మంది నెలకి రూ. 2,000 కన్నా తక్కువే పొదుపు చేస్తున్నారు. మంచి వేతనం ఇస్తే ఉద్యోగాల్లో తిరిగి చేరతామని 42 శాతం మంది చెప్పారు. 57 శాతం మంది రవాణా పరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటే, 11 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పని ప్రదేశానికి వెళ్లి రావడాన్ని భద్రంగా భావించడం లేదు. రూ.20వేల కంటే అధిక వేతనం పొందుతున్న వారు సమీప కాలంలో ఉద్యోగం విడిచి పెట్టిపోవడం 21 శాతం తక్కువగా ఉండొచ్చన్నది ఈ నివేదిక సారాంశం. వ్యవస్థలోనే లోపం.. ‘‘భారత్‌ ఆర్థిక సామర్థ్యాల విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు ద్వారాలు తెరిచాం. కానీ, వారికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటుతోనే వృద్ధి చెందగలరు. సామర్థ్యాలు లేకపోవడం వల్ల మహిళల ఉద్యోగాలు వీడడం లేదు. మహిళలు పనిచేసేందుకు, విజయాలు సాధించేందుకు అనుకూలమైన వసతులను మనం కలి్పంచలేకపోతున్నాం’’అని ఉదైతి ఫౌండేషన్‌ సీఈవో పూజ గోయల్‌ వివరించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement