రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల పైచిలుకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించి.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు ₹1.80 లక్షలు, ఉచిత ఇసుక ద్వారా ₹15వేలు, నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించటంతో ఇంకో ₹40వేల మేర లబ్ధి. మరోవైపు అదనపు ఆర్థిక సాయంగా ₹35,000 రుణాన్ని పావలా వడ్డీకే అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.
ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి ₹4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద ₹46.90 కోట్లను జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్.
కోవిడ్ మహమ్మారి రెండేళ్లపాటు సంక్షోభం సృష్టించినా.. గిట్టనివాళ్లు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టించినా.. అవినీతికీ, వివక్షకూ తావులేకుండా.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించి ఊళ్లు సృష్టించిన జగనన్న.