ప్రధాన వార్తలు

ఇది అన్యాయం.. మా దేశంపైనే ఎందుకిలా?: ట్రంప్ 50 శాతం సుంకాలపై భారత్ రియాక్షన్
అమెరికా అదనపు సుంకాల నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనంగా 25% టారిఫ్ విధించడంతో.. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైందంటూ బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే.. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుందంటూ అందులో స్పష్టం చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం. .. మా దేశంలోని 140 కోట్ల ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ ఫ్యాక్టర్ల ఆధారంగా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇలా చాలా దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నదే. అయినప్పటికీ అమెరికా భారత్‌పై మాత్రమే టారిఫ్ విధించింది. ఇది దురదృష్టకరం. ఈ నిర్ణయం.. అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైనవిగా భారత్ ఖండిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. రష్యాతో ఇంకా చమురు వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో గత టారిఫ్‌తో కలిపి సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా పెంపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు ఇండో-అమెరికన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓటమి తప్పదనే పులివెందులలో టీడీపీ గూండాల అరాచకాలు: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తన సొంత నియోజకవర్గం పులివెందులలో గత రెండ్రోజులుగా జరిగిన పరిణామాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడిన నలుగురిని బుధవారం సాయంత్రం ఆయన ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచ ఘటనలను తీవ్రంగా ఖండించారాయన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు సూచించారు. ‘‘వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్ధమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారు’’ అని జగన్ బాధితులతో అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత వేల్పుల రాము కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు బాధితుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ఇద్దరితో పాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో గాయపడ్డ సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిలతోనూ వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రులు మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. దాంతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాద సంఘటనలో మరణించిన ఎనిమిది మందిలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా మరియు పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు. ఘనా సాయుధ దళాల ప్రకారం, Z-9 యుటిలిటీ హెలికాప్టర్ బుధవారం ఉదయం రాజధాని నగరం అక్ర నుండి బయలుదేరింది. అక్కడ నుండి అశాంతి ప్రాంతంలోని కీలకమైన బంగారు గనుల పట్టణం ఒబువాసి వైపు వెళుతుండగా రాడార్ సిగ్నల్స్ తెగిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం "జాతీయ విషాదం"గా ప్రకటించింది.అయితే ఈ ప్రమాదానికి గల ఇతర కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు
న్యూయార్క్/న్యూఢిల్లీ: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్‌పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని మోపారు. వద్దని ఎంతగా వారించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని, బహిరంగ మార్కెట్లో అమ్ముకుని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తూ బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై శ్వేతసౌధంలో ఆయన సంతకం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 25 శాతం టారిఫ్ నేటి నుంచి అంటే ఆగస్ట్ ఏడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. బుధవారం ప్రకటించిన అదనపు 25 శాతం టారిఫ్‌ను 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 27వ తేదీ తర్వాత వర్తింపజేయనున్నారు. ‘‘రష్యా ముడిచమురును ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ విచ్చలవిడిగా దిగుమతి చేసుకుంటోంది. అందుకే మా చట్టాల ప్రకారం అమెరికా కస్టమ్స్ సుంకాల పరిధిలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ను మరోసారి పెంచాలని నిర్ణయించాం’’అని కార్యనిర్వాహఖ ఉత్తర్వులో ట్రంప్ పేర్కొన్నారు. అదనపు టారిఫ్‌లకు స్పందనగా భారత్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటే వైట్‌హౌస్ అందుకు తగ్గ టారిఫ్‌ల సవరణకు సిద్ధపడుతుందని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. మిత్రదేశమని కూడా చూడకుండా మితిమీరిన ఆవేశంతో భారత్ వీపు మీద పన్నుల వాత పెట్టి ట్రంప్ తన అగ్రరాజ్య అధిపత్యధోరణిని మరోసారి నిస్సుగ్గుగా ప్రదర్శించారు. స్నేహహస్తమందిస్తూనే సుంకాల సుత్తితో మోదడంపై భారత్ సైతం ధీటుగా, ఘాటుగా స్పందించింది. 140 కోట్ల జనాభా చమురు నిత్యావసరాలు, దేశ ఇంధన భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘అదనం’అమలుకు మినహాయింపులు భారత్‌పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25 శాతం టారిఫ్‌ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 25 శాతాన్ని భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరకుపై ఈ అదనపు 25 శాతం సుంకాన్ని విధించబోరు. అలాగే బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం మోపబోరు. సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు. తాము నష్టపోకుండా ముందుజాగ్రత్త భారత్‌పై రెట్టింపు పన్నులతో రెచ్చిపోయిన ట్రంప్.. ఈ అదనపు సుంకాలు అమెరికా ఖజానాకు నష్టదాయకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగాలవారీగా టారిఫ్ వసూలుచేస్తున్న ఉక్కు, అల్యూమినియంతోపాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్స్‌పై ఈ అదనపు భారం ఉండబోదని తెలుస్తోంది. తద్వారా అమెరికాలో ధరల పెరగకుండా జాగ్రత్తపడుతున్నారు. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్‌లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. టెక్స్టైల్స్, సముద్ర ఉత్పత్తులు, తోలు, సానబట్టిన వజ్రాలు, రత్నాభరణాల ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం పడొచ్చు. దీంతో అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తూత్పత్తుల పరిమాణం సగానికి సగం తగ్గిపోవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) ఆందోళన వ్యక్తంచేసింది. అత్యంత విచారకరమన్న భారత్ అదనంగా 25 శాతం టారిఫ్‌ల గుదిబండ పడేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ‘‘రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి చమురునిల్వలను చూసి అమెరికా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. ఈ అంశంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే సుస్పష్టంచేసింది. ముడిచమురు వంటి ఇంధన దిగుమతులు అనేవి పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి జరుగుతాయి. దేశ ఇంధన భద్రతే ఏకైక లక్ష్యంగా భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. భారత్‌పై అదనపు టారిఫ్ విధించడం ద్వారా ఎక్కువ సొమ్ములు కళ్లజూడాలని అమెరికా ఆశపడటం అత్యంత విచారకరం. ఇలాంటి చర్యలు ఏమాత్రం సబబుగా లేవు. ఇవన్నీ సహేతుకంకాని అన్యాయమైన నిర్ణయాలు. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు మా తక్షణ కర్తవ్యం. ఇంతటి అత్యంత కీలకమైన బాధ్యతల నుంచి భారత్ ఏనాడూ పక్కకు తొలగిపోదు. దేశ ప్రయోజనాలు, ఇంధన సంక్షోభ నివారణ చర్యల విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. విదేశాలు తీసుకునే భారతవ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం తగు కఠిన చర్యలు తప్పక తీసుకుంటుంది. జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. స్వప్రయోజనాల కోసం ప్రతిదేశం స్వీయ నిర్ణయాలు తీసుకుంటుందని అమెరికా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది’’అని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. గత మూడ్రోజుల్లో ట్రంప్ ప్రభుత్వానికి దీటుగా భారతప్రభుత్వం ఘాటైన జవాబివ్వడం ఇది రెండోసారి. బ్రెజిల్.. భారత్ ఒక్కటే అమెరికా దృష్టిలో బ్రెజిల్, భారత్ ఒక్కటేనని తాజా పన్నుల పెంపు పర్వంతో తేలిపోయింది. బ్రెజిల్‌పై అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధిస్తుండగా భారత్‌పై తాజా పెంపుతో భారతీయ ఉత్పత్తుల దిగుమతి టారిఫ్ సైతం 50 శాతానికి చేరింది. మయన్మార్ ఉత్పత్తులపై 40 శాతం, థాయిలాండ్ కాంబోడియాలపై 36 శాతం, బంగ్లాదేశ్‌పై 35 శాతం, ఇండోసేసియాపై 32 శాతం, చైనా, శ్రీలంకలపై 30 శాతం, మలేసియాపై 25 శాతం, ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20 శాతం టారిఫ్‌ను అమెరికా విధించిన విషయం విదితమే.

మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని హెచ్చరించారు. ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాందీని ప్రధానమంత్రిని చేసుకుని బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను నెరవేర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే తడాఖా చూపిస్తామని అన్నారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో టీపీసీసీ బుధవారం నిర్వహించిన మహాధర్నాలో సీఎం ప్రసంగించారు. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తే అదే మరణ శాసనం ‘గోధ్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి నాడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని కోరితే చేయలేదు. 75 ఏళ్లు నిండినందున ప్రధాని పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించడం ఖాయం. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రాము.. గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్‌గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సామాజిక న్యాయంపై రాహుల్‌గాంధీ శిలాశాసనానికి వ్యతిరేకంగా వస్తే అదే మరణ శాసనం అవుతుంది..’అని రేవంత్ హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణ బీసీల అవసరం లేదా? ‘బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేశారు. నాడు కేసీఆర్ చేసిన చట్టమే నేడు రిజర్వేషన్ల పెంపునకు గుదిబండగా మారింది. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపినా ఆమోదించడం లేదు. కేసీఆర్‌తో పాటు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ బీసీల అవసరం లేదా? బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు? తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా? ఆ అదృష్టం నాకు దక్కింది ‘దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయలేదు. ఇప్పటివరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం నాకు దక్కింది. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకే ఢిల్లీలో ధర్నాకు దిగాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరతాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్ బుద్ధి మారలేదు.. అహంకారం తగ్గలేదుబీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారు. కానీ కేటీఆర్ పేరే డ్రామారావు. కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోంది. అధికారం, పదవులు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదు..అహంకారం తగ్గలేదు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలం.. మరొకరు ప్రతికూలం.. మరొకరు అటూఇటూ కాకుండా మాట్లాడుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.

పాక్ ప్రమిదకు ట్రంప్ చమురు
పాకిస్తాన్–అమెరికాలు జూలై 31న ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్‌లోని చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయడంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇంధనం, ఖనిజాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, క్రిప్టో కరెన్సీలలో కూడా విస్తృత సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలని రెండు దేశాలూ కోరుకున్నాయి. ఇది పాకిస్తాన్‌లోని మౌలిక సదుపాయాలపై అమెరికా పెట్టుబడులను పెంపొందించేందుకు తోడ్పడవచ్చు. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్య విస్తరణకు సాయపడవచ్చు. ‘మేం ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించగల ఆయిల్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ చమురు సంపద మొదట్లో ఆ దేశ సెంట్రల్ పంజాబ్ లోని టూట్ చమురు క్షేత్రానికే పరిమితమైంది. ఆ ప్రాంతం పోటో హార్గా సుపరిచితం. అది ఇస్లామాబాద్‌కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదటి చమురు బావిని 1964లో తవ్వారు. వాణి జ్యపరమైన ఉత్పాదన 1967లో మొదలైంది. సుమారు 6 కోట్ల పీపాల చమురు ఉందని భావించారు. దాని నుంచి 12–15 శాతం భాగం మాత్రమే తవ్వితీయగలమని నిర్ణయించారు. ఉత్పాదన 1986లో శిఖర స్థాయికి చేరి, రోజుకు సుమారు 2,400 పీపాల చమురు వెలికి తీశారు. పెట్రో దిగ్గజం యూనియన్ టెక్సాస్‌కు చెందిన పాకిస్తానీ అనుబంధ సంస్థ... సింథ్ దిగువన ఒక చమురు క్షేత్రాన్ని 1981లో కనుగొంది. సింథ్ చమురు క్షేత్రాలు 1998–1999 నాటికి టూట్ చమురు క్షేత్రం కంటే ఎక్కువ చమురును అందించాయి. టూట్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ జాతీయ చమురు కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్ మెంట్ కంపెనీ (ఓజీడీసీ) లిమిటెడ్‌తో వాంకూవర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ సావరిన్ ఎనర్జీ కార్పొరేషన్ 2005లో ఒక అవగా హనా పత్రంపై సంతకాలు చేసింది. షుంబర్గర్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ 2006లో అక్కడ మొదట కార్యకలాపాలు ప్రారంభించింది. టూట్ చమురు క్షేత్రంలోను, దాని పొరుగునున్న మిస్సా కేశ్వాల్ చమురు క్షేత్రంలోను పనిచేసేందుకు రెండు కెనడియన్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీటి స్థానాన్ని ఇపుడొక అమెరికన్ కంపెనీ భర్తీ చేయవచ్చు. పాక్‌లో ఐదు చోట్ల –చెంగియూ పీకే లిమిటెడ్ (బెలూచిస్తాన్ లోని హబ్ ), పాక్–అరబ్ రిఫైనరీ కంపెనీ లిమిటెడ్ (గుజరాత్‌లోని కస్బా), పాకిస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (కరాచి), అటాక్ రిఫైనరీ లిమి టెడ్, నేషనల్ రిఫైనరీ లిమిటెడ్ (కామ్చి)–చమురు శుద్ధి కర్మాగారా లున్నాయి. వాటన్నింటి చమురు శుద్ధి సామర్థ్యం రోజుకు 4,20,000 పీపాల వరకు ఉంటుంది. గ్వాదర్‌లో మరో ఆయిల్ రిఫైనరీ నెల కొల్పే ఆలోచనలో ఉన్నట్లు సౌదీ ఆర్మకో 2019లో ప్రకటించింది. అమెరికా–పాకిస్తాన్ల మధ్య వాణిజ్యం 2024లో 7.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉంది. అమెరికా వస్తువుల వాణిజ్య లోటు 300 కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. పాకిస్తాన్ నుంచి అమెరికా లినెన్ ఉత్ప త్తులు, లెదర్ వస్తువులు, కలపతో చేసిన ఫర్నిచర్ వస్తువులను దిగు మతి చేసుకొంటూ, పాకిస్తాన్‌కు ముడి పత్తి, విమానాల భాగాలు, ఇతర యంత్ర సామగ్రి పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఈ అసమతౌల్య సమస్యను పరిష్కరించేందుకు అమెరికా నుంచి వస్తువుల దిగుమతులను పెంచుకుంటామని పాక్ పేర్కొంది. పాకిస్తాన్‌లోని ఖనిజ నిక్షేపాల పట్ల అమెరికాకు కొత్తగా ఆసక్తి పుట్టుకురావడం వెనుక వేరే లావాదేవీలు ఉన్నాయని వాషింగ్టన్ లోని విల్సన్ సెంటర్లో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైకేల్ కుగెల్ మ్యాన్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ట్రంప్ బంధువులకి వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థలో షేర్లు ఉన్నాయి. ఆ సంస్థ పాక్‌లో 2025 మార్చిలో ఏర్పడిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఆ వెంటనే ఏప్రిల్‌లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పాక్‌లో కొత్తగా మంత్రిగా నియమితుడైన బిలాల్ బిన్ సాకిబ్ ఆ కౌన్సిల్‌కి నేతృత్వం వహిస్తున్నారు. సాకిబ్ ఇటీవల బిట్ కాయిన్ల రంగంలోకి ప్రవేశించారు. లాస్ వేగాస్‌లో మే నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాకిబ్, క్రిప్టోను కాపాడిన అధ్యక్షుడిగా తాను ట్రంప్‌ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తర్వాత, వైట్ హౌస్‌లో అమెరికా అధికారులతో సాకిబ్ మంతనాలు జరిపారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కి, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్‌కి వైట్ హోస్లో ట్రంప్ విందు ఏర్పాటు చేయడానికి ఆ సమావేశమే మార్గం సుగమం చేసిందని చెబుతారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుని నాలుగేళ్ళు గడుస్తున్నా, అమెరికా–పాక్ సంబంధాలలో ఇప్పటికీ చాలా అనిశ్చితి ఉంది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమా నాల నిర్వహణ, మరమ్మతు పరికరాలకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో అమెరికా సైన్యం సమకూర్చిన సాయం 397 మిలియన్ల డాలర్ల మేరకు ఉంది. చైనా ఆయుధాలపై మితిమీరి లేదా దాదాపు పూర్తిగా ఆధారపడుతున్న స్థితి నుంచి పాక్ రక్షణ వ్యవస్థను తప్పించాలని అమెరికా కోరుకుంటూ ఉండవచ్చుకానీ, మునుపు పాక్‌తో భారీ స్థాయిలో ఉన్న ఆయుధాల సంబంధాలను పునరు ద్ధరించుకోవడంపై అమెరికా వైపు ఏకాభిప్రాయం లేదు.ఈ నేపథ్యంలో, భారత్–పాక్‌ల మధ్య శాంతికి ప్రయత్నించినట్లు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నా, భారత్‌తో కలసి అడుగులు వేయడంపై అమెరికా తాత్సారం చూపడం సహజ పరిణామంగానే తోస్తుంది. రాణా బెనర్జీ వ్యాసకర్త క్యాబినెట్ సెక్రటేరియట్లో మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)

‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే?
ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ-2025లో పరుగుల వరద పారింది. భారత్, ఇంగ్లండ్ జట్లు కలిపి 7000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో 7000 పైగా పరుగులు చేయడం ఇది రెండో సారి మాత్రమే. కానీ టీమిండియా తరపున మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వారు మాత్రం ఈ రన్ ఫీస్ట్‌లో తమ మార్క్ చూపించలేకపోయారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసి 241 పరుగులు మాత్రమే సాధించారు.నిరాశపరిచిన నాయర్..ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో నాయర్ రెండు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు సుదర్శన్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ ఇది అతడికి తొలి టెస్టు సిరీస్. మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 23.33 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అనుభవజ్ఞుడైన కరుణ్ నుంచి మాత్రం అభిమానులు మెరుగైన ప్రదర్శనను ఆశించారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వీరిద్దరి ప్రదర్శనకు మార్క్‌లు వేశాడు. కరుణ్ నాయర్ కంటే సాయిసుదర్శన్కు ఇర్ఫాన్ పఠాన్ మెరుగైన రేటింగ్ ఇచ్చాడు.పదికి నాలుగు.."ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ ప్రదర్శనకు పదికి నాలుగు మార్కులు వేస్తాను. సిరీస్ అంతటా అతడు మరీ అంత పేలవమైన ప్రదర్శనలు కనబరచలేదు. అతడు తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోలేకపోయాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీతో సిరీస్‌ను ముగించాడు. ఈ సిరీస్‌లో అతడికి చాలా అవకాశాలు లభించాయి. క్రికెట్ అతడికి ఖచ్చితంగా రెండవ అవకాశమిచ్చేందని చెప్పాలి. కానీ దానిని అతడు ఉపయోగించుకోలేకపోయాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో భారత్‌ను గెలిపించే ఛాన్స్ అతడికి ఉండేది. కానీ అక్కడ కూడా అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడు క్రీజులో కుదురుకున్నట్లు కన్పించాడు. కానీ సడన్‌గా పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. బౌన్సర్ బంతులకు అతడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు.పదికి ఐదు.."సాయిసుదర్శన్కు పదికి ఐదు మార్క్‌లు ఇవ్వాలనుకుంటున్నాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్బుతంగా ఉంటుంది. అతడు తన బ్యాటింగ్‌లో బలహీనతలను అధిగమించాడు. తొలి టెస్టులో కంటే మిగితా మ్యాచ్‌ల్లో కాస్త మెరుగ్గా కన్పించాడు. అతడికి లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు. కానీ ఈసారి అలా చేయలేకపోయాడు. అయితే సాయి అన్ని మ్యాచ్‌లు ఆడి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నేను అనుకుంటున్నాను తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు.

వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు.

చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం
మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.చనిపోయినవారి బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అప్పగించడంలో వివిధ బ్యాంకుల్లో భిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీంతో క్లయిమ్ సెటిల్మెంట్లో ఇబ్బందులు, తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బ్యాంకులు అనుసరించే ఈ ప్రక్రియలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.రూ .67,000 కోట్లకుపైగా అన్‌క్లెయిమ్ డిపాజిట్లుబ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జూలై 28న పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ డేటా ప్రకారం, భారతీయ బ్యాంకులు జూన్ 30, 2025 నాటికి రూ .67,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి.క్లెయిమ్ చేయని మొత్తం డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.58,330.26 కోట్లు. ఇందులో ఎస్బీఐ రూ.19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్లు అన్‌క్లయిమ్ డిపాజిట్లు ఉన్నాయి.ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తారు.కాగా పాలసీ రెపో రేటును యథాతథంగా 5.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
రేట్ల కోతకు బ్రేక్!
హద్దులు పెట్టుకోదలచుకోలేదు!
మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్
డైరెక్టర్ రిపీట్?
పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు
చైనా పర్యటనకు ప్రధాని మోదీ
మగ్గం వెనుక ఆమె శ్రమ
ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?
జలప్రళయం
పాక్ ప్రమిదకు ట్రంప్ చమురు
మళ్లీ సుంకాలు పెంచుతా - ట్రంప్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
రెండోసారి తండ్రైన బిగ్‌బాస్ ఆదిరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయోనని వెతుకుతున్నారు!!
Viral Video: సింహం తినే మూడ్‌లో ఉంది.. లేదంటేనా.. నీ రీల్స్ పిచ్చికి అదే ఆఖరి రోజు!
Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్
ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
'మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం'
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
బిహార్‌లో తీసేశాం కాబట్టి ఇక్కడ చేర్చాం.. అంతే!
చెల్లి పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకలో సింగర్ మధుప్రియ
'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతోనే 'గంగోత్రి': చిన్నికృష్ణ
ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు
'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్
అమెరికాకు ఎగుమతుల్లో30 శాతం కోత!
నాకు మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను
ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ
టార్గెట్ రేవంత్!
మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు
నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు కొత్త షెడ్యూల్
మార్పు... మంచి కోసమే!
తొలిసారి కూతురు సమక్షంలో...
బెంగాల్ క్రికెట్ ఎన్నికల బరిలో గంగూలీ!
‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే
షఫాలీ, రాధా యాదవ్‌పై దృష్టి
బీసీసీఐ సమాచారం ఇవ్వనవసరం లేదు!
రేట్ల కోతకు బ్రేక్!
మళ్లీ సుంకాలు పెంచుతా - ట్రంప్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
రెండోసారి తండ్రైన బిగ్‌బాస్ ఆదిరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయోనని వెతుకుతున్నారు!!
Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్
ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
'మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం'
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
బిహార్‌లో తీసేశాం కాబట్టి ఇక్కడ చేర్చాం.. అంతే!
చెల్లి పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకలో సింగర్ మధుప్రియ
'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతోనే 'గంగోత్రి': చిన్నికృష్ణ
ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు
'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్
అమెరికాకు ఎగుమతుల్లో30 శాతం కోత!
ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
నాకు మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను
రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ
ఉదయం లేవగానే మొటిమలపై ఉమ్మి రాసుకుంటా: తమన్నా
సినిమా

ప్రభాస్ సలార్ మూవీ.. స్టార్ హీరోకు ప్రశాంత్ నీల్ క్షమాపణలు!
సలార్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తర్వాత ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డ మూవీ ఇదే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో పాటు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు చెప్పారు. మేము సలార్ డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని అనుకోలేదన్నారు. కానీ జ్యోతిష్యం వల్ల ఆ తేదీనే విడుదల చేయాల్సి వచ్చిందని ఇంటర్వ్యూలో వెల్లడించారు.కాగా.. ప్రభాస్ సలార్ రిలీజ్‌కు ముందే రోజే షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన డుంకీ థియేటర్లలో రిలీజైంది. మరుసటి రోజే సలార్ విడుదల కావడంతో డుంకీ మూవీపై ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డుంకీ రాణించలేకపోయింది. అందుకే ఈ విషయంలో తనను క్షమించాలని సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డుంకీ టీమ్‌ను కోరారు."I apologise to #Dunki team for this clash. #SRK sir & Hirani sir are colossal & announced date way before. We didn't want #Salaar to come on this date, it happened due to astrology" :Prashanth Neel Salaar would have been easy 1000crs if not for Clash.pic.twitter.com/Pi0dvqBgFC— Pan India Review (@PanIndiaReview) August 6, 2025

విలన్‌గా అడిగారు.. ఆ హీరో రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేశా: లోకేశ్
కూలీ సినిమా కోసం విలన్ రోల్ చేజార్చుకున్నానంటున్నాడు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే కూలీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.విలన్‌గా ఛాన్స్ వస్తే..సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు లోకేశ్. ఈ సందర్భంగా ఓ చిట్‌చాట్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి సినిమాలో విలన్‌గా ఛాన్స్ వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. దర్శకురాలు సుధా కొంగరతో పలుమార్లు సమావేశమయ్యానని తెలిపాడు. కానీ కూలీ చిత్రీకరిస్తున్న సమయంలోనే పరాశక్తి కూడా సెట్స్‌పైకి వెళ్లిందన్నాడు.రిజెక్ట్ చేశావిలన్గా నటించాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ డేట్స్ క్లాష్ అవుతున్నందున పరాశక్తి మూవీ ఆఫర్‌ను తిరస్కరించానని పేర్కొన్నాడు. శివకార్తికేయన్ సైతం జోక్యం చేసుకుని తనను విలన్‌గా చేయమని సూచించారన్నాడు. కానీ కూలీ సినిమాను చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సి ఉన్నందున దాన్ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలోనే హీరోగా..పరాశక్తి సినిమా విషయానికి వస్తే.. శివకార్తికేయన్, రవిమోహన్, శ్రీలీల, అధర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఇకపోతే లోకేశ్.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.చదవండి: భార్యకు వండి పెడ్తా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్

రాజన్న నటిపై విచిత్ర ఆరోపణలు.. కేసు నమోదు..!
ప్రముఖ నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదైంది. ఆమెపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్వేతా మీనన్‌పై కేరళకు చెందిన మార్టిన్ మేనచేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆర్థిక లాభాల కోసం అడల్ట్ చిత్రాలు చేస్తోందని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు. అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది.

నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!
మాతృత్వాన్ని కోరుకోని మహిళ ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ వయసు దాటాక తల్లి కావాలని కోరుకుంటుంది. కన్నడ నటి భావన రామన్న (Bhavana Ramanna) కూడా అదే ఆశించింది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడింది. 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. వివాహానికి దూరంగా ఉన్న ఆమె సింగిల్ మదర్‌గానే పిల్లలను పెంచేందుకు సిద్ధమవుతోంది. సీమంతంలో అలాంటి ప్రశ్నలుతాజాగా ఆమె సీమంతం జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు ఈ ఫంక్షన్‌కు హాజరై ఆమెను దీవించారు. అయితే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి కొందరు అదేపనిగా అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారంటోంది భావన. ఆమె మాట్లాడుతూ.. నా సీమంతం వేడుక ఎంతో సంతోషంగా జరిగింది. అయితే కొందరు అనవసరమైన ప్రశ్నలు వేయడమే నన్ను షాక్‌కు గురి చేసింది. ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకోలేదన్నారు. నా ఇష్టంమరికొందరేమో పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఒకటుంది, మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. నేను నా జీవితంలో సంతోషకర క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? ఇవే ప్రశ్నలు మగవాడిని అడగ్గలరా? నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను. అందుకు మీకేంటి అభ్యంతరం? నా జీవితం నా ఇష్టం. సమాజంలో చాలావాటిలో మార్పొచ్చింది. ఏం చేసినా తప్పే!కానీ, ఇప్పటికీ మహిళ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఏం చేసినా తప్పుపడుతూనే ఉన్నారు. ఈ విషయంలో మార్పు రావాలి. వెనకటి కాలంలో సంతానం లేని మహిళలను పండగలకు, శుభకార్యాలకు దూరంగా ఉంచేవారు. అది చూసి నా మనసు చివుక్కుమనేది. ఐవీఎఫ్ వంటి ఆధునాతన పద్ధతులు.. అలాంటివారిలో ఓ కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. నీచమైన కామెంట్లుదానిపై కూడా విమర్శలా? ప్రతిదాన్నీ తప్పుపట్టడం, నీచమైన కామెంట్లు చేయడం మానండి. ఈ ఆన్లైన్ ట్రోలింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana Ramanna (@bhavanaramannaofficial) చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

షఫాలీ, రాధా యాదవ్‌పై దృష్టి
మకాయ్ (క్వీన్స్లాండ్): అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ ప్లేయర్లు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా భారత మహిళ ‘ఎ’ జట్టు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో మూడు టి20లు, మూడు వన్డేలు, ఓ నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. టి20 సిరీస్‌లో భాగంగా గురువారం మకాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో భారత ‘ఎ’ జట్టుకు రాధా యాదవ్ సారథిగా వ్యవహరిస్తుండగా... చాన్నాళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ అనుభవం ఉన్న పలువురు ప్లేయర్లతో పాటు కొత్త వాళ్లకు ఇందులో అవకాశం కల్పించారు. మిన్ను మణి, సజన, ఉమా ఛెత్రి, రాఘ్వి బిస్త్, తనూజ కన్వర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, టిటాస్ సాధు భారత ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. మరోవైపు గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ ఆసీస్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుకు నికోల్ ఫాల్టుమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... తహిలా విల్సన్, కిమ్ గార్త్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ పర్యటనలోని మూడు ఫార్మాట్లకూ భారత ‘ఎ’ జట్టుకు రాధ యాదవ్ కెపె్టన్‌గా వ్యవహరించనుంది.

బీసీసీఐ సమాచారం ఇవ్వనవసరం లేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ (ఎన్ఎస్జీబీ)లో కొత్త సవరణను చేర్చింది. ఇప్పటి వరకు ఉన్న బిల్లులో ‘గుర్తింపు పొందిన ఏ క్రీడా సంఘమైనా ప్రజలకు చెందినదే. తమ విధులు, అధికారాలు నిర్వహించే విషయంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ )–2005 పరిధిలోకే అది వస్తుంది’ అని స్పష్టంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ చాలా కాలంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇతర క్రీడా సంఘాల తరహాలో తాము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదని, బోర్డు ఆర్టీఐ పరిధిలోకి రాదని చెబుతూ వచ్చింది. చివరకు బోర్డు ఆశించిన ప్రకారం వారికి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కొత్త బిల్లులో సవరణను జోడించింది. దీని ప్రకారం ‘ప్రభుత్వం నుంచి నిధులు, సహాయం పొందే క్రీడా సంఘాలకే ఆర్టీఐ నిబంధన వర్తిస్తుంది. అలా ఆర్థిక సహకారం తీసుకుంటేనే దానిని ప్రజా సంస్థగా గుర్తిస్తారు’ అని స్పష్టతనిచ్చింది. తాజా సవరణ నేపథ్యంలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తూ సామాన్యులు ఎవరైనా బీసీసీఐని ప్రశ్నించడానికి లేదా వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కోరడానికి గానీ అవకాశం లేదు. ‘తాజా బిల్లులో ఇది ఒక సమస్యగా కనిపించింది. ఆర్థిక సహకారం తీసుకోవడం లేదనే కారణం చూపించి ఈ బిల్లు ఆమోదం కాకుండా పార్లమెంట్లో అడ్డుకునే అవకాశం ఉండేది. లేదా ఇదే కారణంతో బీసీసీఐ కోర్టుకెక్కేది కూడా. అందుకే సవరణ చేయాల్సి వచ్చింది’ అని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆర్టీఐ పరిధిలోకి రాకపోయినా... కొన్ని ఇతర నిబంధనలు బీసీసీఐని కూడా ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది చట్టంగా మారితే బీసీసీఐ కూడా వెంటనే జాతీయ క్రీడా సమాఖ్యగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడగా మారనుండటం దీనికి ఒక కారణం. కొత్త బిల్లు ప్రకారం నిధులు పొందకపోయినా... వ్యవస్థ నడిచేందుకు ఇతర రూపాల్లో సహాయ సహకారాలు తీసుకుంటుంది కాబట్టి జవాబుదారీతనం ఉండాల్సిందే. పైగా బీసీసీఐ కూడా నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ) పరిధిలోకి వస్తుంది. క్రీడా సంఘాల్లో ఎన్నికల నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు ఏదైనా వివాదం వస్తే ఎన్సీటీ పరిష్కరిస్తుంది. ట్రైబ్యునల్ తీర్పులను సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది.

పాక్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
పాకిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడా తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు.అదేవిధంగా విధ్వంసకర ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. షెపర్డ్ ఇంతకుముందు ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు.మరోవైపు పాక్‌తో సిరీస్‌కు ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇంతకుముందు టీ20 సిరీస్‌కు కూడా జోసెఫ్ దూరమయ్యాడు. ఈ జట్టులో రోస్టన్ చేజ్, బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, లూయిస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 8 నుంచి 12 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.కాగా అంతకుముందు పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ కోల్పోయింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను ఎలా అయినా సొంతం చేసుకోవాలని కరేబియన్ జట్టు పట్టుదలతో ఉంది.పాక్‌తో వన్డే సిరీస్‌కు విండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్ మరియు రొమారియో షెపర్డ్.

ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్-2025 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఏడాది సీజన్లో కార్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ అతడు ప్రస్తుతం పాదం, బొటనవేలు గాయంతో బాధపడుతున్నాడు.కార్స్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగమయ్యాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కారణంగా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు వైద్యల సలహా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని కార్స్ ధ్రువీకరించాడు."భారత్‌తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జరిపాను. వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది ది హండ్రెడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్నప్పటికి నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను.భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు కూడా కార్స్ దూరమయ్యే అవకాశముంది. అతడు తిరిగి మళ్లీ యాషెస్ సిరీస్‌లో ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే?
బిజినెస్

రూ.26 కోట్లు సమీకరించిన క్లీన్ ఎనర్జీ కంపెనీ
కార్బన్ రహిత విద్యుత్ వ్యవస్థల కోసం ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్ (ఎల్ఈఎన్ఆర్)’ను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించిన క్లీన్ ఎనర్జీ స్టార్టప్ హెచ్వైఎల్ఈఎన్ఆర్ ‘ప్రీ-సిరీస్-ఏ ఫండింగ్ రౌండ్’ను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ రౌండ్లో సుమారు 3 మిలియన్ డాలర్ల(రూ.26.39 కోట్లు)ను సమీకరించినట్లు తెలిపింది. డీప్ టెక్, ఎనర్జీ ట్రాన్సిషన్ టెక్నాలజీల్లో ఆసక్తి ఉన్న వేలార్ క్యాపిటల్, చత్తీస్‌గఢ్ ఇన్వెస్టమెంట్స్ లిమిటెడ్ ఈ రౌండ్లో పాల్గొన్నాయని కంపెనీ తెలపింది. వీటితోపాటు వ్యక్తిగత ఇన్వెస్టర్లు కార్తీక్ సుందర్ అయ్యర్, అనంత్ సర్దా ఇందులో పాల్గొన్నారని పేర్కొంది.ఈ నిధులతో గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్ స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎల్ఈఎన్ఆర్ టెక్నాలజీతో తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసే ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చని పేర్కొంది. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు బదులుగా లో-ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ (ఎల్ఈఎన్ఆర్) టెక్నాలజీ ద్వారా రేడియోధార్మిక పదార్థాలు లేకుండా స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్(ఎల్ఈఎన్ఆర్ టెక్నాలజీతో నడిచే రియాక్టర్)ను హెచ్ఐఎల్ఈఎన్ఆర్ అభివృద్ధి చేసింది.ఈ ఫండింగ్ రౌండ్లో పాల్గొన్న వేలార్ క్యాపిటల్ పార్టనర్ కరణ్ గోషార్ మాట్లాడుతూ..‘హెచ్వైఎల్ఈఎన్ఆర్కు చెందిన ఎల్ఈఎన్ఆర్ టెక్నాలజీ పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడే ఎనర్జీని అందిస్తుంది. ఇది శక్తిని అందించడంతోపాటు అసాధారణమైన భద్రతా కూడా కలిగి ఉంది. ఇది ప్రపంచ శక్తి పరివర్తనకు సరిగ్గా సరిపోతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.హెచ్వైఎల్ఈఎన్ఆర్ ఛైర్మన్, ఎండీ సిద్దార్ధ దురైరాజన్ మాట్లాడుతూ..‘ఇటీవలి ప్రయోగశాల పరిశోధనలు మెరుగైన ఎనర్జీ ఫలితాలు ఇచ్చాయి. ఎల్ఈఎన్ఆర్ వ్యవస్థ ఆచరణీయంతోపాటు చాలా సమర్థవంతంగా ఉంటుంది. మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పరీక్షలను ప్రారంభించాం. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎల్ఈఎన్ఆర్ వ్యవస్థపై ఆసక్తి చూపుతున్నాయి. భవిష్యత్తులో తయారీని విస్తరిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్ఎల్ఈఎన్ఆర్ (లో-ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్) సాపేక్షంగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే అణు ప్రతిచర్యను నిర్ధారిస్తుంది. ఇది తక్కువ రేడియేషన్‌తో అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హెచ్వైఎల్ఈఎన్ఆర్ 7.2కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ల సామర్థ్యం వరకు పారిశ్రామిక, గృహ ఉపయోగం కోసం పేటెంట్ పొందిన హైబ్రిడ్ హీట్ సిస్టమ్‌లను కలిగి ఉంది.

ప్లాట్ల వేలం.. రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియ చేపట్టారు. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయానికి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు (Outer Ring Road) అతి సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.200– 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్‌కు రూ 30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు పోటీ పడ్డారు. కార్నర్ ప్లాట్లకు మంచి డిమాండ్ రేటు పలికింది. రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన 50 ప్లాట్లకు సంబంధించిన వేలంలో గరిష్టంగా చదరపు గజానికి రూ. 46,500 ధర పలికింది.చదవండి: ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం

ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్, ఇతర పెట్టుబడుల గురించి సూచనలు చేసే అమెరికా వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిట్‌కాయిన్ ఎవరినైనా ధనవంతులను చేస్తుంది. ఎలాంటి గందరగోళం లేదు, ఒత్తిడి లేదు. దాన్ని (బిట్‌కాయిన్) సెట్ చేసి మర్చిపో. నువ్వు ధనవంతుడైపోతావని అంటారు కియోసాకి. బిట్‌కాయిన్‌తో కోటీశ్వరులుగా మారడం చాలా సులభం అని మీరు చెబితే.. ఇన్ని లక్షల మంది పేదలు ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నకు.. నేనే దానికి ఉదాహరణ అంటూ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..నేను (రాబర్ట్ కియోసాకి) నా మొదటి మిలియన్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా రిస్క్ తీసుకున్నాను, చాలా సమయం పట్టింది. మొదటి మిలియన్ సంపాదించినా తరువాత.. బిట్‌కాయిన్ గురించి కొంత అధ్యయనం చేసి, అందులో కొంత పెట్టుబడి పెట్టి మర్చిపోయాను. అదే మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మిలియన్స్ సంపాదిస్తున్నాను, మీకు కూడా అదే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. అయితే జాగ్రత్తగా ఉండాలని అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.ANYONE CAN BECOME a MILLIONAiRE: I can’t believe how Bitcoin makes becoming rich so essy. Bitcoin is Pure Genius asset design. No mess no stress. Just set it and forget it. I made my first million in real estate. That took hard work, lots of risk, lots of money, lots of…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 6, 2025

త్వరలో యూఎస్ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్
యునైటెడ్ స్టేట్స్ నిర్దిష్ట దేశాల నుంచి కొంతమంది వీసా దరఖాస్తుదారులకు 12 నెలల వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని చూస్తుంది. వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని నిబంధనలు ఉపయోగించుకుంటూ, ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆగస్టు 20, 2025న ఈ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తేనున్నారు. దీని ప్రకారం..నిర్దిష్ట దేశాలకు చెందిన బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటక) వీసా దరఖాస్తుదారులు రిఫండబుల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు పుట్టిన దేశాన్ని బట్టి ఈ బాండ్ కోసం 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాలి. పెరుగుతున్న వలసలు, జాతీయ భద్రతపై ప్రమాదాన్ని గుర్తించి వీసా నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు.ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే దేశాలుఈ 12-నెలల వీసా బాండ్ పరిధిలోకి వచ్చే దేశాల వివరాలను ప్రాథమికంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.1. మలావి: ఈ దేశంలోని వారు బీ-1, బీ-2 కింద యూఎస్ వెళ్లాలంటే 15,000 డాలర్ల వరకు బాండ్ తీసుకోవాలి.2. జాంబియా: 15,000 డాలర్ల వరకు బాండ్ అవసరం.అమెరికా కొత్త వీసా ప్రోగ్రామ్ పరిధిలో ప్రస్తుతానికి భారత్ ఈ జాబితాలో లేదు. ఏదేమైనా ఈ పైలట్ ప్రోగ్రామ్‌లోని అంశాలను పరిగణించి క్రమంగా ఈ విధానాన్ని ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యూఎస్ అధికారులు సూచించారు.ఈ బాండ్ ఎలా పని చేస్తుంది?వీసా ఓవర్ స్టే(అధిక కాలంపాటు యూఎస్‌లో నివసించడం)ను నిరోధించడానికి, ప్రయాణీకులు వారి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఈ బాండ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కింద తెలుసుకుందాం.వీసా అప్రూవల్ తర్వాతే బాండ్ అవసరం అవుతుంది. దరఖాస్తుదారులు యూఎస్ ట్రెజరీ Pay.gov ప్లాట్పామ్ ద్వారా బాండ్ చెల్లింపులు చేయాలి.దరఖాస్తుదారులు తమ పుట్టిన దేశాన్ని బట్టి 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.వీసా నిబంధనలు పాటిస్తూ, వీసా గడువు ముగియకముందే అమెరికాను వీడే ప్రయాణికులకు బాండ్ పూర్తి రీఫండ్ లభిస్తుంది.వీసా హోల్డర్ తమ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే (అనధికార ఉద్యోగం లేదా వారి వీసా పరిధినిదాటి కార్యకలాపాలు సాగిస్తే) బాండ్ జప్తు చేసుకుంటారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయాణికులు నిర్దేశిత విమానాశ్రయాల ద్వారానే యూఎస్‌లోకి ప్రయాణం సాగించాలి.బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీఓఎస్)న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (జేఎఫ్‌కే)వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఏడీ)భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..ఓవర్ స్టే పరిమితంగానే..ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పరిమితంగానే ‘ఓవర్ స్టే రేట్లు’ కలిగి ఉన్నారని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గుర్తించింది. బాండ్ అవసరాలకు సంబంధించి భవిష్యత్తు నిర్ణయాలను ఈ డేటా ప్రభావితం చేస్తుంది.భవిష్యత్తు విస్తరణఈ కార్యక్రమం పైలట్ పీరియడ్‌లో భారతదేశాన్ని చేర్చలేదు. అయితే ఇది శాశ్వతం మాత్రం కాదు. భారతీయ బీ -1 / బీ -2 దరఖాస్తుదారులు త్వరలో బాండ్ చెల్లించాలని కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్అసలు యూఎస్ సమస్య ఏంటి?వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 2023లో యూఎస్‌లోకి వచ్చి అక్కడే నిలిచిపోతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా ఓవర్ స్టేలు హానికరం కానప్పటికీ, కొన్ని భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాటిని ట్రాక్ చేయడం కష్టం. సందర్శకులు, ఇతరులు సకాలంలో దేశం వదిలి వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ బాండ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. బాండ్ రీఫండబుల్.. సందర్శకులకు వీసా నిబంధనలను పాటించేలా చేస్తుంది.
ఫ్యామిలీ

ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!
ప్రముఖ అమెరికన్ నటి, ప్రొడ్యూసర్ కెల్లీ మాక్ (kelley mack) ప్రాణాంతకమైన కేన్సర్‌తో కన్ను మూసింది.అరుదైన మెదడు కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. చిన్న వయసులోనే నటిగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న కెల్లీ అకాల మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.జూలై 10, 1992న ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు కెల్లీ మాక్. ది వాకింగ్ డెడ్, 9-1-1 , చికాగో మెడ్ వంటి మూవీలతో బాగా పాపులర్ అయ్యారు. అందమైన చిరునవ్వు, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కరియర్ పీక్‌లో కొనసాగుతున్న సమయంలో, అరుదైన గ్లియోమా కారణంగా 33 ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కెల్లీ మాక్ సోదరి, కాథరిన్ క్లెబెనో ఇతర కుటుంబ సభ్యులు ఆమె మరణ వార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు.కెల్లీ మాక్ మరణ వార్త అభిమానుల హృదయాలను కలచి వేసింది. అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ , బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసిన తరువాత కూడా ఆమె చాలా ధైర్యంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆమె ప్రియుడు లోగన్ లానియర్ చాలా అండగా నిలిచాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అనుక్షణం తనకు తోడుగా ఉన్నాడని స్వయంగా కెల్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది జనవరిలో కెల్లీ తన గ్లియోమా వ్యాధి గురించి అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నారు."సెప్టెంబర్‌లో, నేను నా బాయ్‌ఫ్రెండ్ లోగన్తో కలిసి కొత్త అపార్ట్మెంట్లోకి మారాను. ఆ తర్వాత ఒక నెల పాటు, నడుము నొప్పి విపరీతంగా ఉంది. డిస్క్ జారిందనుకున్నాను. కొన్ని వారాల తర్వాత, నా కుడి క్వాడ్(తొడకు, మెకాలిపైభాగానికి మధ్యలో)లో న్యూరోపతిక్ పెయిన్, ఆపై, కాళ్ళు , వీపులో తట్టుకోలేనంత నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కొన్ని నెలలకు అరుదైన ఆస్ట్రోసైటోమా, డిఫ్యూజ్ మిడ్లైన్ గ్లియోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది’’గ్లియోమా అంటే ఏమిటి?గ్లియోమా అనేది మెదడు, వెన్నుపాములలో వచ్చే ఒక రకమైన కణితి. న్యూరోగ్లియా అని కూడా పిలిచే గ్లియల్ కణాల నుండి అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా, ఈ కణాలు నరాలకు మద్దతు ఇస్తాయి . కేంద్ర నాడీ వ్యవస్థ పనికి సహాయపడతాయి. అన్ని గ్లియోమాలు కణితులు కేన్సర్‌కు దారి తీయవు కానీ చాలా గ్లియోమాలు ప్రాణాంతకమైనవి.గ్లియోమాలు సాధారణంగా మెదడులో పెరుగుతాయి. కానీ వెన్నుపాములో కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఆస్ట్రోసైటోమా, గ్లియోబ్లాస్టోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా లాంటి అనేక రకాలు ఉన్నాయి. గ్లియోమా లక్షణాలు:గ్లియోమా లక్షణాలు కణితి ఎక్కడ ఉందో, పరిమాణం, కణితిఎంత వేగంగా పెరుగుతుందో దానిపై ఆధారపడి ఉంటాయి. నొప్పి, వాంతులు, దృష్టి సమస్యలు, బలహీనత, మూర్ఛలు సాధారణంగా కనిపించే లక్షణాలు. గ్లియోమా చికిత్స కణితి రకం, పరిమాణం, వచ్చిన ప్లేస్‌పై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ , కీమోథెరపీ లాంటి చికిత్సలు చేస్తారు. View this post on Instagram A post shared by Kelley Mack (@itskelleymack)

'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ' : నటి లిసా రే
‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్‌ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్ ఆఫ్ లిసా రే’ పేరిట బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటరాక్టివ్ సెషన్ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు. మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు. రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..)

సై అంటూ సత్తా చాటుతూ..!
డబ్బులు పొదుపు చేయడం, రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు గ్రామీణ మహిళా సంఘాలు. పెట్రోల్ బంక్‌ల నిర్వాహణ నుంచి ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని నడపడం వరకు తమ సత్తా చాటుతున్నారు. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు.’పెట్రోల్ బంక్’ అనగానే ‘పురుషులు మాత్రమే’ అన్నట్లుగా ఒక చిత్రం మదిలో ముద్రితమై ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మార్చేస్తున్నారు గ్రామీణ మహిళలు. ‘మేము సైతం’ అంటూ పెట్రోల్‌బంక్‌ల నిర్వాహణలో సత్తా చాటుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా’ గ్రామైక్య సంఘం మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకు వచ్చారు.రాష్ట్రంలోనే మూడోది...మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల బంక్ ఇటీవల నారాయణపేట జిల్లాలో మొదటిసారి ్ర΄ారంభమైంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. రాష్ట్రంలో మూడో పెట్రోల్ బంక్ లింగన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ్ర΄ారంభమైంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో గ్రామైక్య సంఘానికి నెలవారీ స్థిర ఆదాయం లభించనుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాలుసిరిసిల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సంఘాలు పొదుపు చేయడం, రుణాలు పొందడానికే పరిమితం కాకూడదని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా భావించారు. ‘ఇందిరా క్రాంతి’ పథం ద్వారా మహిళా సంఘాలకు ఆరు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. 192 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించగా 20లక్షల 25వేల 252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి శభాష్ అనిపించుకున్నారు. రూ.6.80 కోట్ల ధాన్యం కమీష¯Œ ను సాధించారు.రైతుల ముంగిట్లోకి ఎరువులువానకాలం సాగులో రైతుల ముంగింట్లోకే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మహిళలకు ఎరువుల దుకాణాలను అప్పగించారు. ఇలా 23 కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ప్రారంభించారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున ఎరువుల దుకాణాలను మహిళా సంఘాలకు అప్పగించారు.అద్దెకు ఆర్టీసీ బస్సులుమహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీకి సిరిసిల్ల జిల్లా నుంచి తొమ్మిది బస్సులను అందించారు. 9 మండలాల సమాఖ్యల ద్వారా రూ.6 లక్షల వాటా ధనంతో రూ.30 లక్షలతో ఒక్కో ఆర్టీసీ బస్సును మహిళలు అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల క్రితం మొదలైన అద్దె బస్సులతో ప్రతి నెల రూ. 50వేల అద్దెను తొమ్మిది సమాఖ్యలు పొందుతున్నాయి.ఇక సోలార్ పవర్పెట్రోల్ బంక్‌లే కాదు సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ముష్టిపల్లి, ధర్మారంలో భూసేకరణ పూర్తిచేయగా, జిల్లా సమాఖ్య ద్వారా రూ.3కోట్ల పెట్టుబడితో సోలార్ ΄్లాంట్లను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. – అవధూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్లఉపాధి పొందుతున్నాంమేము నాలుగు నెలల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశాం. మా వీవోకు రూ.4.29లక్షల కమిషన్ వచ్చింది. పదిమందికి పని లభించింది. ‘కుట్టు’తో స్వశక్తి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గత ఏడాదిగా స్వశక్తి మహిళలు జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. మా ఊళ్లో కూడా యూనిఫామ్స్ కుడుతున్నాం. ఇప్పుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాం.– పందిర్ల సునీత, ఆవునూర్ఎంతో గర్వంగా ఉందిపెట్రోల్ బ్యాంక్‌ల నిర్వహణ అనేది మా సంఘానికి సంబంధించి పెద్ద మలుపు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మేము గృహిణులుగా ఇంటికే పరిమితమయ్యాం. పెట్రోల్ బంక్ నిర్వహణను సవాల్‌గా తీసుకొని విజయవంతంగా కొనసాగిస్తామనే ధీమాతో ఉన్నాం. – సుభద్ర, అధ్యక్షురాలు, శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం, లింగన్నపేటమహిళా శక్తిని చాటారుఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాలు, ఆర్టీసీ బస్సులు ్ర΄ారంభించాం. త్వరలో రైస్‌మిల్లులు, సోలార్ ΄్లాంట్లను మహిళలకు అందజేస్తాం. – సందీప్‌కుమార్ ఝా, జిల్లా కలెక్టర్

సెలవంటే పండగ..ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బూ ఆదా ఇలా!
సెలవొచ్చిందంటే సువెన్ చక్ర ఇల్లు సందడిగా ఉంటుంది. బంధువులో, స్నేహితులో వస్తారని కాదు. సెల‘వంటే’ ఆ ఇంట పండగ. అవును.. వంటల పండగ. ఆ రోజు వంటకు కావాల్సిన కూరగాయలు, సరుకులు పొద్దున్నే తెచ్చుకోవడం మొదలు.. భోజనం అయ్యేదాకా ఇంటిల్లిపాది చేయిపడాల్సిందే. ‘అమ్మ చేతి వంట. భార్య చేతి వంట ఎప్పుడూ ఉండేదే.. రెస్టారెంట్‌కు వెళ్లి విందు ఆరగించడం, నిమిషాల్లో ఇంటికొచ్చే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లూ కొత్త కాదు. వారంలో ఒక్కరోజే అందరూ కలిసి ఉండేది. కాబట్టి సెల‘వంటే’ పండగ అని అంటారు చక్ర.సెలవు రోజును ఎలాగైనా ప్రత్యేకంగా మలుచుకోవాలి. ఆ మధుర క్షణాలు వారమంతా గుర్తుండాలి. సెలవు మళ్లీ ఎప్పుడొస్తుందా అని కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూడాలి. ఇదంతా సాధ్యం చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు దాటాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్.. అందరూ కలిసి ‘వంట’ చేయడమే. యస్.. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పైగా వారం వారం కొత్త రుచులను ఆస్వాదించే చాన్స్ వస్తే ఎవరు కాదనుకుంటారు? ఇంటర్నెట్ వచ్చాక వంట చేయడం చాలా సులభం అయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విహరించి కొత్త వంటకం నిర్ణయిస్తాం. ఉద్యోగం చేసే మగవాళ్లు సెలవు రోజు వంట చేయడం పాత కాన్సెప్ట్. ఇంటిల్లిపాదీ కలిసి వంట చేయడంలో కొత్త ట్రెండ్.అందరూ కలిసి..ఆడవాళ్లే వంట చేయాలన్న మూస పద్ధతికి స్వస్తి పలకాల్సిందే. కుటుంబం అంటేనే సమిష్టి బాధ్యత. కనీసం సెలవు రోజైనా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వంట చేస్తే? ఒక్కసారి చేసి చూడండి. ఆదివారం, సెలవు రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం మీ వంతు అవుతుంది. ఇలా అందరూ కలిసి వంట చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.తినేది తెలుస్తుందిబంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనూ, వారాంతాలు, పండుగలప్పుడు రెస్టారెంట్లకు వెళ్లడం పరిపాటి అయింది. వంట చేసే సమయం లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నారు. మనకు నచ్చినవి తింటున్నాం సరే.. ఆ ఆహారం ద్వారా చక్కెరలు, నూనెలనూ పరిమితికి మించి తీసుకుంటున్నాం. అలా కాకుండా మనమే వంట చేస్తే ఈ పదార్థాలను మితంగా వాడొచ్చు. ఇంట్లోని పిల్లలు, పెద్దలను అందరినీ దృష్టిలో పెట్టుకుని వంట చేస్తాం. అవసరమైతే ఉప్పూ, కారం తక్కువగా ఉన్నవి ముందు తీసిపెడతాం. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వాడకం మన చేతుల్లో ఉంటుంది. మితంగానూ వాడొచ్చు.. పూర్తిగా వాడకుండానూ ఉండొచ్చు. ఇంటిల్లిపాదికీ ఎంత ఆరోగ్యం!ఆరోగ్య ప్రయోజనాలుబయట ఎక్కువగా తిన్నా, ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఆర్డర్ చేసినా.. ఆ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ ఫుడ్‌లో రుచి కోసం ఏం కలిపారో తెలియదు. తాజాగా చేసిందో.. వేడి చేసి పంపిందో తెలీదు. ఏ నూనెలు వాడారో తెలియదు. అదే, ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే.. ఇంట్లో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్నవారికి తగినట్టుగా.. పిల్లలకు కూడా నచ్చినట్టుగా.. మనమే జాగ్రత్తగా ‘స్వయంపాకం’ చేసుకోవచ్చు. ఇంట్లోని అందరూ నిర్భయంగా ఇంటి ఫుడ్‌ని తీసుకోవచ్చు. అందరితో ఎంజాయ్ చేస్తూ రుచులు ఆస్వాదించొచ్చు.పరిమితాహారంఎంత రుచికరంగా ఉన్నా మితంగా తినాలన్నది పెద్దల మాట. మనం రెస్టారెంట్‌కి వెళ్లేటప్పుడు తెలియ కుండానే అపరిమితంగా తినేస్తాం. డబ్బులు పెట్టాం కదా అని టేబుల్ మీద మిగిలిన ఆహారాన్ని, లేదా స్విగ్గీ /జొమాటో ద్వారా ఇంటికి వచ్చిన ఫుడ్‌ను పాడేయకుండా ఆ కాస్తా మనమే లాగించేస్తాం. అంటే మన స్థాయికి మించి అతిగా తింటాం అన్నమాట. దాంతో అనారోగ్య సమస్యలూ మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే ఇంట్లో వంట అయితే ఎంత తినాలనేది మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా వండుకుంటాం. వృథా పోదు.. అపరిమితంగా మన పొట్టలోకీ పోదు.ఖర్చు తగ్గుతుందిరెస్టారెంట్లు గల్లీకి ఒకటి పుట్టుకొచ్చాయి. వినూత్న వంటకాలు, రుచులతో ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయి. ఖర్చూ అలాగే ఉంటోంది. నలుగురున్న కుటుంబానికి ఓ మోస్తరు రెస్టారెంట్లో భోజనానికి కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిందే. కానీ, కాస్త మనసు పెట్టి.. ఇంట్లోని అందరూ తలో చేయి వేసి వండిన భోజనం.. అంతకు మించిన రుచి అందిస్తుంది. పైగా రెస్టారెంట్లో అయిన ఖర్చులో సగం కూడా కాదు. ప్రతీవారం రెస్టారెంట్‌కు వెళ్లే కుటుంబం నెలకు ఎంతకాదన్నా ఓ రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చన్న మాట.బంధాలు బలంగాఈ సెల‘వంట’ద్వారా అందే అతి ముఖ్యమైన రహస్య పోషకాహారం.. బంధాలు మరింత బలపడటం. భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంట్లో వంట చేయడం, కలిసి తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఒకవేళ అప్పటివరకూ నామమాత్రంగా ఉంటే.. బలంగా అతుక్కోవడం మొదలవుతుంది. పని ఒత్తిడితో అలసిపోయిన వారికి ఇదో మంచి స్ట్రెస్ బస్టర్ అవుతుంది. పిల్లలకు పనులు అలవాటవుతాయి. కూరగాయలు, సరుకులపై అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అలవడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు కరువవుతున్న నేటి రోజుల్లో.. ప్రతివారం వంటతో పండగ చేసుకుంటే.. కుటుంబ బలం పెరుగుతుంది.షరతు: వంట చేస్తున్నంతసేపూ.. దాన్ని తృప్తిగా ఆస్వాదిస్తున్నంతసేపూ.. స్మార్ట్ ఫోన్‌ని (వంటల కోసం చూడాల్సి వస్తే తప్ప) దూరంగా పెడితే.. ఈ వంటకి మరింత ప్రేమానుభూతుల ‘రుచి’ చేకూర్చిన వాళ్లవుతారు. ఇదీ చదవండి: లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిశె గింజలు అద్భుతః
ఫొటోలు
అంతర్జాతీయం

‘నన్ను నాశనం చేసి.. లక్షలమందిని చంపి..’:పుతిన్ రహస్య కుమార్తె సంచలన వ్యాఖ్యలు
మాస్కో: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్(22) పలు సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్నాడని ఎవరిపేరు చెప్పకుండానే వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు క్రెమ్లిన్(రష్యాన్ ప్రభుత్వ అధికార నివాసం) అధినేతపైనే అని మీడియా చెబుతోంది.జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ టెలిగ్రామ్ చానల్లో ఎలిజవేటా క్రివోనోగిఖ్ వరుస పోస్ట్‌లను ఉంచారు. వాటిలో ఆమె ‘నా ముఖాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించడం అనేది నాకు విముక్తినిస్తుంది. నేను ఎవరో.. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది నాకు గుర్తు చేస్తుంది’ అని పేర్కొంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఆమె ఖాతా మాయమయ్యింది. 2003లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన క్రివోనోగిఖ్, పుతిన్, అతని మాజీ ఉద్యోగి స్వెత్లానా క్రివోనోగిఖ్ కుమార్తె అనే వాదన వినిపిస్తుంటుంది.2020లో రష్యన్ మిలియనీర్ స్వెత్లానా క్రివోనోగిఖ్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సమయంలో ఎలిజవేటా క్రివోనోగిఖ్ రష్యన్ అధ్యక్షుడి రహస్య కుమార్తె అని కనుగొన్నట్లు స్వతంత్ర మీడియా సంస్థ ప్రోక్ట్ పేర్కొంది. స్వెత్లానా క్రివోనోగిఖ్ ఈ సంపదను రష్యన్ నాయకుని ద్వారా పొందారనే ఆరోపణలున్నాయి. స్వెత్లానా కుమార్తెకు పుతిన్ పోలికలున్నాయని ప్రోక్ట్ పేర్కొంది. అయితే, క్రెమ్లిన్ ఈ వాదనను తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఎలిజవేటా క్రివోనోగిఖ్ జనన ధృవీకరణ పత్రంలో ఆమె తండ్రి పేరు లేదు. 2021లో జరిగిన ఒక ఆడియో ఇంటర్వ్యూలో, ఎలిజవేటా క్రివోనోగిఖ్.. పుతిన్‌తో తనకున్న పోలికలను ధృవీకరించలేదు. తిరస్కరించనూలేదు.

ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాకు మద్దతుగా పాక్, చైనా సైనికులు: జెలెన్స్కీ
కీవ్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున చైనా, పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయని వ్యాఖ్యానించారు. వీరందరిపై తమ సైన్యం పోరాటం చేస్తోందని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్బంగా జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యాకు పలు దేశాలు సహకరిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి సైనికులు వస్తున్నారు. చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్‌తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు మా దేశ దళాలు గుర్తించాయి. ఇందుకు ఉక్రెయిన్ సైన్యం నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఇదే సమయంలో యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.అలాగే, వోవ్‌చాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఫ్రంట్‌లైన్‌లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బ్రిగేడ్లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.Today, I was with those defending our country in the Vovchansk direction – the warriors of the 17th Separate Motorized Infantry Battalion of the 57th Brigade named after Kish Otaman Kost Hordiienko.We spoke with commanders about the frontline situation, the defense of… pic.twitter.com/40XsGHZU0T— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2025మరోవైపు.. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలను పాక్ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెలెన్స్కీ ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు ఉక్రెయిన్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలో జెలెన్స్కీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. మరోవైపు.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. రష్యాకు ఆయుధాలను, సైనికులను పంపిస్తోంది.

Ireland: ఇండియన్ డ్రైవర్‌పై జాత్యహంకార దాడి.. బాటిల్‌తో తలపై కొట్టి..
డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో భారతీయ టాక్సీ డ్రైవర్ లఖ్వీర్ సింగ్ జాత్యహంకార దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు లఖ్వీర్ సింగ్ తలపై రెండుసార్లు బాటిల్‌తో దాడి చేశారు. కస్టమర్ల పేరుతో లఖ్వీర్ సింగ్ క్యాబ్లోకి ఎక్కిన ఇద్దరు యువకులు లఖ్వీర్ సింగ్‌పై దాడికి దిగారు. గడచిన రెండు వారాల్లో ఐర్లాండ్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై జరిగిన మూడవ దాడి ఇది.ఐర్లాండ్‌లోని డబ్లిన్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్లిన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం లఖ్వీర్ సింగ్ గత 23 ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్నాడు. పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి, లఖ్వీర్ సింగ్ తన క్యాబ్‌లో 20 ఏళ్ల వయసుగల గల ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. పాపింట్రీ వద్ద తమను దింపాలని వారు సింగ్‌కు చెప్పారు. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకున్నాక ఆ ఇద్దరు యువకులు సింగ్‌పై దాడికి దిగి, బాటిల్‌తో అతని తలపై కొట్టారు. అక్కడిని నుంచి వారు పారిపోతూ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపో’ అని గట్టిగా అరిచారని సింగ్ తెలిపారు.దాడిలో తీవ్రంగా గాయడిన లఖ్వీర్ సింగ్‌కు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సింగ్ అత్యవసర సహాయం 999కి డయల్ చేశాడు. వారి సాయంతో ఆస్పత్రికి చేరుకున్నాడు. ఈ ఘటన తరువాత లఖ్వీర్ సింగ్ తీవ్రంగా కుంగిపోయాడు. టాక్సీ డ్రైవర్‌గా తిరిగి కొనసాగడం చాలా కష్టమని భావిస్తున్నాడు. గడచిన పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని సింగ్ వాపోయాడు. ఈ ఘటన దరిమిలా తమ కుటుంబ సభ్యులు ఎంతో భయపడుతున్నారని అన్నాడు. ఆగస్టు ఒకటిన రాత్రి సుమారు 11:45 గంటలకు డబ్లిన్ 11లోని పాపింట్రీలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల ఒక వ్యక్తిని చికిత్స కోసం బ్యూమాంట్ ఆసుపత్రికి తీసుకువచ్చారని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని స్థానిక పోలీసులు తెలిపారు.

చలో అమెరికా అంటున్న భారతీయులు.. పరుగులు తీస్తున్న ఈబీ–5
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇప్పుడున్న ఈబీ–5 వీసా స్థానంలో ట్రంప్ తెస్తానన్న ‘గోల్డ్ కార్డ్’ నేటికీ పట్టాలెక్కలేదు. కానీ, అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం చేసే ఈబీ–5 దరఖాస్తులు రయ్యిన దూసుకుపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేనంతగా మనదేశం నుంచి ఎక్కువ సంఖ్యలో ఈబీ–5 వీసాకు దరఖాస్తులు వెళ్లాయి.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక విద్యార్థి, తాత్కాలిక వర్క్ వీసాలపై నియంత్రణలు కఠినతరం కావటానికి ముందు.. 2024 ఏప్రిల్ నుండే ఈబీ–5 వీసాలకు డిమాండ్ పెరిగినట్లు వాషింగ్టన్‌లోని అమెరికన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ అలయెన్స్ (ఎ.ఐ.ఐ.ఎ.) డేటా చెబుతోంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే (2024 అక్టోబర్–2025 జనవరి. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30తో ముగుస్తుంది) 1,200 మందికి పైగా భారతీయులు ఈబీ–5 వీసా కోసం ఫామ్ ఐ–526ఈ దరఖాస్తు చేశారు. ఈ సంఖ్య 2023 మొత్తం ఏడాది సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.శాశ్వత నివాసానికి హామీఈబీ–5 వీసాకు డిమాండు పెరగటానికి హెచ్1–బి, గ్రీన్ కార్డ్ సహా ఇతర ఇమిగ్రేషన్ కేటగిరీల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటమూ ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పలు అంచనాల ప్రకారం, ప్రస్తుతం యూఎస్‌లో కోటీ 10 లక్షలకు పైగా ఇమిగ్రేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాశ్వత నివాసానికి ఈబీ–5 వీసా ఒక వేగవంతమైన, నమ్మకమైన హామీగా మారిందని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ఇన్వెస్ట్ ఇన్ ది యూఎస్ఏ (ఐ.ఐ.యూఎస్ఏ) ఆధ్వర్యంలోని వాషింగ్టన్ ప్రాంతీయ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం సమాచారం ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో (2023 అక్టోబర్ –2024 సెప్టెంబర్) భారతీయులకు 1,428 ఈబీ–5 వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 815 మాత్రమే.ప్రాంతాన్ని బట్టి పైకం..1992 నుంచి అమెరికా ఈబీ–5 వీసాలను ఇవ్వటం ప్రారంభించింది. అమెరికన్లకు ఉద్యోగాల సృష్టి కోసం వీటిని సృష్టించారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతం లేదా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో (టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా – టి.ఇ.ఎ.) 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.88 కోట్లు), తక్కిన ప్రాంతాల్లో కనీసం 10.50 లక్షల డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) పెట్టుబడి పెట్టే వలసదారులకు ఈబీ–5 వీసా (గ్రీన్ కార్డులు) ఇస్తారు. ఈ వీసా ఉంటే.. పెట్టుబడి పెట్టేవాళ్లు, వారి జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు ఉండే వారి పెళ్లికాని పిల్లలకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. త్వరలో వీటిని.. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తారు.అమెరికాలో నుంచే దరఖాస్తుహెచ్–1బీ వీసాలపై ఉన్న విద్యార్థులు, పని చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులు తమ దేశానికి వెళ్లకుండానే ఈబీ–5ను అమెరికాలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం యూఎస్‌లో హెచ్–1బీ లేదా విద్యార్థి వీసా వంటి వలసేతర హోదాలపై ఉన్న భారతీయ పౌరులు, కొత్త నిబంధనల ప్రకారం ఐ–526ఈ ఫారం దాఖలు చేసిన సమయం నుండి 3–6 నెలల్లోపు వర్క్, ట్రావెల్ పర్మిట్లను పొందటం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ పర్మిట్ సాధారణంగా వారి ఈబీ–5 గ్రీన్ కార్డ్ ఆమోదం పొందేవరకు చెల్లుబాటులో ఉంటుంది.ఈబీ-5 వీసా..కనీస పెట్టుబడి టి.ఇ.ఎ.లకు రూ. 6.88 కోట్లు, నాన్–టి.ఇ.ఎ.లకు రూ.9 కోట్లు. కనీసం 10 ఫుల్ టైమ్ ఉద్యోగాల కల్పన జరగాలి. 2027 వరకు చట్టబద్ధమైన భరోసా. యూఎస్‌లో ఉన్న భారతీయులు అక్కడి నుండే దరఖాస్తు చేసుకోవచ్చుట్రంప్ గోల్డ్ కార్డు.. రూ. 43.5 కోట్లు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి.విధి విధానాలు ఖరారు కాలేదు.చట్టం రూపొందలేదు.
జాతీయం

ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి, మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకుగాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. మంగళవారం 11వ పాయింట్లో సిట్ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం. సోమవారం 10వ పాయింట్ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో మంగళవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా? అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్లో రెండున్నర గంటల పాటు ఆరు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తరువాత ఆ గుంతను పూడ్చివేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్లో తవ్వకాలు చేపట్టగా, భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది. కార్మికులు మట్టిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా ఆరు పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. 13వ పాయింట్లో తవ్వాల్సి ఉంది.

డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి తాత్కాలిక స్వేచ్ఛ లభించింది. కోర్టు 40 రోజుల పెరోల్మంజూరు చేయడంతో మంగళవారం హరియాణా రాష్ట్రం రొహతక్‌లోని జైలు నుంచి బాబా బయటకు వచ్చారని లాయర్ జితేందర్ ఖురానా తెలిపారు. సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలోనే ఆయన వచ్చే 40 రోజులు గడపాల్సి ఉంటుందన్నారు. డేరా వద్దకు ఎవరూ రావద్దంటూ అనుచరులనుద్దేశించి విడుదల చేసిన వీడియోలో బాబా కోరారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో కోర్టు డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లోనూ ఆయన ఫర్లో, పెరోల్‌పై బయటకు వచ్చారు. తాజా పెరోల్తో కలిపితే ఈ ఏడాది దాదాపు మూడు నెలలపాటు జైలు బయట గడిపినట్లవుతుంది. 2024, 2022 సంవత్సరాల్లోనూ ఆయనకు కోర్టు ఫర్లా వెసులుబాటు కలి్పంచింది. 2017లో జైలుకు వెళ్లిన తర్వాత కనీసం 13 సార్లు ఆయన బయటకు వచ్చారు. డేరా సచ్ఛా సౌదాకు హరియాణా, పంజాబ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో అనుచరులున్నారు.

కల్యాణ్ బెనర్జీ రాజీనామా ఆమోదం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అసమ్మతి గళాలను ఆ పార్టీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ సమరి్పంచిన రాజీనామాను ఆమె ఆమోదించారు. ఆవెంటనే, కల్యాణ్ బెనర్జీ స్థానంలో కకోలీ ఘోష్‌కు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభలో పార్టీ ఉపనేతగా శతాబ్ది రాయ్‌ను నియమించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసమ్మతిని, తిరుగుబాటు వైఖరిని సహించే ప్రసక్తేలేదని దీనిద్వారా ఆమె చెప్పకనే చెప్పినట్లయింది.‘పార్టీ కంటే తామే మిన్న అని భావించే వారికి ఇదో హెచ్చరిక. వారికి ఇటువంటి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’అని టీఎంసీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిõÙక్ బెనర్జీకి లోక్‌సభలో పార్టీ నేతగా సోమవారం బాధ్యతలు అప్పగించడం తెల్సిందే. పార్లమెంట్ సమావేశాలకు సరిగ్గా రాని ఎంపీలను వదిలేసి, తనది సమన్వయ లోపమని టీఎంసీ చీఫ్ మమత తప్పుబడుతున్నారంటూ కల్యాణ్ బెనర్జీ సోమవారం బహిరంగంగా వ్యాఖ్యానించడం తెల్సిందే. కొంతకాలంగా కల్యాaణ్ బెనర్జీ, పార్టీకే చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రాలు మధ్య సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం.

గురూజీకి కన్నీటి వీడ్కోలు
నెమ్రా: జార్ఖండ్ ముక్తిమోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తమ గురూజీకి కన్నీటి వీడ్కోలు పలికారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిబూ సోరెన్ సోమవారం ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.పార్దివదేహాన్ని తొలుత ఢిల్లీ నుంచి విమానంలో జార్ఖండ్ రాజధాని రాంచీకి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీలో శిబూ సోరెన్ పార్దివదేహం వద్ద గవర్నర్ సంతోష్ గంగ్వార్, స్పీకర్ రవీంద్రనాథ్ మహతో, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులరి్పంచారు. అనంతరం రామ్‌గఢ్ జిల్లాలోని శిబూ సోరెన్ స్వగ్రామం నెమ్రాకు భౌతికకాయాన్ని తరలించారు. కడసారి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. గురూజీ అమర్ రహే అంటూ నినదించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి వందనం సమర్పించారు. శిబూ సోరెన్ చితికి ఆయన పెద్ద కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిప్పంటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాలేకపోయారు. వారు తొలుత విమానంలోని ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు.అక్కడి హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దాంతో రోడ్డు మార్గంలో సాయంత్రం కల్లా నెమ్రాకు చేరారు. హేమంత్ సోరెన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు జార్ఖండ్ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాపం దినాలు ప్రకటించింది. మంగళవారం జార్ఖండ్‌లో పాఠశాలలు మూసివేశారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు సైతం నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఎన్ఆర్ఐ

మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్బోర్న్లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్‌లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనతీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.

తెలంగాణ స్ఫూర్తిని చాటుతూ అమెరికాలో కొత్త చాప్టర్లు ప్రారంభించిన జీటీఏ
న్యూజెర్సీ/న్యూయార్క్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (GTA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. జూలై నెలలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్సిప్పనీ మేయర్ జేమ్స్ ఆర్ బార్బెరియో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జీటీఏ ఫౌండర్స్ అలుమల మల్లారెడ్డి (ఇండియా ఛైర్మన్), విశ్వేశ్వర్ రెడ్డి (అమెరికా ఛైర్మన్) అతిథులను ఆత్మీయంగా సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో ఆహ్లాదంగా సాగిన ఈవెంట్లో కపిడి శ్రీనివాస్ రెడ్డి జీటీఏ న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జీటీఏలో భాగమవడం ఒక గౌరవం. అమెరికాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా జీటీఏ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు.ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ప్రముఖులు టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, యూఎస్ జీటీఏ ప్రెసిడెంట్ బాపు రెడ్డి, చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్, న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి ముసుగు, పృథ్వీ రెడ్డి, వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ అలుమల మల్లారెడ్డి మాట్లాడుతూ.. “జీటీఏ మూడేళ్ల క్రితం ప్రారంభమై అప్పుడే 43 దేశాలకు విస్తరించింది. డిసెంబర్లో విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మా టీం అందరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ ఎన్నారై తమ సొంత గ్రామానికి కనెక్ట్ చేసే విధంగా జీటీఏ సంస్థ ప్రయత్నిస్తుంది. సొంత గ్రామానికి, ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. రాజకీయాలను సైతం మార్చే శక్తిగా మారాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎన్నారైల పిల్లలు కూడా పాటించడం, సొంత గ్రామానికి నాయకులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, మన యువతకు మద్దతుగా నిలవడం వంట కార్యక్రమాలు చేపడతాం.” అని తెలిపారు. జీటీఏ ఫౌండర్, అమెరికా ఛైర్మన్ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ఎన్నారైలందరిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ప్రారంభించాము. మూడేళ్లలోనే జీటీఏ 43 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక రంగాల్లో ఒక చోటికి తీసుకు వస్తోంది జీటీఏ..” అని చెప్పారు.టీటీఏ అమెరికా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, “జీటీఏతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిసెంబర్ 10న అమెరికాలో, డిసెంబర్ 25న హైదరాబాద్‌లో టీటీఏ దశాబ్దోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అలాగే వచ్చే జూలైలో చార్లెస్‌లో జీటీఏ కన్వెన్షన్ ఉంటుందని, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం” అన్నారు.జీటీఏ కో ఫౌండర్ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, “న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ల ప్రారంభం ఒక మంచి మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలకు ఒక సమర్థవంతమైన వేదికగా జీటీఏ నిలుస్తోంది. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తాం” అన్నారు.జీటీఏ: ఒక ఉద్యమం – ఒక వ్యవస్థజీటీఏ ప్రారంభమైన మూడేళ్లలోనే 43కి పైగా దేశాల్లో విస్తరించింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, సాంస్కృతిక అభివృద్ధి, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ పౌరుడి గొంతును ప్రపంచమంతా వినిపించాలనే సంకల్పంతో జీటీఏ ఫౌండర్స్ విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. "జీటీఏ పేరు కాదు – ఇది ఒక సామాజిక శక్తి, ఒక సేవా వ్యవస్థ" అని నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని రాష్ట్రాలలోనూ జీటీఏ కార్యకలాపాలు విస్తరించడం లక్ష్యంగా జీటీఏ బృందం ముందుకు సాగుతోంది.

ఎవరీ లండన్ చాయ్‌వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.

థాయ్-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ
థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని..ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్‌లాండ్ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్‌కాల్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్ వెచయాచై థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్‌మైన్ పేలడంతో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్ కంబోడియన్ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది.
క్రైమ్

Cable Bridge: బర్త్ డే రోజే..
హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని హాస్టల్‌కు బైక్‌పై తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కేక్ కట్ చేసిన అరగంటకే యువకుడు మృత్యువాత పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముక్కురాళ్ల గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనిల్ (23) అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సమీపంలో ఉన్న మైండ్ మ్యాప్స్ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్‌లో ఎడిటింగ్ పనిచేస్తుంటాడు. మంగళవారం పుట్టినరోజు కావడంతో అనిల్ తన స్నేహితులు జాన్‌పాల్, మహేష్ నాగరాజు, వెంకటేష్ భాను తదితరులతో కలిసి బైక్‌లపై సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. తమతో పాటు తెచ్చుకున్న కేక్‌ను అనిల్ కట్ చేసిన అనంతరం స్నేహితులంతా అక్కడే సరదాగా గడిపి తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయలుదేరారు. ఈ క్రమంలో జాన్‌పాల్ బైక్ నడుపుతుండగా అనిల్ వెనుక కూర్చొన్నాడు. మిగతా స్నేహితులంతా ఎవరి బైక్‌లపై వారు అనుసరించారు. అనిల్ ఎక్కిన బైక్‌ను జాన్‌పాల్ అధిక వేగంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 ఫ్లైఓవర్ వైపు దూసుకెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. దీంతో అనిల్ కిందపడగా కొద్ది దూరం వరకు రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న జాన్‌పాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెనుక వస్తున్న స్నేహితులంతా తల పగిలి రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న అనిల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు కావడంతో అంతకు ఆరు గంటల ముందే వీరు హాస్టల్లోనే మద్యం సేవించినట్లు పోలీసుల అదుపులో ఉన్న జాన్‌పాల్ వెల్లడించారు. జాన్‌పాల్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా మద్యం సేవించినట్లుగా నమోదైంది. అర్ధరాత్రి మద్యం మత్తులో అదుపుతప్పిన వేగంతో బైక్‌పై దూసుకెళ్తుండడంతో మలుపు వద్ద కంట్రోల్ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేబుల్ బ్రిడ్జి వద్ద నుంచి బయలుదేరే ముందు అనిల్ తన బర్త్ డే కేక్‌ను చేతిలో పట్టుకొని బైక్‌పై కూర్చోగా ఈ ప్రమాదంలో అనిల్ కిందపడ్డ తర్వాత కేక్ రోడ్డంతా చిందరవందరగా పడిపోయింది. బర్త్ డే రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల రోదనలకు అంతులేకుండాపోయింది. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన జాన్‌పాల్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తేజ్ నేను ఎవరితో మాట్లాడలేదురా..!
కరీంనగర్: ‘తేజ్ నేనెవరితో మాట్లాడలేదు. ఆ దేవుడు, కొడుకు, మా అమ్మ.. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మన పెళ్లయినప్పటి నుంచి ఇంతవరకు నేనెవరితోనూ మాట్లాడలేదు. ఎవరితోనూ నాకు సంబంధం లేదు. నా కొడుకును బాగా చూసుకో. నీ వేధింపులతో నాకు పిచ్చిపడుతోంది. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. నా ఫోన్ చూడు నిజం తెలుస్తుంది’ అని భర్తనుద్దేశించి సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం తాడికల్‌లో చోటుచేసుకుంది. ఆమె సెల్ఫీ వీడియో చూసిన బంధువులందరూ కన్నీరుమున్నీరయ్యారు. కేశవపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. తాడికల్‌కు చెందిన గొట్టె శ్రావ్య (27) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసమున్నారు. అప్పుడే బాబు జన్మించాడు. రెండున్నర సంవత్సరాల క్రితం ధర్మతేజ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య తాడికల్‌లోనే ఉంటోంది. కొంతకాలంగా ధర్మతేజ్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి వేరే వారితో మాట్లాడుతున్నావంటూ శ్రావ్యను మానసికంగా హింసించాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ మాధవి, గ్రామీణ సీఐ వెంకట్, ఎస్సై పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సురేఖ శవపంచనామా నిర్వహించారు. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

అత్తపై అల్లుడి అత్యాచారం..!
తానూరు(ముధోల్): అత్త చేతిలో అల్లుడు హతమైన సంఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడలో చోటు చేసుకుంది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్‌నగర్‌కు చెందిన షేక్‌నజీమ్(45) కుటుంబం పదేళ్ల క్రితం ముధోల్ మండలంలోని తరోడలో నివాసం ఉంటోంది. ఇటుకబట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నజీమ్ అత్తగారైన రహీమున్నీసా వారితో కలిసి ఉంటోంది. వర్షాకాలం కావడంతో ఇటుకల తయారీ పనిలేక పోవడంతో మృతుని భార్య షేక్ సాహెబి ఈనెల 2న శనివారం మహారాష్ట్రలోని శివాని గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లింది. ఈ నెల 4న తెల్లవారు జామున నజీమ్ మద్యం సేవించి వచ్చి అత్తను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం మత్తులో ఉన్న నజీమ్ మళ్లీ ఆమెతో గొడవపడడంతో కర్రతో తలపై దాడిచేసి గొంతునులిమి హత్య చేసింది. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం సీఐ మల్లేశ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య షేక్ సాహెబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు రహీమున్నీసాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.