ప్రధాన వార్తలు

ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై 'టీడీపీ గూండాయిజం'
గుడివాడ రూరల్/గుడివాడ టౌన్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్‌రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై రివాల్వర్ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్‌పర్సన్, అమె భర్త, వైఎస్సార్సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఉప్పాల హారికతో ఫోన్లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్‌ను అడ్డుకుని వీరంగంగుడివాడలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్టరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది.

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, 1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు

విద్యారంగంపై విషపు చూపు!
ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్ బాస్ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్ ప్లస్ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్ మీద ప్రయోగించిన బంకర్ బస్టర్ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్’ అనే మరో గిన్నీస్ బుక్ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్ రికార్డు బ్రేకింగ్ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్ యాక్షన్ ప్లాన్. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్మోహన్రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్ టీచర్ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్మోహన్ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని.. వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక నియంతృత్వంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? అని సందేహం కలిగే స్థాయికి అది చేరింది. ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరినీ కూడా ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి.. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు.. పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చి యార్డు ‘దారుణంగా ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చి యార్డును సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపైనా కేసు పెట్టారు. జూన్ 11, 2025. ప్రకాశం జిల్లా పొదిలి ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే మూడు కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.జూన్ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. ఐదు కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జూలై 9, 2025. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా ఐదు కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. టార్గెట్ పెట్టుకున్న వారందరిపై కేసులు ప్రతి కేసుకు సంబంధించి ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్బంధం విధిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. అలాంటి మా పార్టీని.. సీఎం చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అణిచి వేసే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్ పీపుల్ వాయిస్‌ను నొక్కేస్తున్నారు. అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు.. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు.. అన్న విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...మీ అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యతతో మెలగుతారు. ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి. దూరపు బంధువుల సూచనలు పాటిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. తెలుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.వృషభం...విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.మిథునం...ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.కర్కాటకం...ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.సింహం....అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.కన్య....వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.తుల....కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.వృశ్చికం...చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత గులాబీ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.ధనుస్సు...రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. పనుల్లో ప్రతిబంధకాలు. మీపై ఆధిపత్యానికి ప్రత్యర్థులు యత్నిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మకరం...ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులు, ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. కళాకారులకు నూతనోత్సాహం.వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కుంభం...ఇంతకాలం పడిన శ్రమ అనుకూలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ముఖ్యుల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.మీనం...బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ నిర్ణయాలు ధైర్యంగా వెల్లడిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాల అందుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. నీలం, పసుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.

కలయిక సరే... లాభం ఎవరికి?
జూలై 9 నాటి, సాక్షి పత్రిక సంపా దకీయం– ‘ఠాక్రే సోదరుల యుగళం’ చదివాక, మరిన్ని వాస్తవాలు తెలియ జేయటానికి ఈ విశ్లేషణ. మరాఠీ అస్మిత (ఉనికి), మరాఠీ యువత ఉద్యోగావకాశాల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా 1966 జూన్ 19న ఏర్పాటైన శివసేన ‘మరాఠీ మానసాంచా హక్ ఆని న్యాయ సాఠీ’ (మరాఠీ వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం) అనే నినాదం ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. భూమి పుత్రుల (సన్స్ ఆఫ్ సాయిల్) ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ, చట్ట సభలో వారి గొంతు వినిపించాలని మొదట ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు, తర్వాత విధాన స¿ý కు ప్రతినిధులన పంపటంతో రాజకీయాలతో ప్రమేయం లేని శివసేన, రాజకీయ రంగు పులుముకుంది. 1960, 1970 దశకాలలో కమ్యూనిస్టులకు నిలయం బొంబాయి నగరం అనేవారు. శివసేన రాకతో క్రమేణా కమ్యూనిస్టులు ఈ నగరంలో తెరమరుగు కావటం అప్పట్లో కాంగ్రెసుకు కూడా కలిసొచ్చింది. 1984 నుండి రైట్ వింగ్ జాతీయ పార్టీ అయిన భాజపాతో చేతులు కలిపిన శివసేన 1995లో కాషాయ కూటమితో మహారాష్ట్రలో (శివ షాహి) అధికారం చేజిక్కించుకుని, రాష్ట్రంలో కాంగ్రెసుకు ముఖ్య విరోధిగా ఎదిగింది. సుమారు నాలుగు దశాబ్దాలు పార్టీ అధినేత బాలా సాహెబ్ ఠాక్రే, సర్వం తానై పార్టీని రిమోట్ కంట్రోల్ శైలిలో, పకడ్బందీగా నడిపించారు (అడపా దడపా వలసలు మినహా). బాల్ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ కొడుకు స్వరరాజ్. ఈయన్నే రాజ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుండీ సాహెబ్‌తో చనువుగా ఉండేవాడు. తొమ్మిది పదేళ్ల ప్రాయం నుండే అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పార్టీ మీటింగుకు తరచుగా హాజరయ్యేవారు బాల్ ఠాక్రే. పెద నాన్న ముఖ కవళికలు కలిగిన రాజ్ ఆయనలాగే పొలిటికల్ కార్టూన్లు గీయటం హాబీగా చేసుకున్నారు. బాలా సాహెబ్ హావ భావాలు, ఆయన ఉపన్యాస శైలి, బాడీ లాంగ్వేజ్‌ను అప్పటినుండే పుణికిపుచ్చుకున్న రాజ్‌ను, కాలేజీ రోజుల్లోనే శివసేన విద్యార్థి విభాగం ‘భారతీయ విద్యార్థి సేన’ చీఫ్‌గా నియమించి రాజకీయ సెలయేటిలోకి దించారు బాలా సాహెబ్. 1990 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధినేతకు కుడి భుజంగా మెదిలిన రాజ్‌ను... మున్ముందు అతడే పార్టీ పగ్గాలు చేపట్టే సాహెబ్ వారసుడు అని అప్పట్లో కార్యకర్తలు చెప్పు కోసాగారు. మరాఠీ యువతకు కొత్త ఒరవడి చూపిస్తూ, పార్టీ లోకి వారిని చేర్చుతూ నవ చైతన్యం ప్రోదిచేశారు రాజ్. అయినా, పుత్ర వాత్సల్యం ప్రభావమో, మరే కారణమో తెలియదు కానీ రాజకీయాలకు బహుదూరంగా ఉన్న తన చిన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రేను 2002 నుండి రాజకీయాల వైపు మరల్చటం మొదలెట్టారు బాలా సాహెబ్. 2003లో జరిగిన శివసేన కార్యకర్తల శిబిర్‌లో ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారాయన. అది రాజ్‌కు అస్సలు మింగుడు పడలేదు. ఆ లగాయతు పార్టీలో ఉద్ధవ్, రాజ్ మధ్య అంతర్గత యుద్ధం ముదిరింది. చివరికి 2005 నవంబర్‌లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, నాలుగు నెలల తర్వాత (మార్చి 2006) సొంత కుంపటి, ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ (ఎమ్ఎన్ఎస్) ఏర్పాటు చేసు కున్నారు రాజ్ ఠాక్రే. కానీ, రాజ్‌కు అనుకున్న ఫలితం దక్క లేదు. ఎమ్ఎన్ఎస్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 సీట్లతో ఖాతా తెరిచింది. అయితే శివసేన ఓట్లను చాలా వరకు చీల్చింది. ఆ తర్వాత 2014, 2019ల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై, మొన్నటి 2024 ఎన్నికల్లో 1.55 ఓటింగ్ శాతంతో ఆ ఒక్క సీటును సైతం పోగొట్టుకుంది. గత ఇరవై సంవత్సరాల నుండి ఉత్తర–దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఈ సోదరులు మొన్నటి (జూలై 5) హిందీభాష వ్యతిరేక ఉద్యమ విజయోత్సవ ర్యాలీలో ఒకే వేదిక పైకి వచ్చినప్పటికీ, రాజ్ ఠాక్రే వ్యవహార తీరులో అనుకున్న స్పందన కనిపించ లేదని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. రాజ్ దూకుడు వైఖరి, ఉద్ధవ్ నిదానమే ప్రధానం పద్ధతి వల్ల రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరుపార్టీలూ సీట్లు సర్దుబాటు చేసుకుని, ఓటర్ల ముందుకు రావటం క్లిష్ట సమస్యే కావచ్చు. అదీకాక, ఉద్ధవ్ కొడుకు, మాజీ మంత్రి ఆదిత్య; రాజ్ కొడుకు అమిత్ (మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు)ల రాజకీయ భవిష్యత్తులు కూడా ఈ కలయిక నేపథ్యంలో ఆలోచించాల్సిన మరో కోణం.కాంగ్రెస్ దోస్తీ పుణ్యమా అని శివసేన (ఉద్ధవ్) పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు చాలానే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి ఎమ్ఎన్ఎస్తో స్నేహం కారణంగా ఆ మైనారిటీ ఓట్లే కాక ఉత్తర భారతీయుల ఓట్లు కూడా మున్ముందు దూరం కావచ్చు. ‘రాజ్ ఠాక్రే బహిరంగ సభలో జనాన్ని ఆకర్షించవచ్చు కానీ, ఆయన భాషణ్ బ్యాలెట్ లోకి ఓట్లను తేలేద’ని సీనియర్ మరాఠా అధినేత, శరద్ పవార్ గతంలో ఒకసారి ఘంటాపథంగా చెప్పారు. అది వాస్తవం కూడా. ఏది ఏమైనా రాజ్ ఠాక్రే, తన అన్నయ్య ఉద్ధవ్‌తో రాజకీయ మైత్రి నెరపడానికి కారణం ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఓటు బ్యాంక్‌కు చెక్ పెట్టడమే కావచ్చు. అయితే ఈ కలయిక ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిని కూడా ఇరకాటంలో పడేసింది. చివరిగా, ఠాక్రే సోదరులు కలిసిపోయే ఎపిసోడ్‌కు స్క్రిప్ట్ రైటర్ రాష్ట్ర బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే అని అంటున్న స్థానిక విశ్లేషకుల మాటా గమనార్హమే!జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబైమొబైల్ : 98190 96949

ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్‌లు
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు.

Ahmedabad: ఒక ఆడియో.. పలు ప్రశ్నలు
వారాల తరబడి వేచి ఉన్నాక, ప్రాథమిక దర్యాప్తు జరిగాక నివేదిక వెలువడితే ఆ విమానప్రమాద రహస్యాలు బయటికొస్తాయని అందరూ ఆశించారు. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తాలూకు నివేదిక అందుకు భిన్నంగా మరిన్ని చిక్కుముడులు వేసేలా వెలువడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వేపై పరుగెత్తి ఆకాశంలోకి ఎగిరేదాకా పైలట్ల సంభాషణలు రికార్డయితే కేవలం ఒకటి, రెండు వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వాక్యాలు కూడా పైలట్ల స్రత్పవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ]ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్‌ను మరో పైలట్ అడగటం చూస్తుంటే మొదటి పైలట్ ఉద్దేశపూర్వకంగానే స్విచాఫ్ చేశాడనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచాఫ్ చేయలేదని అతని కరాఖండీగా చెప్పడం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్ ఆన్‌కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్ లోపాలు ఉండొచ్చనే అనుమానాలూ బలపడుతున్నాయి. అయితే స్విచింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచాఫ్ చేయడాన్ని గమనించి పైలట్ ఇంకొరిని ప్రశ్నించాడా ? అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రతీకార చర్యల్లో భాగంగా సరిహద్దు సమీప రాష్ట్రాల గగనతలాలపై ఎగిరే విమానాల కోఆర్డినేట్స్‌ను మార్చి, కూల్చేసేందుకు పాక్ సైబర్ దాడులను యత్నిస్తోందన్న కథనాల నడుమ ఈ నివేదిక విడుదలైంది. అయితే ఫ్యూయల్ స్విచ్‌ను ఎందుకు ఆఫ్ చేశావని ప్రశ్నించిన పైలట్ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేముందని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్ల పూర్వచరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలని ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీనీ ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది. అయితే పైలట్లను ఈ నివేదిక ఎక్కడా తప్పుబట్టకపోవడం విశేషం. అలా అని ఇది పూర్తిగా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్య కారణంగా జరిగిందనీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో ముగించింది. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్‌లను పొరపాటున ఆఫ్ చేశారా? లేదంటే స్విచింగ్ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది. మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమా? విమానం సెకన్ల వ్యవధిలో నేలరాలడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్ ఈ రెండు ఫ్యూయల్ స్విచ్‌లను ఒకేసారి ఆఫ్ చేయడం అసాధ్యమని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఫ్యూయల్ స్విచ్‌లను పొరపాటున ఆన్, ఆఫ్ చేయడం అంత సులభంకాదు. వీటికి లీవర్–లాక్‌లు ఉంటాయి. స్విచ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ భద్రతా ఫీచర్ ఉంది. ఇవికాకుండా ప్రొటెక్టివ్ గార్డ్ బ్రాకెట్స్ అనేవి కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్‌లు ఆన్/ఆఫ్ కాకుండా వాటిని ఈ బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో రెండు స్విచ్‌ల లీవర్లను ఒకేసారి పైకిలాగడం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్‌ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా వాటి పొజిషన్ మారి ఉంటుంది’’అని ఆ నిపుణుడు వివరించారు. 737 మోడల్లో లాకింగ్ ఫీచర్లో సమస్యలు! బోయింగ్ 737 రకం విమానాల్లో అమర్చిన ఫ్యూయల్ స్విచ్‌లకు లాకింగ్ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పెషల్ ఎయిర్‌వర్తీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను 2018 డిసెంబర్లో విడుదలచేసింది. అందులో బోయింగ్ 737లోని ఫ్యూయల్ స్విచ్‌లతో లాకింగ్ ఫీచర్ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమానసంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవరికీ తెలీదు. అయితే ఇదే స్విచ్ డిజైన్‌ను బోయింగ్ 787–8 రకం విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లో కూలిన వీటీ–ఏఎన్‌బీ విమానం ఈ రకానికి చెందినదే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని సిఫార్సుచేసింది. అయితే తనిఖీలకు ఎయిర్ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తోంది. మొత్తం ఆడియో ఎందుకు బయటపెట్టలేదు? నువ్వెందుకు స్విచ్ ఆఫ్ చేశావని ఒక పైలెట్‌ను మరో పైలట్ అడగడం, నేను ఆఫ్చేయలేదని అతను బదులివ్వడం తప్పితే మరే ఇతర ఆడియో వివరాలు బహిర్గతం చేయకపోవడం సైతం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ‘‘విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వే అటు కొనకు చేరుకుని రన్‌వేపై ప్రయాణించి, గాల్లోకి లేచి, కూలిపోయే చిట్టచివరి సెకన్ దాకా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం రికార్డ్ అయంది. అలాంటప్పుడు మొత్తం ఆడియోను విడుదలచేస్తే నిపుణులు విశ్లేషించి ప్రమాదంపై ఓ అంచనాకు రాగలరు. వాళ్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగల్గితే స్విఛ్‌లు ఆఫ్ కావడం అనేది మానవతప్పిదమా? ఉద్దేశపూర్వకమా? లేదంటే అవి పాడైపోవడంతో పనిచేయడం మానేశాయా? అనేవి స్పష్టంగా తెలుస్తాయి’’అని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ గోయెల్జ్ చెప్పారు. ఏమిటీ ఇంధన స్విచ్‌లు విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్‌పిట్‌లోని ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’లతోనే నియంత్రిస్తుంటారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్ విఫలమైతే మాన్యువల్‌గా రీస్టార్ట్, లేదా షట్‌డౌన్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. టేకాఫ్ సయయంలో స్విచ్‌లను అచేతనావస్థలో (ఆఫ్ చేసి) ఉంచడం అత్యంత అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ఇదే కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ముంబై: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలెట్లదే తప్పు అనే అర్థం గోచరించేలా ఉన్నాయని భారతీయ ఎయిర్‌లైన్ పైలెట్ల సంఘం(ఏఎల్పీఏ) వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని ఏఎల్పీఏ అధ్యక్షుడు కెప్టెన్ శ్యామ్ థామస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘పైలెట్లదే తప్పు అని తేల్చేలా దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రాథమిక దశలోనే ఇలాంటి నిర్ణయానికి రావడం విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దర్యాప్తులో ఇంత గోప్యత ఎందుకు? ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల రంగం నుంచి నిపుణులకు చోటివ్వకపోవడం శోచనీయం. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల సంఘ ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అప్పుడే దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయి. ఫ్యూయల్ స్విచ్ గేట్స్ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగా ఉన్నదీ లేనిదీ విమానం బయల్దేరే ముందే తనిఖీలు చేశారా? ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల పొజిషన్లు మారడం సైతం ప్రమాదానికి కారణం కావచ్చని అమెరికాలోని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. భారత్‌లో దర్యాప్తు జరుగుతుండగా, ప్రాథమిక దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాకముందే అందులోని అంశాలు ఎలా లీకయ్యాయి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య ఉందా? ‘‘విమానంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది కీలకం. ఈ ప్రమాదం విషయంలో ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ పాత్ర ఏమిటి అనేది ఎక్కడా పేర్కనలేదు. పైలట్ ప్రమేయం లేకుండా ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య కారణంగా ఫ్యూయల్ స్విచ్ పొజిషన్ మారిందా లేదా అనేది తెలియల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎల్రక్టానిక్ కంట్రోల్ యూనిట్ స్తంభించిపోవడం అనే అంశంపై తీవ్రంగా దృష్టిసారించాల్సిందే’’అని భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ దర్యాప్తు నిపుణుడు కెపె్టన్ కిశోర్ చింతా అన్నారు. ‘‘ఇంజిన్లు ఆగిపోవడంతో వెంటనే మొదటి ఇంజిన్‌ను స్టార్ట్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అది నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. రెండో ఇంజిన్‌నూ స్టార్ట్చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజిన్లను ఆఫ్ చేస్తే మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్ పొజిషన్‌కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ అ«దీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచాఫ్‌లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు’’అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ విమానంలో ఫ్యూయల్ స్విచ్‌లు గతంలో ఏమైనా పాడయ్యాయా? రిపేర్ చేశారా? కొత్తవి బిగించారా? అనే వివరాలు నివేదికలో లేకపోవడం సైతం ఫ్యూయల్ స్విచ్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

ఒకే రాజ్యం.. ఒకే రాజ్యాంగం..
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో రాష్ట్రంలో ఒకటి.. దేశంలో మరొకటి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందని.. మన దేశం (రాజ్యం)లో అది సాధ్యం కాదని.. ఒకే దేశం–ఒకే రాజ్యాంగం మనదని బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎలా పనిచేయాలో ఆయన రోడ్‌మ్యాప్ వేశారన్నారు. 75 ఏళ్లుగా ఇలా చెక్కుచెదరకుండా ఉన్నామంటే అందుకు దృఢమైన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భవిష్యత్ అవసరాల మేరకు రాజ్యాంగ సవరణ అనివార్యమంటూనే ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు అప్పగించారని వెల్లడించారు. భారత రాజ్యాంగం: అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేడ్కర్ ఆలోచనా సరళిని లోతుగా విశ్లేషిచారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేరాలని.. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎన్ని వచ్చినా మన రాజ్యాంగం వల్లే బలంగా తట్టుకొని నిలబడగలిగామని చెప్పారు. నేరుగా ‘సుప్రీం’ను ఆశ్రయించే వెసులుబాటు.. ‘భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణకు అంబేడ్కర్ అనుమతించారు. ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆరి్టకల్ 32 పౌర హక్కులకు భంగం కలగకుండా కాపాడుతోంది. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. అమెరికాలో ద్వంద పౌరసత్వం అమల్లో ఉన్నా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతోపాటు సమాఖ్య పౌరసత్వం ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అమల్లోకి తీసుకురావడం గరి్వంచదగిన విషయం. 1973లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులపై ఘర్షణ వచ్చింది. దీనిపై 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసే పనిచేస్తాయని తేల్చిచెప్పింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా రోడ్‌మ్యాప్ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర ఎనలేనిది’అని సీజేఐ జస్టిస్ గవాయ్ వివరించారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రసంగాన్ని ముగించారు. అంబేడ్కర్‌కు హైకోర్టు సీజేగా ఆఫర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ప్రసంగిస్తూ ‘హైదరాబాద్ నా సొంత నగరం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నా సొంత నగరంలో నా వర్సిటీకి సీజీఐ రావడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం హర్షణీయం. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్ భాగ్యనగరాన్ని సందర్శించారు. నిజాం నవాబ్ ఆయన్ను కలసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారు. అయితే ఆ ఆఫర్‌ను అంబేడ్కర్ సున్నితంగా తిరస్కరించారు. మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది.. ఔన్యతమైనది’అని వెల్లడించారు. అంబేడ్కర్‌తో హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారన్నారు. అంబేడ్కర్ తన ఆత్మకథలో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రసంగిస్తూ 1947 అక్టోబర్‌లో రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైందని.. రెండున్నరేళ్ల చర్చలు, భేటీల తర్వాత 1949 నవంబర్‌లో తుదిరూపు వచ్చిందన్నారు. బీఆర్ గవాయ్ తండ్రి అంబేడ్కర్‌కు సన్నిహితుడు.. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ 1953 జనవరి 12న అంబేడ్కర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. ఇది ఓ భారతీయ విశ్వవిద్యాలయం ఆయనకు ప్రదానం చేసిన తొలి డాక్టరేట్ అని చెప్పారు. బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేడ్కర్‌కు అత్యంత సన్నిహితుడని.. దాదా సాహెబ్ గవాయ్‌గా ఆయన సుపరిచితుడన్నారు. విద్యావేత్త, రాజకీయ నేత, సామాజిక కార్యకర్తగానే కాకుండా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ... 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పీపీ పల్లె నాగేశ్వర్రావు, రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్ఏసీ) గోవర్దన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ కుమార్ నాయక్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పోస్టల్ కవర్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్ విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

లగ్జరీ ఈవీలవైపు.. సంపన్నుల చూపు
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు కాలుష్యకారక ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే క్రమంగా పర్యావరణహితమైన వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనితో లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా పెరుగుతోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం 2024 జనవరి–మే మధ్య కాలంలో లగ్జరీ సెగ్మెంట్లో 7 శాతంగా ఉన్న ఈవీల వాటా ఈ ఏడాది అదే వ్యవధిలో 11 శాతానికి చేరింది. ఏకంగా 66 శాతం వృద్ధి చెందింది. ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2025లో జూన్ నెలాఖరు వరకు అమ్ముడైన ఖరీదైన కార్లలో 10 శాతం వాటా ఈవీలదే ఉంటోంది. గతేడాది ఇదే వ్యవధిలో వీటి వాటా 5 శాతం లోపే నమోదైంది. కొత్త మోడల్స్ దన్ను.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతుండటం కూడా ప్రీమియం కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి నెలకొనడానికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 మోడల్ గేమ్‌చేంజర్‌గా నిల్చిందని పేర్కొన్నాయి. ఇక, తమిళనాడులోని రాణిపేటలో 2026 తొలి నాళ్లలో భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవల ప్రకటించింది. ప్రాథమికంగా దీని వార్షికోత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లుగా ఉంటుంది. ఇక అమెరికన్ దిగ్గజం టెస్లా కూడా భారత్‌లో విక్రయాలకు సిద్ధమవుతోంది. జూన్ 15న తొలి స్టోర్‌ను ముంబైలో ప్రారంభిస్తోంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈవీలను ఎందుకు కొనాలి అనే సందేహం నుంచి బైటపడి ఏ ఈవీని కొనుక్కోవాలి అనే ఆలోచించే వైపు కొనుగోలుదార్లు మళ్లుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. తాను రెండేళ్లుగా ఈవీని ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. మాస్ మార్కెట్ ఈవీల రేట్లు కూడా దాదాపు సంప్రదాయ ఐసీఈ వాహనాల ధరలకు కాస్త అటూ ఇటూగా ఉండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కి దోహదపడుతోంది. ట్యాక్సేషన్‌పరమైన ప్రయోజనాల వల్ల లగ్జరీ సెగ్మెంట్లో ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కొన్ని సందర్భాల్లో 4–5 శాతం తక్కువకే లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక , డ్రైవింగ్‌పరంగా సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు పెరుగుతుండటం వంటి అంశాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తికి దోహదపడుతున్నాయని వివరించాయి. రేంజ్‌పరమైన (మైలేజీ) ఆందోళన కూడా తగ్గుతోందని పేర్కొన్నాయి. టాప్ ఎండ్ లగ్జరీ కార్లకు డిమాండ్ దేశీయంగా టాప్ ఎండ్ లగ్జరీ, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ నెలకొందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలపరంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసినట్లు చెప్పారు. 4,238 కార్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఎస్–క్లాస్, మేబాక్, ఏఎంజీల్లాంటి టాప్ ఎండ్ వాహన విక్రయాలు 20 శాతం ఎగిశాయని వివరించారు. కొత్తగా జీఎల్ఎస్ ఏఎంజీ లైన్‌కి సంబంధించి రెండు వాహనాలను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 1.4 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది.
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి
జమ్మూలో 50 మంది ముష్కరులు
మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట
ఈ కళ అమ్మ కల
కూటమికే ‘ఫిట్నెస్’
ఎంబీబీఎస్ ప్రవేశాలకు షెడ్యూల్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సందె పొద్దులోనూ భగభగలే
3 గిగావాట్లకు డేటా సెంటర్లు
కేసులు పెట్టండి.. లోపలెయ్యండి!
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్‌ది కాదు!!
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి
జమ్మూలో 50 మంది ముష్కరులు
మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట
ఈ కళ అమ్మ కల
కూటమికే ‘ఫిట్నెస్’
ఎంబీబీఎస్ ప్రవేశాలకు షెడ్యూల్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సందె పొద్దులోనూ భగభగలే
3 గిగావాట్లకు డేటా సెంటర్లు
కేసులు పెట్టండి.. లోపలెయ్యండి!
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్‌ది కాదు!!
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం వద్దు: ఆర్. నారాయణ మూర్తి
సినిమా

రుహానీ గ్లామర్.. పోలీస్తో రాయ్ లక్ష్మి పోజు
ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్రీముఖియూకేలో రెడ్ గౌనులో రాయ్ లక్ష్మీ హాట్ పోజులుహీరోయిన్ రుహానీ శర్మ మత్తెక్కించే స్టిల్స్చెక్ షర్ట్‌లో ప్రియాంక మోహన్ కిక్కిచే లుక్స్వైట్ డ్రస్సులో క్లాసీగా 'యానిమల్' తృప్తి దిమ్రిముక్కు పుడకతో మెరిసిపోతున్న ప్రియా వారియర్ప్రియమణి చుడీదార్ లుక్.. ఫుల్ క్లాస్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Shanvi S (@shanvisri) View this post on Instagram A post shared by Ananyaa (@ananyahere)

భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్
యూట్యూబర్‌గా ఫేమ్ తెచ్చుకుని ఆపై సినిమాలు చేసిన కమెడియన్ మహేశ్ విట్టా.. గత నెలలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు ఇప్పుడు ఆమెకు సీమంతం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)రాయలసీమ కుర్రాడిగా యూట్యూబ్ వీడియోలు చేసిన మహేశ్ విట్టా.. తర్వాత నటుడిగా పలు మూవీస్ చేశాడు. బిగ్‌బాస్ షోకి కూడా రెండుసార్లు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ, మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ గురించి బయటపెట్టిన మహేశ్.. త్వరలో పెళ్లి ఉండొచ్చని చెప్పాడు. అన్నట్లుగానే 2023 సెప్టెంబరులో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాడు.మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. మహేశ్ విట్టా సినీ కెరీర్ విషయానికొస్తే.. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. నిజానికి 'పుష్ప' మూవీలో కేశవ పాత్ర కోసం కూడా ఆడిషన్ ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో మహేశ్ విట్టా బదులు జగదీశ్ ప్రతాప్‌కి అవకాశం దక్కింది.(ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్) View this post on Instagram A post shared by Mahesh Vitta (@maheshvitta)

హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు
ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri).. అమెరికాలో సెటిలైన ఈ తెలుగమ్మాయి అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేసింది. కానీ సినిమాలపై పిచ్చితో తన వృత్తిని వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చింది. టాలీవుడ్లో అడుగుపెట్టి కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా హిట్టు కొట్టింది. సినిమాను నిర్మించడంతోపాటు అందులో సలీమా అనే వేశ్య పాత్రలోనూ నటించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు సైతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.డైరెక్షన్ కష్టంతాజాగా ప్రవీణ దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రవీణ.. నటీనటులతో మంచి పర్ఫామెన్స్ రాబట్టేందుకు వారిపై చేయి చేసుకున్నానని వెల్లడించింది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. డైరెక్షన్ చాలా కష్టమైనది. డైరెక్షన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఈ పర్ఫామెన్స్ ఓకేనా? ఈ బీజీఎం వర్కవుట్ అవుతుందా? ఈ ఎడిట్ ఓకేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. షూటింగ్ మాత్రం 33 రోజుల్లో త్వరగా అయిపోయింది.హీరోను కొట్టా, తిట్టా..హీరో మనోజ్ చంద్ర సిటీ అబ్బాయి. ఇతడిని పల్లెటూరి కుర్రాడిలా తయారుచేయడమే అసలైన కష్టం. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్నాం. వీరిద్దరి మధ్య సీన్లు పండకపోతే సినిమా పండదు. కాబట్టి ఈ ఇద్దరిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే వీళ్లను తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరాను. ఎందుకంటే నా దృష్టిలో నటించడం అంటే జీవించడం. అందుకే నేను చేసిన పనికి వీళ్లకు సారీ చెప్పను. నేను డాక్టర్‌ను కాబట్టి ఏదైనా అయితే బాగానే చూసుకున్నాను అని ప్రవీణ చెప్పుకొచ్చింది.చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?

వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకా అని ఆశ్చర్యపోయా
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్‌తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'(ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్‌తో నటి డేటింగ్)''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్‌తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది.(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) He is 75 now Best orator when comes to stage speeches . The way he kept audience engaging 🔥🔥🔥Ultimate hilarious fun mode 😂😂Mr . Rajinikanth 😂Kamalhaasan elevation 🔥Sivakumar ayya elevation 🔥Dmk function 😂😂Cooling glass slow motion 😂Why I’m chief for this… pic.twitter.com/plbtMjBLQO— Suresh balaji (@surbalutwt) July 11, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఆర్చరీ ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్’
మాడ్రిడ్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌లో ‘హ్యాట్రిక్’ పతకాలు సాధించింది. అయితే కాంపౌండ్‌లో తృటిలో రెండు స్వర్ణావకాశాల్ని చేజార్చుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఒక్కో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147–148తో ఎలా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో పాయింట్ తేడాతో ఓడి రజతంతో తృప్తి పడింది. మరో కాంపౌండ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో జ్యోతి, పర్ణిత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత జట్టు 225–227తో చైనీస్ తైపీకి చెందిన హువంగ్ జౌ, చెన్ యి సున్, చియు యు ఎర్ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట 57–57తో తైపీ త్రయాన్ని నిలువరించిన భారత జట్టు... 58–56తో, 55–56తో మూడు రౌండ్లు ముగిసేసరికి 170–169తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆఖరి నాలుగో రౌండ్లో గురి కుదరక రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ (ఏపీ)–రిషభ్ యాదవ్ (హరియాణా) జోడీ 156–153తో పాలొ కొరాడో–డగ్లస్ నొలాస్కో (ఎల్ సాల్వడోర్) జంటపై గెలిచింది.

సరిగ్గా... సమంగా...
లార్డ్స్ మైదానంలో మూడు రోజు ఆట సమంగా ముగిసింది...భారత బ్యాటర్లు పట్టుదలగా నిలబడగా, ఇంగ్లండ్ కూడా కీలక సమయాల్లో వికెట్లతో మ్యాచ్‌లో నిలిచింది. సరిగ్గా ఇంగ్లండ్ చేసిన స్కోరునే భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేసింది. తొలి సెషన్లో రాహుల్–పంత్‌ల భాగస్వామ్యం, రెండో సెషన్లో జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిల నిలకడ... భారత్ దీటైన స్కోరు చేసేందుకు దోహదం చేసింది. మూడు రోజులైనా ఎవరి పైచేయి ఖరారు కానీ ఈ ‘లార్డ్స్’ టెస్టును నేటి నాలుగో రోజే అటో... ఇటో... తేల్చనుంది. నిర్జీవమైన పిచ్‌పై రెండు రోజుల్లో 20 వికెట్లు సాధ్యమా అనేది సందేహమే! డ్రా కు, డ్రామాకు నేడు, రేపు రసవత్తర పోరు జరగనుంది.లండన్: బుమ్రా తన బౌలింగ్‌తో కూలగొట్టిన ప్రదర్శనకు దీటుగా భారత బ్యాటర్లు తలబడ్డారు. ఇంగ్లండ్‌ను సమష్టిగా ఎదుర్కొన్నారు. మూడో రోజంతా ఆడటంలో సఫలమైన టీమిండియా సరిగ్గా... సమానంగా ఇంగ్లండ్ చేసిన స్కోరే చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొక్కుబడిగా ఆడిన ఇంగ్లండ్ ఒక ఓవర్లో వికెట్ నష్టాపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్), డకెట్ (0) క్రీజులో ఉన్నారు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడని ఓపెనర్లు అదే పనిగా బుమ్రా ఓవర్‌ను ఎదుర్కొనేందుకు తాత్సారం చేశారు. దీంతో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ ఓపెనర్ల తీరును తప్పుబట్టాడు. రిషభ్ పంత్ ఫిఫ్టీ ఓవర్‌నైట్ స్కోరు 145/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్లో ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. పిచ్ సహకారంతో ఓపెనర్ రాహుల్, రిషభ్ పంత్ సాధికారికంగా ఆడారు. దీంతో ఆరంభంలోనే వికెట్ తీసి పట్టుబిగిద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చినా, స్పిన్‌ను ప్రయోగించినా ఈ జోడీ మాత్రం నింపాదిగానే పరుగులు రాబట్టింది. దీంతో ఈ సెషన్ అసాంతం భారత్‌దే పైచేయి అయింది. ఇద్దరు ఆచితూచి ఆడుతూనే, వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. రాహుల్, రిషభ్‌ల సమన్వయంతో పరుగుల రాకకు ఏ దశలోనూ ఇబ్బంది లేకపోయింది.చూస్తుండగానే జట్టు స్కోరు 200కు చేరింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు పంత్ వికెట్ రూపంలో ఓదార్పు లభించింది. లేని పరుగుకు ప్రయత్నించిన రిషభ్... స్టోక్స్ విసిరిన డైరెక్ట్ త్రోకు వికెట్‌ను సమరి్పంచుకున్నాడు. ఐదు మంది బౌలర్ల వల్ల కాని పనిని స్టోక్స్ ఒక్క త్రోతో విడగొట్టేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అతని వికెట్ పడిన 248/4 స్కోరు వద్దే లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రాహుల్ శతకానికి 2 పరుగుల దూరంలో నిలిచాడు. రాహుల్ శతక్కొట్టిన వెంటనే... రెండో సెషన్లో రాహుల్‌తో కలిసి జడేజా క్రీజులోకి వచ్చాడు. రాహుల్ సెంచరీ చేశాడన్న ఆనందం అతను అవుటవడంతోనే ఆవిరైంది. 176 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న కేఎల్ రాహుల్... తర్వాత ఒక్క పరుగైన చేయకుండా ని్రష్కమించాడు. టెస్టుల్లో రాహుల్‌కిది పదో సెంచరీ కాగా... క్రికెట్ మక్కా లార్డ్స్‌లో రెండో శతకం. 2021–22 సీజన్లోనూ అతను శతక్కొట్టాడు. కాగా అతని వికెట్ ఇంగ్లండ్ శిబిరానికి పెద్ద సాఫల్యం. అదృష్టం కొద్ది సులువైన రనౌట్ల నుంచి నితీశ్ బతికిపోవడం జట్టుకు కాస్త ఊరటనిచి్చంది. లేదంటే బ్యాటింగ్ చేసే సామర్థ్యమున్న నితీశ్ వికెట్ కూడా భారత్ కోల్పోయేది. జడేజాకు జతగా నితీశ్ కుమార్ (30; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేయడంతో జట్టు స్కోరు 300 దాటింది. 316/5 స్కోరు వద్ద ఈ సెషన్ ముగిసింది. జడేజా అర్ధ సెంచరీ టి విరామం తర్వాత కాసేపటికే నితీశ్ వికెట్‌ను పారేసుకున్నాడు. స్టోక్స్ బంతిని ఎదుర్కోవడంలో పొరపడిన నితీశ్ కీపర్ స్మిత్ చేతికి క్యాచ్ అప్పజెప్పి వెళ్లాడు. తర్వాత క్రీజులోకి వచి్చన వాషింగ్టన్ సుందర్ (23; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జడేజా 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వీళ్లిద్దరి జోడీ కూడా ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్ తీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. ఏడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక జడేజా అవుటయ్యాడు. ఇతను అవుటైన 11 పరుగుల వ్యవధిలోనే ఆకాశ్ దీప్ (7), బుమ్రా (0) సుందర్ వికెట్లను కోల్పోవడంతో భారత్ సరిగ్గా 387 పరుగుల వద్దే ఆలౌటైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 387; భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (సి) బ్రూక్ (బి) బషీర్ 100; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; శుబ్‌మన్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ రనౌట్ 74; జడేజా (సి) స్మిత్ (బి) వోక్స్ 72; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) స్టోక్స్ 30; సుందర్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 23; ఆకాశ్ (సి) బ్రూక్ (బి) కార్స్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) వోక్స్ 0; సిరాజ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (119.2 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107, 4–248, 5–254, 6–326, 7–376, 8–385, 9–387, 10–387.బౌలింగ్: వోక్స్ 27–5–84–3, ఆర్చర్ 23.2–6–52–2, కార్స్ 24–5–88–1, స్టోక్స్ 20–4–63–2, బషీర్ 14.5–2–59–1, జో రూట్ 10.1–0–35–0. ఇంగ్లండ్ రెండోఇన్నింగ్స్: క్రాలీ బ్యాటింగ్ 2; డకెట్ బ్యాటింగ్ 0; మొత్తం (1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా) 2/0. బౌలింగ్: బుమ్రా 1–0–2–0.

Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వింబుల్డన్-2025 టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతంచేసుకుంది. రెండు సెట్లలోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిలవలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడ్డాడు. 78వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్‌లో ఐదో బంతికి భారత బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ట్రైట్‌గా షాట్ ఆడాడు.ఈ క్రమంలో బంతిని ఆపే ప్రయత్నంలో అతడి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. దీంతో బషీర్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో రాకముందే తనంతట తానే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సామ్ కూక్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా ఇంగ్లండ్‌కు ఇది నిజంగా గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ జట్టులో బషీర్ ఏకైక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. అతడు బయటకు వెళ్లిపోవడంతో రూట్ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ రూట్ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.కాగా సెంచూరియన్ కేఎల్ రాహుల్‌ను బషీర్ అద్బుతబ బంతితో బోల్తా కొట్టించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. 109 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(72), సుందర్(19) ఉన్నారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
బిజినెస్

జియో మరో సంచలనం.. ఇక టీవీనే కంప్యూటర్!
ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చుతుంది.ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్‌ని ప్లగ్ఇన్ చేసి తమ టీవీలో డెస్క్‌టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్ చేయదు.ధర, లభ్యతజియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్‌బ్యాండ్‌తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.ఫీచర్లు, వినియోగం ఇలా..జియో వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఓపెన్-సోర్స్ ఆఫీస్ సూట్‌ను దీంట్లో ప్రీఇన్‌స్టాల్ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్‌లను విడి బ్రౌజర్ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఏమీ ఉండదు.

బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు!
ఎంతో పాపులర్ అయిన బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు కానుంది. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్ కోసం పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ ను అప్ డేట్ చేసింది. అయితే ఈ బ్రాండ్ నిశ్శబ్దంగా పల్సర్ ఎన్ 150 ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పల్సర్ ఎన్ 160 కింద ఉన్న ఈ బైక్ ను బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీన్ని వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు.అత్యంత ఆదరణ ఉన్న పల్సర్ లైనప్‌లో రెండు 150 సీసీ పల్సర్లు ఉండేవి. వీటిలో ఒకటి క్లాసిక్ పల్సర్ 150 కాగా మరొకటి పల్సర్ ఎన్ 150. క్లాసిక్ పల్సర్ 150కు అప్డేటెడ్ స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఎన్ 150 బైక్‌ను తీసుకొచ్చారు. డిజైన్, లుక్ పల్సర్ ఎన్ 160 మాదిరిగానే ఉన్న ఈ బైక్ కొనుగోలుదారులలో ఆదరణ పొందిన ఎంపికగా కొనసాగుతోంది.పల్సర్ ఎన్ 150 స్పెక్స్ విషయానికి వస్తే.. సొగసైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీనికి ఉంది. ఇది ప్రసిద్ధ పల్సర్ హెడ్ ల్యాంప్స్ అధునాతన వెర్షన్ ను సూచిస్తుంది. అంతేకాకుండా మస్కులార్ ఇంధన ట్యాంక్ దీనిస్పోర్టీ వెయిస్ట్లైన్కు భిన్నంగా ఉంటుంది. ఎన్ 160లో ఉన్నట్టుగానే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్ పై యూఎస్బీ పోర్ట్, స్పీడోమీటర్ ఉన్నాయి.పల్సర్ ఎన్ 150 బైకులో 149.68 సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 14.5బిహెచ్ పి పవర్, 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, స్పోర్ట్ బైక్ ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎస్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు.

ఒక్క ఏడాదిలో భారీగా పెరిగిన లీజులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(హెచ్1)లో 2.68 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన 1.90 కోట్ల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం లీజులు పెరిగాయి.అలాగే 2025 హెచ్1లో టాప్–7 నగరాలలో కొత్తగా 2.45 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది హెచ్1లో సప్లయి అయిన 1.96 కోట్ల చ.అ.తో పోలిస్తే ఏడాది కాలంలో 25 శాతం సరఫరా పెరిగిందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో 2025 హెచ్1లో 42 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది.గతేడాది హెచ్1లో 31.2 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే 35 శాతం లావాదేవీలు పెరిగాయి. ఇక, ఇదే సమయంలో గ్రేటర్లో కొత్తగా 47 లక్షల చ.అ. ఆఫీసు స్థలం సరఫరా అయింది. 2024 హెచ్1లో సప్లయి అయిన 56.8 లక్షల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఏడాది కాలంలో సరఫరా 17 శాతం మేర తగ్గింది.

ఎయిర్టెల్ రీచార్జ్‌పై 25% క్యాష్ బ్యాక్.. ఇలా చేస్తే..
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. మొబైల్ టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర్టెల్ రీఛార్జ్‌లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది.
ఫ్యామిలీ

నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్‌కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్‌లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్‌గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!)

అలాంటి ఇలాంటి ప్రేమకథ కాదు..!
ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అత్యంత సర్వసాధారణం. 70 ఏళ్లు పైబడ్డాక ప్రేమ అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ వృద్ధ జట ఆ వయసులో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ప్రేమకు వయసు అడ్డంకికాదు అంటే ఇదే అంటూ ఆ వృద్ధ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని త్రిశూర్‌లో చోటుచేసుకుంది. వారే విజయరాఘవన్(79), సులోచన(75). ఈ ఇద్దరి నడుమ ప్రేమ ప్రభుత్వం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చిగురించింది. విజయ రాఘవన్ ఈ ఆశ్రమంలోకి 2019లో రాగా, సులోచన 2024లో వచ్చారు. ఇరువు వృద్ధాశ్రమ కారిడార్‌లో కలుసుకుని మాట్లాడుకునే వారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కేంత వకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆనందకర వేడుక కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్. బిందు, నగర మేయర్ ఎం.కె. వర్గీస్ సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. ఆ దంపతులు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఫిదా అవుతూ..నిజమైన ప్రేమకు వయోభేదం ఉండదు..అది అవుధులు లేనిది అంటూ ఆ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..! ఏకంగా ప్రధాని మోదీ..)

‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..
హైదరాబాద్ నగరం మరోసారి నవ్వుల పండుగకు వేదిక కానుంది. డిజిటల్ హాస్య తార ‘అయ్యో శ్రద్ధా’గా గుర్తింపు పొందిన శ్రద్ధా జైన్ తన అద్భుత స్టాండప్ కామెడీ షో ‘సో మినీ థింగ్స్’ పేరుతో దేశంలో చివరి సారి ప్రదర్శించనుంది. ఈ హృద్యమైన వినోద యాత్ర ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రదర్శన కేవలం వినోదం మాత్రమే కాదు.. భారతీయ కుటుంబ జీవనాన్ని, మన ఊహల్ని, నిత్యజీవితంలో మినీ మినీ కహానీలను పరిపూర్ణంగా హాస్యంగా మలిచే ఓ అనుభూతిని ప్రదర్శించనుంది. శ్రద్ధా కామెడీ మాయాజాలం మానసిక అంతర్భావాల పరంగా అద్భుతంగా ఉంటుందని అభిమానుల మాట. ఓ చిన్న పిల్లవాడిలా జిజ్ఞాసతో, అమాయకంగా ఆలోచించే తత్వం ఆమె పండించే ప్రతి కథనంలో కనిపిస్తుంది. ‘సో మినీ థింగ్స్’ అనే పేరు కూడా ఆమె ప్రదర్శనలోని మినీ కథలు, మినీ ఎమోషన్స్, మినీ వెర్షన్లకు అద్దం పట్టినట్లే ఉండనుంది. భారతీయ కుటుంబాల్లోని సరదా సంభాషణలు, అపరిచిత సందర్భాల్లో తలెత్తే హాస్యాన్ని తన ప్రత్యేక శైలిలో మలచి ప్రేక్షకులకు అందించడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రదర్శనకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న లైవ్ట్రీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోను నిగమ్, హరిహరన్ వంటి సంగీత దిగ్గజాల లైవ్ షోల వేదికగా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా షోను ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రదర్శించి, ఇప్పుడు చివరగా భారత్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో భారీ ప్రేక్షకాభిమానంతో ప్రారంభమైన ఈ చివరి టూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ షోతో ముగుస్తుంది. ఈ సందర్భంగా సీఈఓ శరత్ వత్సా మాట్లాడుతూ.‘దాదాపు 90 నిమిషాలు ప్రేక్షకులు నవ్వుల ప్రపంచంలో మునిగి తేలాక వారి మనసు తేలికపడి, హృదయాన్ని హత్తుకునే అనుభూతితో బయటికి రావడం.. ఇదే మాకు సంతృప్తి. 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ‘మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ – ఫిమేల్’ అవార్డును అందుకున్న ఈ ఇంజినీర్, ఆర్జే, కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం కామెడీ ప్రపంచానికి ఒక మైలు రాయిలా మారిపోయింది’ అని తెలిపారు.

గాజర్ కె హల్వా కా దోశ... ఆహా... ఛీఛీ... క్షమించండి!
ఉత్తరాది, దక్షిణాది రుచులు ఒకచోట, ఒకే ఐటమ్‌లో కనిపిస్తే?ఆ ఐటమ్ పేరే... గాజర్ కే హల్వా కా దోశ.. Gajar Ke Halwa Ka Dosa!ఇండోర్‌కు చెందిన ఈ దోశలో అదనపు ఆకర్షణ క్యారట్ హల్వా, రబ్డీ (ఇదొక నార్డ్ ఇండియన్ స్వీట్. పాలను బాగా మరిగించి చేసేది). ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లోకంలో హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌పై మిక్స్డ్ రియాక్షన్స్ కనిపించాయి. కొందరు...‘ఆహా!’ అంటున్నారు. View this post on Instagram A post shared by Swaad Indore Da | Harshit Singh (@swaad_indore_da)అటు దక్షిణ భారతీయులకు ఎంతో ప్రియమైన దోశను, ఇటు ఉత్తర భారతీయులు మెచ్చే స్వీట్ క్యారెట్ హల్వాను రెండూ మిక్స్ చేయడంతో నెటిజనులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ వీడియోను స్వాద్ ఇండోర్ డా అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "గాజర్ కా హల్వా దోశ" అనే క్యాప్షన్‌తో దీన్ని పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఎక్కువ శాతం ప్రతికూలంగా స్పందించారు. కొందరు అయ్యో దేవుడా.. ఇదేమి వంటకం రా బాబూ అంటున్నారు. మరికొందరు ‘దేని ప్రత్యేకత దాంతే, రెండూ కలిపేస్తే ఎలా అని’ అంటూ నిట్టూరిస్తే, కొందరు...‘ఛీఛీ’ అంటున్నారు. "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" “ఇండోర్ ప్రజలందరి తరపున నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను.” "ఈ విషాన్ని నేను ఏమని పిలవాలి?" మరొకరు, “ఇది అల్పాహారమా లేక డెజర్టా? అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఫొటోలు
అంతర్జాతీయం

రెచ్చిపోయిన హౌతీలు
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న గ్రీక్ దేశానికి చెందిన అంతర్జాతీయ సరకు రవాణా నౌక ‘ఎటరి్నటీ సి’పై హౌతీలు గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడిచేశారు. దీంతో నౌకకు కిందవైపు భారీ రంధ్రం పడి సముద్రంలో మునిగిపోయింది. విషయం తెల్సుకున్న యురోపియన్ యూనియన్ నేవీ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని 10 మంది నౌక సిబ్బందిని రక్షించాయి. అయితే ఆలోపే కొంతమంది సిబ్బందిని హౌతీలు కిడ్నాప్‌చేసి గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లారు. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మునిగిన ఘటనలో ముగ్గురు సజీవసమాధి అయ్యారు. ఎర్రసముద్రంలో ఈ వారం వ్యవధిలో హౌతీలు ఇలా వాణిజ్యనౌకపై దాడిచేయడం ఇది రెండోసారి. హమాస్‌ను అంతమొందించేందుకు సాహసించిన ఇజ్రాయెల్‌పై కక్షతో హౌతీలు ఇలా పశి్చమదేశాలకు చెందిన నౌకలపై తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఎటరి్నటీ సి నౌక ఇజ్రాయెల్‌లోని ఎలాట్ ఓడరేవుకు వెళ్తుండగా ఇలా దాడికి గురైంది. ‘‘ పాలస్తీనియన్లకు మద్దతుగా మేం దాడులను కొనసాగిస్తాం. గాజా ఆక్రమణను ఇజ్రాయెల్ ఆపాల్సిందే’’ అని హౌతీలు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు.

భలే ఇంగ్లిష్ మీది!
వాషింగ్టన్: ఏదో ఒక వివాదం లేనిదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పొద్దుపోవడం లేదు. తాజాగా లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొవాకై ఇంగ్లిష్ చాలా బాగుందంటూ ఆయన ఇచి్చన కితాబు కూడా వివాదానికే దారితీసింది. బుధవారం వైట్‌హౌస్‌లో ఐదుగురు ఆఫ్రికా దేశాధినేతలతో భేటీ సందర్భంగా జోసెఫ్ ఇంగ్లిష్ కు ట్రంప్ ముగ్ధుడయ్యారు. ‘‘చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కని ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకున్నారు?’’అంటూ ఆరా తీశారు. ఆయన ధోరణి తమను అవమానించేలా ఉందంటూ లైబీరియాలోనే గాక ఆఫ్రికావ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఆఫ్రికా ప్రాంతాలవాళ్లు నిరక్షర కుక్షులనే ఉద్దేశంలోనే ట్రంప్ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. దీనిపై లైబీరియా దౌత్యవేత్తలు కూడా అభ్యంతరం వెలిబుచ్చారు. ట్రంప్ తీరుకు నిరసనగా తమ అధ్యక్షుడు వాకౌట్ చేయాల్సిందని లైబీరియన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రెస్ కరోలినా లెవిట్ ట్రంప్ వ్యాఖ్యలను సమరి్థంచారు. వాటిలో తప్పేమీ లేదని, తమ అధ్యక్షుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లైబీరియా విదేశాంగ మంత్రి కూడా అన్నారు. ఆంగ్లమే అధికార భాష లైబీరియా అధికారిక భాష ఇంగ్లిష్. ఆఫ్రికాలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన వారి పునరావాసం నిమిత్తం అమెరికా వలస సమాజం 1822లో ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది. 1847లోనే అమెరికా నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. ఆంగ్లంతో పాటు అక్కడ పలు భాషలు మాట్లాడతారు. గతంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడెరిక్ మెర్జ్ ఇంగ్లిష్ నుకూడా ట్రంప్ ఇలాగే మెచ్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అమెరికా ఫస్ట్’నినాదంతో భాగంగా ఆంగ్లానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దాన్ని అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ గత మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు!

యూరప్‌లో వడగాడ్పుల మరణ మృదంగం
లండన్: యూరప్ దేశాల్లో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానమైన 12 యూరప్ నగరాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 2,300 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మూడింట రెండొంతుల మరణాలకు వాతావరణ మార్పులే కారణమని ఓ అధ్యయనం తేల్చింది. తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని, ప్రభుత్వాల పరంగా గణాంకాలు అందేందుకు సమయం పట్టొచ్చని పరిశోధకులు తెలిపారు. జూన్ 23 నుంచి జూలై 2వ తేదీల మధ్యలో పశ్చిమ యూరప్‌తో అత్యంత తీవ్ర స్థాయిలో ఎండలు కాశాయి. స్పెయిన్‌లో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వడగాడ్పులు తోడవ్వడంతో ఫ్రాన్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. యూరప్‌లోని ప్రధాన నగరాలైన బార్సిలోనా, మాడ్రిడ్, లండన్, మిలాన్ తదితర ప్రధానమైన 12 నగరాల జనాభా 3 కోట్లకు పైమాటే. ఈ నగరాల్లో సాధారణానికి మించి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. పది రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన 2,300 మరణాల్లో కనీసం 1,500 మరణాలు అత్యంత తీవ్రమైన వడగాడ్పులు వంటి వాతావరణ మార్పుకు సంబంధించినవేనని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లకు చెందిన ఐదు సంస్థలు, 12మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు. ‘వాతావరణ మార్పుల వల్లనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మన్ముందు మరింత ప్రమాదకరంగా మారనుంది’అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు బెన్ క్లార్క్ చెప్పారు. అప్పుడిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదన్నారు. ఈ ప్రభావం వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందన్నారు. రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని మరో పరిశోధకుడు గ్యారీఫల్లోస్ అన్నారు. వడగాడ్పులు సైలెంట్ కిల్లర్స్‌గా ఆయన అభివరి్ణంచారు. మన ఇళ్లు, ఆస్పత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.

చైనాలో ప్రాణాంతక మైనింగ్
అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మినరల్స్)... రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదానికి దారితీస్తున్న అంశమిది. తమకు తక్కువ ధరకే ఈ ఖనిజాలు సరఫరా చేయాలని చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, డ్రాగన్ దేశం అందుకు ఒప్పుకోవడం లేదు. ఎంతో అరుదైన, విలువైన ఈ ఖనిజాలు చైనా గడ్డపై ఉండడం, అవి తమకు సులువుగా దక్కకపోవడం సహజంగానే అమెరికాకు రుచించడం లేదు. అందుకే చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాను చైనా బహిరంగంగా ధిక్కరిస్తోంది అంటే అందుకు కారణం ఈ ఖనిజాలే అనే చెప్పొచ్చు. ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సోలార్ ప్యానెళ్లు, ఎంఆర్ఐ మిషన్లు, జెట్ ఇంజన్లు, విదుŠయ్త్ పరికరాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వాడకం తప్పనిసరిగా మారింది. ఇదే ఇప్పుడు చైనా పంట పండిస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ ఖనిజాల్లో సగానికిపైగా చైనా నుంచే వస్తున్నాయి. అరుదైన ఖనిజాల మైనింగ్, శుద్ధి, ఎగుమతుల విషయంలో చైనా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు ఏముందో చూస్తే... నీరు, భూమి కలుషితం చైనాలో ఉత్తరాన ఉన్న ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని బయాన్ ఓబో, దక్షిణాన జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గాంగ్ఝౌలో రేర్ ఎర్త్ ఖనిజాల గనులున్నాయి. ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగా తవ్వకాలు సాగుతున్నాయి. భారీ యంత్రాలు, వాహనాల రొదతో అవి నిత్యం దద్దరిల్లుతుంటాయి. పొరలు పొరలుగా భూమిని పెకిలించి వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతోపాటు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్న గనులు స్థానికులకు మాత్రం నరకానికి నకలుగా మారిపోయాయి. పచ్చని మైదానాలు మసిబారిపోయాయి. గడ్డి భూములు ప్రమాదకరమైన దుమ్ము ధూళితో నిండిపోయాయి. లోతైన గనుల నుంచి దట్టమైన దుమ్ము మేఘాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమాతకు గాయాలవుతూనే ఉన్నాయి. గాలి, నీరు, భూమి దారుణంగా కలుషితం అవుతున్నాయి. చట్టవిరుద్ధంగా తవ్వకాలు గనుల నుంచి వెలువడే రేడియోయాక్టివ్ బురదను నిల్వ చేయడానికే సమీపంలో కృత్రిమంగా సరస్సులు నిర్మించారు. కాలుష్యం కారణంగా స్థానికులు రోగాల బారినపడుతున్నారు. పెద్దలకు క్యాన్సర్లతోపాటు శిశువులకు పుట్టుకతో లోపాలు పరిపాటిగా మారాయి. ఇదంతా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అపరిచితులను గనుల వైపు అనుమతించడం లేదు. మైనింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. గనుల తవ్వకంతో వెలువడే మట్టి, బురదలో ప్రాణాంతకమైన భార లోహాలు, రేడియోయాక్టివ్ అవశేషాలు ఉంటున్నాయి. టన్నుల కొద్దీ అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్తోపాటు ఇతర రసాయనాలు భూ ఉపరితలంపై పేరుకుపోతున్నాయి. చైనాలో వేలాది మైనింగ్ సైట్లు ఉన్నాయి. వీటిలో చట్టవిరుద్ధమైనవే ఎక్కువ. ఒక చోట తవ్వకానికి అనుమతులు తీసుకొని మరికొన్ని చోట్ల అక్రమంగా మైనింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గనుల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. మైనింగ్ లైసెన్స్‌ల సంఖ్య తగ్గించింది. అయినప్పటికీ అక్రమ గనులు సంఖ్య పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. కేవలం ఒక టన్ను ఖనిజాలు కావాలంటే ఏకంగా 2,000 టన్నుల మట్టిని తవ్వాల్సి ఉంటుంది. గ్రామాలకు గ్రామాలే ఖాళీ గనుల వల్ల జరగాల్సిన నష్టం చాలావరకు ఇప్పటికే జరిగిపోయింది. మైనింగ్ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోయాయి. భూముల్లో గోతులే మిగిలాయి. నదులు, పంట పొలాలు పనికిరాకుండా పోయాయి. భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా తవ్వకాలు సాగిస్తుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మైనింగ్ కంపెనీలు రైతుల పొలాలను కూడా వదలిపెట్టడం లేదు. వారు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. బడా కంపెనీలపై చట్టపరంగా కోర్టుల్లో పోరాడే శక్తి లేక మిన్నకుండిపోతున్నారు. కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గనుల తవ్వకం ఆపాల్సిందేనని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

గుహలో తన ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ నివాసం.. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే?
గత రెండు వారాలుగా ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40), ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో గోకర్ణ పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. గుహ వద్ద వారి కదలికలు కనిపించాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గుహలో నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు.. వారిని కాపాడారు.కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చిన మోహి.. గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది.ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ.. రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేంది. నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది. అయితే ఆ మహిళ, ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు. ఆ రష్యన్ మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసుల బృందం.. కొండ కిందకు తీసుకెళ్లింది. ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె భారత్‌లో ఎంత కాలం నుంచి ఉంటుందో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో రష్యా రాయబార కార్యాలయాన్ని అధికారులు సంప్రదించారు.

రాధిక వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు..!
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలో దారుణ హత్యకు గురైన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ ఎన్డీటీవీకి స్పష్టం చేశారు. ఆంక్షలు భరించలేకపోతున్నా.. !తాను ఇంట్లో ఆంక్షలను భరించలేకపోతున్నానని, ప్రతీ దానికి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాధికా తనతో వాట్పాప్ చాట్‌లో తెలిపిందన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్డోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇంటికి దూరంగా వెళ్లిపోవాలనుకుందని, అందుకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుందన్నారు. తాను తొలుత చైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఫుడ్ తనకు సరిపడదనే విషయంతో ఆగిపోయిందన్నారు. దుబాయ్, ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక నాలుగు నెలల పాటు ఒంటిరిగా ఉండాలని, లైఫ్‌ను ఎంజాయన్ చేయాలని ఆమె పేర్కొన్నట్లు అజయ్ స్పష్టం చేశారు. తనకు ఏవో కొన్ని లక్ష్యాలున్నాయని, దాని కోసం తండ్రి దీపక్ యాదవ్‌కు చెబితే కనీసం వినడం కూడా చేయడం లేదని ఆమె మెసేజ్‌లో వాపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!మరో కోచ్ అంకిత్ పటేల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అసలు అండ్రీ-కూతుళ్ల మధ్య ఇంతటి వివాదం దాగి ఉందనే విషయం ఎప్పుడూ తమకు తెలియదన్నారు. ‘ నాకు రాధికా యాదవ్ 11-12 ఏళ్ల నుంచే తెలుసు. అలాగే ఆమె తండ్రి కూడా బాగా తెలుసు. ఆమె టెన్నిస్ ప్రాక్టీస్‌కు సంబంధించి తండ్రీ-కూతుళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. తండ్రి ఎప్పుడూ ఆమె సపోర్ట్‌గా నిలిచేవారు. ఆమె ఎక్కడ టెన్నిస్ మ్యాచ్ ఆడటానికి వెళ్లినా వెంటే ఉండి అన్నీ చూసుకునే వారు. రాదికా ఎప్పుడూ ఒంటిరగా ఉండటాన్ని కానీ వేరే వాళ్లతో ఉండటం కానీ నేను చూడలేదు. టెన్నిస్ ఆటకు సంబంధించి వీరి మధ్య గొడవలున్నాయనేది వాస్తవం కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరి తెలుసు’ అని సదరు కోచ్ అంకిత్ పటేల్ తెలిపారు.ఇదీ చదవండి:ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు..!

సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్‌కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025

యువతే మన అసలైన శక్తి
సాక్షి, న్యూఢిల్లీ: యువత సాధికారతకు, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశానికి ఉన్నాయని, ఇవే మనకు అసలైన బలం అని తెలిపారు. యువశక్తి దేశానికి అత్యంత విలువైన మూలధనమని స్పష్టం చేశారు. శనివారం దేశవ్యాప్తంగా 47 నగరాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల్లో ప్రధాని మోదీ వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన యువతకు 51 వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పారదర్శకమైన నియామక ప్రక్రియకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది మంది యువత రోజ్‌గార్ మేళాల ఉద్యోగాలు పొందారని, నేడు జాతి నిర్మాణంలో వారంతా పాలుపంచుకుంటున్నారని హర్షం వ్యక్తంచేశారు. గత 11 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని వ్యాఖ్యానించారు. దేశానికి సేవ చేయడమే ఉమ్మడి లక్ష్యం రోజ్‌గార్ మేళాలు సద్వినియోగం చేసుకొని, కొలువులు పొందిన యువతీ యువకులు రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధి వేగాన్ని మరింత వేగవంతం చేస్తారని ప్రధాని మోదీ వివరించారు. కొందరు దేశాన్ని రక్షిస్తారని, మరికొందరు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’లక్ష్యానికి నిజమైన సైనికులుగా మారతారని పేర్కొన్నారు. యువత వేర్వేరు విభాగాల్లో నియమితులైనప్పటికీ దేశానికి సేవ చేయడమే వారి ఉమ్మడి లక్ష్యమని ఉద్ఘాటించారు. ‘పౌరులే ప్రథమం’అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు సిఫార్సులు లేదా లంచం లేకుండా, సామర్థ్యం ఆధారంగా మాత్రమే పొందవచ్చనే విశ్వాసాన్ని రోజ్‌గార్ మేళాలు సృష్టించాయని చెప్పారు. The Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti and making them catalysts in building a Viksit Bharat. https://t.co/2k3WDTVnJc— Narendra Modi (@narendramodi) July 12, 2025ఉద్యోగాల స్వభావం మారుతోంది ప్రస్తుత శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం వేగంగా మారుతోందని, ఈ క్రమంలోనే స్టార్టప్ కంపెనీలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ చెప్పారు. ఇవన్నీ యువత గొప్ప ఆశయాలతో ముందుకు రావడానికి దోహదం చేస్తున్నాయని, ఈ కొత్త తరంపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. యువత కోసం ప్రైవేట్ రంగంలో నూతన ఉపాధి అవకాశాల సృష్టికి ఎంతగానో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రక్షణ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని, రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఉత్పత్తిని సాధించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైలింజన్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని వెల్లడించారు. రైలింజన్లు, రైలు కోచ్‌లు, మెట్రో కోచ్‌ల ఎగుమతిలో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు. ఇప్పటికే 1.5 కోట్ల ‘లఖ్పతి దీదీలు’ ‘నమో డ్రోన్ దీదీ’కార్యక్రమం గ్రామీణ మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి, సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి తెలిపారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారి దీదీలుగా మార్చే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని, ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ‘లఖ్పతి దీదీ’లుగా సాధికారత సాధించారని వివరించారు.
ఎన్ఆర్ఐ

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్/తిరుపతి గాంధీ రోడ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌లో సోమవారం వైఎస్సార్ అభిమానులు మహ్మద్ జిలానీ బాషా, అక్రమ్ బాషా, కోటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి యాత్ర–2 చిత్ర నిర్మాత శివ మేక ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని నిర్వహించేందుకు తన స్థలాన్ని కేటాయించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని మసూద్ అహ్మద్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రసన్న సోమిరెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, షేక్ అబ్దుల్లా, ఫహీమ్, ఖాజా ముతాలిబ్, చక్రి, కర్ణ, పవన్ కుమార్, హనుమంత్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్, రమణా రెడ్డి, షోయబ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో..సౌదీ అరేబియాలోని జుబైల్ ప్రాంతంలో వైఎస్సార్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అకియాకునో కంపెనీ క్యాంపులో కడపకు చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కంపెనీలో పని చేసే సుమారు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సింగపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి..వైఎస్సార్ జయంతిని సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కేక్‌ను కట్ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఎ. సాంబశివారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి, కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి, కో కన్వీనర్స్ – ప్రకాష్ , సంతోష్ తో పాటు పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొరబాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్సార్ ఆప్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సౌత్ ఆఫ్రికాలో ఘనంగా వైఎస్సార్ జయంతివైఎస్సార్సీపీ ఎన్నారై సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో జోహన్స్‌బర్గ్‌లోని మిడ్ రాండ్లోలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డామన్నారు. అనంతరంచిల్డ్రన్స్ హోమ్‌లో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు నరసింహారెడ్డి కళ్ల, సూర్యరామిరెడ్డి, శివ రాజవరపు, విక్రం రెడ్డి పెట్లూరు, కృష్ణారెడ్డి, అంజలి రెడ్డి, మనోజ రాజవరపు, సూర్య రామిరెడ్డి, శ్రావణి రెడ్డి పెట్లూరు, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

అక్కడ అంతటి గౌరవమా..! భారత సంతతి మహిళ అనుభవం
అగ్నిమాక సిబ్బందికి ఇంత గౌరవ మర్యాదలిస్తారా అని అబ్బురపడింది ఓ భారత సంతతి మహిళ. అస్సలు ఇది ఊహించలేదు. సరదాగా మా నాన్నని లండన్ తీసుకువస్తే..ఇంతలా గౌరవ మన్ననలను అందుకుంటాడని అనుకోలేదంటూ ఖుషీ అవుతోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..UKలో నివసిస్తున్న భారత సంతతి మహిళ పూజా ఖర్బ్ తన నాన్నను లండన్ పర్యటనకు తీసుకువచ్చినప్పడు ఎదురైన అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. నిజానికి ఆమె తండ్రి ఢిల్లీలో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన తన కూతురితో కలిసి లండన్ వెళ్లారు. అక్కడకు ఆ తండ్రి తనవెంట ఐడీ కార్డుని కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ తన అగ్నిమాపక దళం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇలా లండన్‌కి తన ఐడీ కార్డుని తెచ్చుకున్నాడు. తన కూతురు పూజాతో లండన్‌కి వచ్చిన అతడు..నేరుగా తన వృత్తికి సంబంధించిన అగ్నిమాపక స్టేషన్‌ని సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ తన ఐడీ కార్డుని చూపించగానే అక్కడి అధికారులు అతనికి అగ్నిమాపక కేంద్రాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూసే అవకాశం లభించడమే గాక, అక్కడ అతనికి మంచి గౌరవ మర్యాదలు కూడా లభించాయి. పైగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది జాకెట్ ధరించి ఓ ఫోటో కూడా దిగాడు. అంత దూరం నుంచి కూతురు కారణంగా లండన్ వచ్చిన ఆ తండ్రికి అక్కడి అగ్నిమాపకదళం అందించిన గౌరవమర్యాదలకు ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అది చూసి కూతురు పూజా ఈ లండన్ పర్యటనకు తీసుకువచ్చి మంచి పనిచేశా, ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారంటూ తెగ సంబరపడింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా పంచుకుంది. అయితే నెటిజన్లు ఇక్కడ భారతీయ అగ్నిమాపక సిబ్బందికి అంతటి గుర్తింపు లభించడం లేదని వాపోవడమే గాక, ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాలను లేదా అగ్నిమాపక సిబ్బందిని ఎవరూ అభినందించరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అలాగే లండన్ అగ్నిమాపక శాఖ కూడా పూజా షేర్ చేసిన వీడియోపై స్పందించింది. ఇలా మా అగ్నిమాపక దళాన్ని సందర్శించినందుకు చాలా సంతోషం అని లండన్ ఫైర్ స్టేషన్ బదులివ్వడం విశేషం. View this post on Instagram A post shared by pooja kharb (@learnerforlifetime) (చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)

డాలస్‌లో అత్తలూరి విజయలక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం : "నేనెవరిని" నవలావిష్కరణ
డాలస్, టెక్సస్: ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి యాభై ఏళ్ల సాహితీ ప్రస్థానాన్ని పురస్కరించు కుని తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన "అత్తలూరి సాహితీ స్వర్ణోత్సవం" సాహిత్యసభ పెద్ద సంఖ్యలో హాజరయిన సాహితీప్రియులు సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన తానా పూర్వాధ్యక్షులు, ప్రస్తుత తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అత్తలూరి కలంనుండి వివిధ అంశాలమీద ఇప్పటివరకు వెలువడ్డ 300 కథలు, 25 నవలలు, 100 రేడియో నాటికలు, 30 రంగస్థల నాటకాలు గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయన్నారు. ఆమె రచనలు సమాజంలోని వాస్తవపరిస్థితులకు అద్దం పడతాయని, పాఠకులను ఆలోచింపజేస్తాయని అన్నారు”.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సత్యం ఉపద్రష్ట మాట్లాడుతూ “విజయలక్ష్మి జీవనప్రస్థానాన్ని సాహిత్యవిజయాలతో మేళవించి, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆమె రచనలు ఎలా సాగుతాయో, తన తల్లిదండ్రుల ప్రతిభ ఎలా తనను తీర్దిదిద్దినదో, తన విజయంతోబాటు తన కుమార్తె రాజేశ్వరి విజయానికి కూడా ఎలా దారితీసిందో సోదాహరణంగా వివరించారు.”విశిష్టఅతిథులుగా హాజరైన ప్రముఖ రచయిత కన్నెగంటి చంద్ర తన ప్రసంగంలో విజయలక్ష్మి రచించిన "నేనెవరిని" నవలలోని ముఖ్యఅంశాలను విశ్లేషిస్తూ ఈ నవల కేవలం ఒక పుస్తకం కాదని, ఇది సమాజపు అంతరాత్మను ప్రశ్నించే ఒక శక్తివంతమైన ఆయుధమని అభివర్ణించారు. ఒక స్త్రీ తన అస్తిత్వం కోసం చేసే పోరాటాన్ని ఇంత హృద్యంగా చిత్రించడం రచయిత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.విజయలక్ష్మి వ్రాసిన 300 కథలనుండి కొన్ని కధలను ప్రస్తావిస్తూ రచయిత్రి ఎంచుకున్న కథా వస్తువును, శిల్పాన్ని, కథా గమనాన్ని ప్రముఖ రచయిత్రి సుజన పాలూరి వివరించగా, మొత్తం 130 నాటికలలో కొన్ని నాటికల ఇతివృత్తాలను, అవి సాగిన తీరును నాటకరంగ ప్రముఖులు డా. కందిమళ్ళ సాంబశివరావు విశ్లేషణ చేయగా, సాహితీవేత్త విజయ భాస్కర్ రాయవరం మరికొన్ని నాటకాలను, ముఖ్యంగా “ద్రౌపది” నాటకంలో ఆ పాత్రను మలచిన తీరు, రచనలోని లోతును, సామాజిక స్పృహను స్ప్రుశించారు.ముఖ్యఅతిథి డా. సత్యం ఉపద్రష్ట రచయిత్రి విజయలక్ష్మి వ్రాసిన “నేనెవరిని” నవలను ఆవిష్కరించి తొలి ప్రతిని సభాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూరకు అందజేశారు. సుప్రసిద్ధ రచయిత్రి సాహితీ స్వర్ణోత్సవం అమెరికాలో జరుపుకోవడం విశేషమంటూ డా. ప్రసాద్ తోటకూర హాజరైన సాహితీప్రియులందరితో కలసి అత్తలూరి విజయలక్ష్మికి “సాహితీ స్వర్ణోత్సవ విద్వన్మణి” అనే బిరుదు ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ “తన సాహితీ ప్రయాణంలో తన పాఠకులే తన బలమని, వారి అభిమానమే తనను ముందుకు నడిపిస్తుందని, ఈ 50 ఏళ్ళ సాహిత్య ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. "నేనెవరిని" నవల వ్రాయడానికి ప్రేరేపించిన సామాజిక పరిస్థితులను వివరిస్తూ, తన రచనల ద్వారా సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు”.ఈ సాహిత్యసభకు కావలసిన అన్ని ఏర్పాట్లును, విందుభోజనంతో సహా, మరియు సమర్దవంతంగా సభానిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన “రేడియో సురభి” బృందానికి, హాజరైన అతిథులకు, సాహితీప్రియులకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

వియత్నాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వియత్నాం రాజధాని హనోయి నగరంలో మంగళవారం ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గత వారం రోజులుగా వియత్నాంలో పర్యటిస్తున్న కరుణాకర రెడ్డి.. దివంగత రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఏ ప్రాంతంలో ఉన్నా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులున్నారని సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా వైఎస్ నిలిచి పోవడం జరిగిందని, అనేక రాష్ట్రాలలో ప్రస్తుత ముఖ్యమంతులు వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి, చరణ్ రెడ్డి, జివి లక్ష్మీ, వాణి రెడ్డి, నీహారిక, డేనియల్, ప్రశాంత్, పీటర్సన్, డాంగ్ జాన్, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

న్యూడ్‌కాల్స్ స్క్రీన్ షాట్లు పంపి..
హైదరాబాద్: న్యూడ్ కాల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపి మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తితో పాటు మరో మహిళపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట రసూల్‌పురాకు చెందిన మహిళ (39)కు సయ్యద్ జావేద్ (44)తో 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జావేద్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో బాధితురాలు అతనితో విడాకులు తీసుకుని వేరుగా నివాసం ఉంటుంది. అతడిపై ఆమె పెట్టిన కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా గత నెల 26న సయ్యద్ జావేద్ బాధితురాలికి ఫోన్ చేసి ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. తరచూ ఆమెతో మాట్లాడేవాడు. బాధితురాలు కూడా జావేద్‌ను నమ్మి అతనితో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆమెతో బలవంతంగా న్యూడ్‌కాల్స్ మాట్లాడించిన అతను కాల్స్‌కు సంబంధించి స్క్రీన్షాట్లను సేవ్ చేసి బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ యువకుడికి పంపాడు. అతను ఈ విషయం బాధితురాలి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న షాబానా అనే మహిళను నిలదీసింది. దీంతో జావేద్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో స్క్రీన్షాట్లను అందరికీ పంపతామని బెదిరించారు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సయ్యద్ జావేద్‌తో పాటు షబానాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్‌లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్‌హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు. ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్‌పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ వారే చంపారు...ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్‌నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్‌పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్‌ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు

Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.